Janhvi Kapoor: అటు రామ్‌…ఇటు భీమ్ - ఇద్ద‌రితో జాన్వీక‌పూర్ రొమాన్స్ - ఆర్‌సీ 16లో హీరోయిన్ ఫిక్స్-janhvi kapoor to pair up with ram charan in buchi babu sana movie rc 16 update ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Janhvi Kapoor To Pair Up With Ram Charan In Buchi Babu Sana Movie Rc 16 Update

Janhvi Kapoor: అటు రామ్‌…ఇటు భీమ్ - ఇద్ద‌రితో జాన్వీక‌పూర్ రొమాన్స్ - ఆర్‌సీ 16లో హీరోయిన్ ఫిక్స్

Nelki Naresh Kumar HT Telugu
Mar 06, 2024 09:51 AM IST

Janhvi Kapoor: దేవ‌ర త‌ర్వాత తెలుగులో మ‌రో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది జాన్వీక‌పూర్‌. రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టించ‌బోతున్న‌ది. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న మూవీలో జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా ఎంపికైంది.

రామ్ చ‌ర‌ణ్‌, జాన్వీక‌పూర్‌
రామ్ చ‌ర‌ణ్‌, జాన్వీక‌పూర్‌

Janhvi Kapoor: తెలుగులో జాన్వీక‌పూర్ మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ అందుకున్న‌ది. ఇప్ప‌టికే ఎన్టీఆర్‌తో దేవ‌ర మూవీ చేస్తోన్న ఈ బ్యూటీ మ‌రో టాప్‌ హీరోతో జోడీక‌ట్ట‌బోతున్న‌ది. రామ్‌చ‌ర‌ణ్‌తో రొమాన్స్ చేయ‌బోతున్న‌ది. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియ‌న్‌ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్‌, వృద్ధి సినిమాస్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

హీరోయిన్‌గా జాన్వీ...

ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీక‌పూర్ పేరును మేక‌ర్స్‌ అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. బుధ‌వారం జాన్వీక‌పూర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రామ్‌చ‌ర‌ణ్ మూవీలో ఆమె హీరోయిన్‌గా న‌టించ‌నునున్న విష‌యాన్ని వెల్ల‌డించారు. జాన్వీక‌పూర్‌కు సినిమాలోకి స్వాగ‌తం చెబుతూ ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో ట్రెడిష‌న‌ల్ లుక్‌లో జాన్వీ క‌నిపిస్తోంది.

స‌మంత‌...పూజాహెగ్డే...

రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తోన్న 16వ సినిమా ఇది. సినిమాలో హీరోయిన్‌గా ఎవ‌రు అన్న‌ది చాలా రోజులుగా స‌స్పెన్స్‌గా ఉండిపోయింది. ర‌ష్మిక మంద‌న్న‌, పూజాహెగ్డే, స‌మంత‌తో పాటు ప‌లు అగ్ర‌హీరోయిన్లు పేర్లు వినిపించాయి. చివ‌ర‌కు ఈ అవ‌కాశం జాన్వీ క‌పూర్‌ను వ‌రించింది.

ఆర్ఆర్ఆర్ హీరోల‌తో...

ఎన్టీఆర్ దేవ‌ర సినిమాతో జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. ఈ సినిమా రిలీజ్ కాక‌ముందే రామ్‌చ‌ర‌ణ్‌తో జోడీక‌ట్టే అవ‌కాశాన్ని ద‌క్కించుకున్న‌ది. ఆర్ఆర్ఆర్ హీరోలు ఇద్ద‌రితో ఈ బ్యూటీ రొమాన్స్ చేయ‌బోతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

రెహ‌మాన్ మ్యూజిక్‌

ఆర్‌సీ 16 సినిమాకు ఏఆర్ రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ ఏడాది వేస‌వి త‌ర్వాత ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకాబోతున్న‌ట్లు తెలిసింది. ఇప్ప‌టికే ఆర్‌సీ 16 షూటింగ్ మొద‌లుకావాల్సింది. కానీ గేమ్ ఛేంజ‌ర్ కార‌ణంగా ఆల‌స్య‌మ‌వుతోన్న‌ట్లు స‌మాచారం. ఆర్‌సీ 16 రా అండ్ ర‌స్టిక్‌గా ఉంటుంద‌ని స‌మాచారం. ఈ మూవీ కోసం రామ్‌చ‌ర‌ణ్ స్పెష‌ల్ మేకోవ‌ర్ కాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఉప్పెన బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా ఇది.

గేమ్ ఛేంజ‌ర్‌తో బిజీ...

ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. దాదాపు రెండు వంద‌ల కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ ఏడాది చివ‌ర‌లో గేమ్ ఛేంజ‌ర్ రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. గేమ్ ఛేంజ‌ర్ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు.పాన్ ఇండియ‌న్ లెవెల్‌తో తెలుగుతో పాటు త‌మిళం, హిందీ భాష‌ల్లో గేమ్ ఛేంజ‌ర్ రిలీజ్ కాబోతోంది. రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా మార్చి 27న ఈ సినిమాలోని ఫ‌స్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయ‌బోతున్నారు.

దేవ‌ర రిలీజ్ అప్పుడే...

మ‌రోవైపు దేవ‌ర మూవీ అక్టోబ‌ర్ 10న రిలీజ్ కాబోతోంది. ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సిన దేవ‌ర‌ మూవీ షూటింగ్ డిలే వ‌ల్ల వాయిదాప‌డింది. ఎన్టీఆర్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీకి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. హిందీలో మిస్ట‌ర్ అండ్ మిస్ మ‌హి సినిమాలో జాన్వీక‌పూర్ క్రికెట‌ర్‌గా క‌నిపించ‌బోతున్న‌ది. ఈ సినిమాతో పాటు ఉల్జాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది.

WhatsApp channel