RC 16: రామ్‍చరణ్ నెక్స్ట్ సినిమా పూజా కార్యక్రమానికి డేట్ ఖరారు! టైటిల్‍పై రూమర్
Ram Charan, Buchi Babu RC 16: రామ్‍చరణ్, బుచ్చిబాబు సానా కాాంబినేషన్‍లో రూపొందనున్న సినిమా పుజా కార్యక్రమానికి డేట్ ఖరారైందని తెలుస్తోంది. అలాగే టైటిల్‍పై రూమర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాలివే..
RC 16: మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ తేజ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో హీరోగా చెర్రీ నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ హిట్ తర్వాత రామ్‍చరణ్ నుంచి రానున్న సినిమా ఇదే. దీంతో గేమ్ ఛేంజర్‌పై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. అయితే, ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో తదుపరి మూవీ (RC16) చేయనున్నారు రామ్‍చరణ్. ఈ సినిమా ప్రారంభం గురించి సమాచారం బయటికి వచ్చింది.
తేదీ ఇదే
రామ్‍చరణ్, బుచ్చిబాబు కాంబోలో ఉత్తరాంధ్ర బ్యాక్‍డ్రాప్ స్టోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం ఉండనుంది. ఆ సినిమా పూజా కార్యక్రమాలు మార్చి 20వ తేదీన జరగనున్నాయని సమాచారం బయటికి వచ్చింది. ఆ కార్యక్రమంలో ఈ చిత్రం షురూ కానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకోసం మూవీ టీమ్ ప్లానింగ్ పూర్తి చేసినట్టు టాక్. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది.
టైటిల్ ఇదేనా?
రామ్‍చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి ‘పెద్ది’ (Peddi) అనే టైటిల్‍ను ఖరారు చేసినట్టు సినీ సర్కిల్‍లో టాక్ వినిపిస్తోంది. ఈ టైటిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ టైటిల్ విషయం పూజా కార్యక్రమం రోజు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది.
రామ్‍చరణ్ పుట్టిన రోజు మార్చి 27న కాగా.. అందుకు సరిగ్గా వారం రోజుల ముందు మార్చి 20న ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని మూవీ టీమ్ నిర్వహించనుంది. ఈ సందర్భంగా రిలీజ్ ఎప్పుడు చేయాలనుకుంటున్న విషయాన్ని కూడా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని విషయాలు కూడా బయటికి రావొచ్చు.
ఈ చిత్రంలో రామ్‍చరణ్‍కు జోడీగా బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటించనున్నారు. ఇటీవల జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని ఆర్సీ16 టీమ్ అధికారికంగా వెల్లడించింది. రామ్‍చరణ్‍కు ఇది 16వ సినిమా కావడంతో ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ RC16గానే ఈ చిత్రాన్ని పిలుస్తున్నారు.
రామ్‍చరణ్, బుచ్చిబాబు కాంబో రూపొందనున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగినట్టు సమాచారం బయటికి వచ్చింది. ఈ మూవీ సబ్జెక్ట్ బాగా నచ్చి ఎక్కువ సమయం కేటాయించేందుకు కూడా రహమాన్ ఆసక్తిగా ఉన్నారని టాక్ వినిపించింది.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఉత్తరాంధ్ర మల్లయోధుడు, రెజ్లర్ కోడి రామ్మూర్తి జీవితం ఆధారంగా బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కించనున్నారన్న రూమర్లు కూడా ఉన్నాయి. ఈ విషయాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.
గేమ్ ఛేంజర్ సాంగ్
రామ్‍చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27వ తేదీన గేమ్ ఛేంజర్ చిత్రం నుంచి తొలి పాట రానుంది. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా ఇటీవలే ఓ టీవీ కార్యక్రమంలో వెల్లడించారు. జరగండి.. జరగండి పాటనే మూవీ టీమ్ తీసుకురానున్నట్టు తెలుస్తోంది. గతేడాది దీపావళికి ఈ పాటను తీసుకొస్తామని ప్రకటించి వాయిదా వేసింది మూవీ టీమ్. ఇప్పుడు చెర్రీ పుట్టిన రోజుకు మార్చి 27న ఈ సాంగ్‍ను రిలీజ్ చేయాలని నిశ్చయించుకుంది. ఈ పాటతోనే గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ డేట్ కూడా వస్తుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.