Ram Charan New Look: గేమ్ ఛేంజర్‌ నుంచి రామ్‍చరణ్ కొత్త లుక్ లీక్: వివరాలివే-ram charan new look leaked for game changer sets ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ram Charan New Look Leaked For Game Changer Sets

Ram Charan New Look: గేమ్ ఛేంజర్‌ నుంచి రామ్‍చరణ్ కొత్త లుక్ లీక్: వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 15, 2024 05:21 PM IST

Game Changer - Ram Charan Look: గేమ్ ఛేంజర్ సినిమాకు మరోసారి లీకుల బెడద తగిలింది. షూటింగ్ సెట్స్ నుంచి రామ్‍చరణ్ కొత్త లుక్ లీకైంది. ఈ లుక్‍లో చెర్రీ అదిరిపోయారు. వివరాలివే..

గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్‍చరణ్ లుక్
గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్‍చరణ్ లుక్

Ram Charan Look - Game Changer: గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అయితే, ఈ మూవీ షూటింగ్ చాలా ఆలస్యమవుతోంది. ఈ సినిమా మొదలై రెండేళ్లు దాటినా ఇంకా ఓ కొలిక్కి రాలేదు. తమిళ సీనియర్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ ఇంకా సాగుతోంది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ఆంధ్రప్రదేశ్‍లోని విశాఖపట్టణంలో జరుగుతోంది. అయితే, ఈ తరుణంలో గేమ్ ఛేంజర్ సినిమాకు మరోసారి లీకుల బెడద తగిలింది.

రామ్‍చరణ్ కొత్త లుక్

వైజాగ్‍లో గేమ్ ఛేంజర్ సినిమా సెట్స్ నుంచి రామ్‍చరణ్ ఫొటోలు కొన్ని తాజాగా లీక్ అయ్యాయి. వీటి ద్వారా ఈ చిత్రంలో రామ్‍చరణ్ కొత్త లుక్ రివీల్ అయింది. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పూర్తిగా క్లీన్ షేవ్, మీసంతో రామ్‍చరణ్ ఈ నయా లుక్‍లో అదిరిపోయారు. స్పెక్ట్స్ ధరించి క్లాస్ లుక్‍లో సూపర్‌గా ఉన్నారు. ఆ చిత్రంలో ఓ పొలిటికల్ పార్టీ మీటింగ్ సందర్భంగా చెర్రీ ఈ లుక్‍లో కనిపించనున్నారని టాక్. సెట్స్ నుంచి చరణ్‍కు సంబంధించిన మరో వీడియో కూడా లీక్ అయింది. అదే లుక్‍లో గాగుల్స్ ధరించి చెర్రీ మెట్లు దిగి వస్తున్న వీడియో బయటికి వచ్చింది.

రామ్‍చరణ్ కొత్త లుక్‍కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యాన్స్, నెటిజన్లు వీటిని షేర్ చేసుకుంటున్నారు. చెర్రీ కొత్త లుక్ చూసి అభిమానులు సంబరపడుతున్నారు. గేమ్ ఛేంజర్ చిత్రంపై హైప్ మరింత పెరిగిపోయింది.

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా గేమ్ ఛేంజర్ చిత్రాన్ని దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు. ముందు ఐఏఎస్ అధికారిగా ఉండే రామ్‍చరణ్.. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యే క్యారెక్టర్ ఈ చిత్రంలో చేస్తున్నారని బజ్ ఉంది. గ్లోబల్ బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత రామ్‍చరణ్ చేస్తున్న మూవీ కావడం, శంకర్ చాలాకాలం తర్వాత పొలిటికల్ సబ్జెక్టుతో మూవీ చేస్తుండడంతో గేమ్ ఛేంజర్ చిత్రంపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.

గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్‍చరణ్ సరసన కియారా అడ్వానీ హీరోయిన్‍గా నటిస్తున్నారు. అంజలి, ఎస్‍జే సూర్య, జయరాం, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నాజర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఫస్ట్ సాంగ్ ఆరోజే..

గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రెడీ అవుతోంది. రామ్‍చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27వ తేదీన ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ రానుంది. దిల్ రాజుతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా ఈ విషయాన్ని చెప్పేశారు. దీంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూవీ రిలీజ్ డేట్‍ను కూడా టీమ్ వెల్లడించే అవకాశం ఉంది.

గేమ్ ఛేంజర్ చిత్రం తర్వాత ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానాతో స్పోర్ట్స్ డ్రామా మూవీ (RC16) చేయనున్నారు రామ్‍చరణ్. ఈ మూవీ పూజా కార్యక్రమాలు మార్చి 20న ఉంటాయని రూమర్లు వస్తున్నాయి.

IPL_Entry_Point