Janhvi Kapoor: వినాయక నిమజ్జనంలో జాన్వీ కపూర్ డ్యాన్స్: బాయ్‍ఫ్రెండ్ అతడేనా? : వీడియో-janhvi kapoor dances with rumored boyfriend shikhar pahariya at ganpati visarjan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Janhvi Kapoor: వినాయక నిమజ్జనంలో జాన్వీ కపూర్ డ్యాన్స్: బాయ్‍ఫ్రెండ్ అతడేనా? : వీడియో

Janhvi Kapoor: వినాయక నిమజ్జనంలో జాన్వీ కపూర్ డ్యాన్స్: బాయ్‍ఫ్రెండ్ అతడేనా? : వీడియో

Janhvi Kapoor: వినాయక నిమజ్జనం సందర్భంగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

Janhvi Kapoor: వినాయక నిమజ్జనంలో జాన్వీ కపూర్ డ్యాన్స్: బాయ్‍ఫ్రెండ్ అతడేనా?

Janhvi Kapoor: బాలీవుడ్‍లో జాన్వీ కపూర్ స్టార్ హీరోయిన్‍గా ఎదుగుతున్నారు. 2018లో దఢక్ సినిమాతో తెరంగేట్రం చేసిన జాన్వీ.. ఆ తర్వాత చేసిన చిత్రాల్లోనూ తన అందం, అభినయంతో మెప్పిస్తున్నారు. శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. క్రమంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర చిత్రంతో టాలీవుడ్‍లోనూ అడుగుపెడుతున్నారు జాన్వీ. కాగా, ఇటీవల వినాయక నిమజ్జనంలో జాన్వీ కపూర్ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. వివరాలివే..

ముంబైలో అంబానీ కుటుంబం ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసే వేడుకలో జాన్వీ కపూర్ పాల్గొన్నారు. విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళుతున్న సమయం జాన్వీ డ్యాన్స్ చేశారు. జనాల మధ్యే చిందేశారు. ఆ సమయంలో జాన్వీ కపూర్ పక్కనే శిఖర్ పహారియా ఉన్నారు. వైట్ కుర్తా వేసుకున్న పహారియా కూడా జాన్వీతో కాలు కదిపారు. శిఖర్ పహారియానే జాన్వీ కపూర్ బాయ్ ఫ్రెండ్ అంటూ కొంతకాలంగా రూమర్లు వినిపిస్తున్నాయి. కొన్నిసార్లు వీరిద్దరూ కలిసి బయటికి వచ్చినప్పుడు కెమెరాలకు చిక్కారు.

జాన్వీ, పహారియా ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు కెమెరాలకు చిక్కారు. జాన్వీ, పహారియా డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వరుణ్ ధావన్‍తో కలిసి ఇటీవల బావల్ చిత్రంలో నటించారు జాన్వీ కపూర్. ప్రస్తుతం ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా రేంజ్ భారీ బడ్జెట్ సినిమా దేవరలో హీరోయిన్‍గా చేస్తున్నారు జాన్వీ. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టైగర్ ష్రాఫ్ చేయనున్న తదుపరి సినిమాలోనూ జాన్వీ కపూర్ నటించనున్నారని తెలుస్తోంది.