Sobhita Dhulipala OTT: నేరుగా ఓటీటీలోకి నాగ చైతన్య లవర్ శోభితా ధూళిపాళ రొమాంటిక్ మూవీ- అనేక షేడ్స్ ఉంటాయంటూ కామెంట్స్
Sobhita Dhulipala Love Sitara OTT Release: నాగ చైతన్యకు కాబోయే భార్య, లవర్ శోభితా ధూళిపాళ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా మూవీ లవ్ సితార. నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్న ఈ మూవీపై శోభితా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మరి లవ్ సితార ఓటీటీ రిలీజ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఏంటనే వివరాల్లోకి వెళితే..
Sobhita Dhulipala Love Sitara OTT Streaming: నాగ చైతన్య లవర్, కాబోయే భార్య శోభితా ధూళిపాళ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. అడవి శేష్ గూడఛారి సినిమాతో తెలుగులో పరిచయమైన శోభితా ధూళిపాళ టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలతో పేరు తెచ్చుకుంది.
లవ్ సితార ట్రైలర్
బాలీవుడ్ రొమాంటిక్ వెబ్ సిరీసుల్లో హాట్‌గా నటించి బోల్డ్ హీరోయిన్ అనిపించుకున్న శోభితా ధూళిపాళ తాజాగా నటించిన సినిమా లవ్ సితార. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇటీవల లవ్ సితార ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. రెండు నిమిషాల 43 సెకన్ల నిడివి ఉన్న లవ్ సితార ట్రైలర్ చూస్తుంటే.. ఇదొక లవ్, రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ డ్రామా మూవీగా తెలుస్తోంది.
ప్రకృతి అందాలతో ఆకట్టుకునే కేరళ పచ్చటి అందాల నడుము తెరకెక్కిన కథే లవ్ సితారగా ట్రైలర్‌లో చూపించారు. తార (శోభితా ధూళిపాళ) ఓ స్వతంత్య్ర భావాలున్న ఇంటీరియర్ డిజైనర్. అంతర్జాతీయంగా మంచి పేరున్న చెఫ్ అర్జున్ (రాజీవ్ సిద్ధార్థ)తో ప్రేమలో పడుతుంది. వారిద్దరూ పెళ్లికి ముందు తార ఇంటికి వెళతారు.
దాగిన నిజాలు
అక్కడ వారి పెళ్లి జరగటానికి ముందు కుటుంబాల్లోని విభేదాలు, తెలియకుండా దాగిన నిజాలు బయటపడతాయి. చివరకు ఈ జంట ప్రయాణం ఎటువైపు సాగిందనేదే సినిమా కథ. ఈ సినిమాలో శోభితా ధూళిపాళతోపాటు రాజీవ్ సిద్ధార్థ, సోనాలి కులకర్ణి, బి. జయశ్రీ, రోడ్రిగ్స్, సంజయ్ భూటియాని, తమరా డిసౌజా, రిజుల్ రే తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ఇక లవ్ సితార మూవీ జీ5 ఓటీటీలో సెప్టెంబర్ 27న నేరుగా రిలీజ్ కానుంది. జీ5 ఒరిజినల్ ఫిల్మ్‌గా తెరకెక్కిన లవ్ సితారా ఓటీటీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా శోభితా ధూళిపాళ మాట్లాడుతూ.. "సితారలో నటిచడం చక్కటి అనుభూతినిచ్చింది. నేను పోషించిన పాత్రలో అనేక షేడ్స్ ఉన్నాయి. వైవిధ్యమైన పాత్ర. స్వతంత్య్ర భావాలున్న ఇంటీరియర్ డిజైనర్ పాత్రలో నటించాను. నిజాయతీగా ఉండే ఓ అమ్మాయి తన జీవితంలో ఎదురైన సవాళ్లను ధైర్యంగా ఎలా ఎదుర్కొందనేదే కథ. చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి" అని చెప్పింది.
వాస్తవికతకు దగ్గరిగా
నటుడు రాజీవ్ సిద్ధార్థ "లవ్ సితార ట్రైలర్ అందరినీ ఆకట్టుకోవటం చాలా సంతోషంగా ఉంది. అందులో అర్జున్ అనే పాత్రలో నటించాను. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే క్రమంలో ఎలాంటి మలుపు తీసుకుంది. నా చుట్టు ఉన్న పాత్రల్లో ఉన్న సంక్లిష్టత వాస్తవికతను ఎంత దగ్గరగా ఉంటాయనేది ఆసక్తిని రేపుతుంది. శోభితగారితో కలిసి నటించటం మంచి ఎక్స్‌పీరియెన్స్. జీ5 ప్రేక్షకులను ఈ ఒరిజల్ ఫిల్మ్ మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. లవ్ సితార ప్రతి వీక్షకుడికి నచ్చుతుందని నేను నమ్ముతున్నాను" నటుడు రాజీవ్ సిద్ధార్థ తెలిపాడు.
డైరెక్టర్ వందన కటారియా మాట్లాడుతూ "లవ్ సితార అనేది ప్రేక్షకులకు ఓ ఆహ్లాదకరమైన ప్రయాణం. చక్కటి ఫ్యామిలీ డ్రామా. ఆర్ఎస్‌వీపీ ప్రొడక్షన్‌తో కలిసి పని చేయటం, అలాగే ఈ ప్రయాణంలో జీ5 నుంచి దొరికిన మద్ధతు చూసి థ్రిల్ ఫీల్ అవుతున్నాను. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ప్రేమ, కుటుంబంలో వ్యక్తుల మధ్య ఉండే భావోద్వేగాలను ఇందులో చక్కగా చూపించాం" అని చెప్పుకొచ్చారు.