Family Star Second Song: ఫ్యామిలీ స్టార్ నుంచి పెళ్లి పాట వచ్చేసింది.. ఫుల్ జోష్‍గా.. చూడముచ్చటగా విజయ్, మృణాల్
Family Star Kalyani Vaccha Vacchaa Song: ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచి రెండో పాట రిలీజ్ అయింది. పెళ్లి పాటగా వచ్చిన ఈ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. విజయ్ దేవరకొండ, మృణాల్ మరోసారి అదిరిపోయారు.
Family Star Second Song: ఫ్యామిలీ స్టార్ చిత్రంపై మొదటి నుంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇటీవల వచ్చిన టీజర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఇప్పటికే ‘నందనందన’ అంటూ ఈ చిత్రం నుంచి వచ్చిన సాంగ్ బాగా పాపులర్ అయింది. విజయ్ వేసిన హుక్ స్టెప్ సూపర్ వైరల్‍గా మారింది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచి రెండో పాట వచ్చేసింది. నేడు (మార్చి 12) ఈ సెకండ్ సాంగ్ లిరికల్ వీడియోను మూవీ టీమ్ విడుదల చేసింది.
మ్యారేజ్ సాంగ్
ఫ్యామిలీ స్టార్ నుంచి వచ్చిన ‘కల్యాణి వచ్చా వచ్చా’ పెళ్లి పాటగా ఉంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ వివాహం సందర్భంలో వచ్చే సాంగ్‍గా ఉండనుంది. ఈ లిరికల్ వీడియోలో ట్రెడిషనల్ దుస్తుల్లో విజయ్ దేవకొండ, మృణాల్ ఠాకూర్ చూడముచ్చటగా ఉన్నారు. డ్యాన్స్ కూడా అదరగొట్టారు. మెలోడీగా ఉంటూనే జోష్‍గా కూడా ఈ సాంగ్ ఉంది.
‘కల్యాణి వచ్చా వచ్చా’ పాటను మంగ్లీ, కార్తీక్ ఆలపించారు. మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ మరోసారి మంచి ట్యూన్ ఇచ్చారు. ఈ పాటకు రిలిక్స్ అందించారు అనంత్ శ్రీరాం.
హుషారుగా ఉన్న ఈ మ్యారేజ్ సాంగ్ కూడా బాగా పాపులర్ అయ్యేలా ఉంది. ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ నుంచి వచ్చిన ‘నందనందన’ సాంగ్ ఫేమస్ అయింది. ఈ పాటతో ఈ మూవీకి మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమా ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఫ్యామిలీ స్టార్ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్నా క్యామియో రోల్‍లో కనిపించారని తెలుస్తోంది. అయితే, ఈ మ్యారేజ్ సాంగ్‍లోనే రష్మిక ఈ సినిమాలో కనిపిస్తారని రూమర్లు ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఈ లిరికల్ సాంగ్‍లో రష్మికను మేకర్స్ చూపించలేదు.
ఫ్యామిలీ స్టార్ సినిమాకు పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ - పరశురాం - గోపీసుందర్ కాంబోలో గతంలో వచ్చిన గీతగోవిందం బ్లాక్ బస్టర్ అయింది. ఫ్యామిలీ స్టార్ మూవీతో వారి కాంబో రిపీట్ అవుతోంది. దీంతో అంచనాలు భారీగా ఉన్నాయి. పాటలు కూడా అదిరిపోవటంతో హైప్ విపరీతంగా పెరుగుతోంది.
ఫ్యామిలీ స్టార్ సినిమాలో మధ్య తరగతి కుటుంబ బాధ్యతలు ఉన్న వ్యక్తిగా విజయ్ దేవరకొండ నటించారు. ఇటీవలే వచ్చిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ర్యాప్ సాంగ్‍తో కూడిన ఈ టీజర్ ఆకట్టుకుంది. యాక్షన్‍తో పాటు ఫ్యామిలీ అంశాలతో వచ్చింది. మృణాల్ ఠాకూర్‌తో విజయ్ చెప్పిన పెట్రోల్ డైలాగ్ బాగా వైరల్ అయింది. దీనిపై మీమ్స్ కూడా వచ్చాయి. టీజర్లో మృణాల్ కాసేపే కనిపించినా హైలైట్‍గా నిలిచారు.
ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషషన్స్ పతాకంపై దిల్‍రాజు శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ మూవీ విడుదలవుతుంది.