Janhvi Kapoor: శిఖర్ పహారియాతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్: వీడియో-janhvi kapoor visits tirumala temple with shikhar pahariya and maheshwari on her birthday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Janhvi Kapoor: శిఖర్ పహారియాతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్: వీడియో

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్: వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 06, 2024 03:21 PM IST

Janhvi Kapoor visits Tirumala Temple: తిరుమల శ్రీవారిని దర్శించున్నారు హీరోయిన్ జాన్వీ కపూర్. తన పుట్టిన రోజున స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.

తిరుమలలో జాన్వీ కపూర్, వెనుక శిఖర్ పహారియా
తిరుమలలో జాన్వీ కపూర్, వెనుక శిఖర్ పహారియా

Janhvi Kapoor Birthday: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ 27వ ఏట అడుగుపెట్టారు. నేడు (మార్చి 6) ఆమె పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున తిరుమల ఆలయానికి వచ్చారు జాన్వీ కపూర్. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆశీర్వాదాలు పొందారు.

తన పుట్టిన రోజైన నేడు తిరుమలకు విచ్చేశారు జాన్వీ కపూర్. వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఎరుపు రంగు చీరలో సంప్రదాయబద్ధంగా ఆలయానికి వచ్చారు జాన్వీ.

జాన్వీ వెంట శిఖర్

తిరుమల ఆలయానికి జాన్వీ కపూర్ వెంట శిఖర్ పహారియా కూడా వచ్చారు. జాన్వీకి శిఖర్ బాయ్‍ఫ్రెండ్‍గా ఉన్నారని కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఇద్దరూ కలిసి చాలా చోట్ల కనిపించారు. ఇప్పుడు ఆలయానికి కూడా కలిసే వచ్చారు. శిఖర్ పహారియా పంచె కట్టులో, కండువా ధరించి సంప్రదాయ వేషధారణలో స్వామి వారిని దర్శించుకున్నారు.

అలనాటి హీరోయిన్ మహేశ్వరి కూడా జాన్వీ కపూర్ వెంట ఉన్నారు. జాన్వీ కుటుంబానికి ఆమె దగ్గరి బంధువు. బెస్ట్ ఫ్రెండ్ అర్హన్ అవత్రమణి (ఓరీ) కూడా జాన్వీ వెంట వచ్చారు.

అలనాటి దిగ్గజ హీరోయిన్ శ్రీదేవి కుమార్తె అయిన జాన్వీ కపూర్‌కు భక్తి ఎక్కువ. ఇప్పటికే ఆమె చాలా సార్లు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఇప్పుడు పుట్టిన రోజున మరోసారి తిరుమల ఆలయాన్ని సందర్శించారు.

దేవరతో టాలీవుడ్‍లోకి..

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర చిత్రంతో జాన్వీ కపూర్ టాలీవుడ్‍లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీలో తంగం పాత్రలో ఆమె నటిస్తున్నారు. పుట్టిన రోజు సందర్భంగా జాన్వీ కపూర్ కొత్త పోస్టర్‌ను దేవర మూవీ టీమ్ నేడు రిలీజ్ చేసింది. చీరలో క్యూట్ స్మైల్‍తో ఈ పోస్టర్‌ జాన్వీ లుక్ సూపర్‌గా ఉంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‍లో విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. అక్టోబర్ 10న దేవర పార్ట్-1 రిలీజ్ చేస్తామని ఇటీవలే మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది.

రామ్‍చరణ్ చిత్రంలో..

మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ తదుపరి చిత్రం(RC16)లో జాన్వీ కపూర్ హీరోయిన్‍గా చేయనున్నారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు అధికారికంగా వెల్లడించింది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోకి జాన్వీ కపూర్‌ను ఆహ్వానిస్తూ మూవీ టీమ్ నేడు ట్వీట్ చేసింది.

ఆర్‌సీ16 సినిమా స్పోర్ట్స్ బ్యాక్‍డ్రాప్‍లో పీరియాడిక్ మూవీగా ఉండనుందని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర మల్లయోధుడు, రెజ్లర్ కోడి రామ్మూర్తి నాయుడు జీవితం ఆధారంగా ఈ చిత్రం ఉంటుందనే రూమర్లు ఉన్నాయి. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

మరోవైపు, రామ్‍చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యాక ఆర్‌సీ 16 చిత్రీకరణలో పాల్గొననున్నారు. దేవర తర్వాత జాన్వీ కపూర్‌కు తెలుగులో ఇది రెండో మూవీ కానుంది.