Family Star Teaser: ఫ్యామిలీ స్టార్ టీజర్ వచ్చేసింది.. ర్యాప్ సాంగ్‍తో అదుర్స్.. హైలైట్‍గా పెట్రోల్ డైలాగ్-vijay deverakonda mrunal thakur starrer family star movie teaser released with rap song ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Family Star Teaser: ఫ్యామిలీ స్టార్ టీజర్ వచ్చేసింది.. ర్యాప్ సాంగ్‍తో అదుర్స్.. హైలైట్‍గా పెట్రోల్ డైలాగ్

Family Star Teaser: ఫ్యామిలీ స్టార్ టీజర్ వచ్చేసింది.. ర్యాప్ సాంగ్‍తో అదుర్స్.. హైలైట్‍గా పెట్రోల్ డైలాగ్

Family Star Movie Teaser: ఫ్యామిలీ స్టార్ సినిమా టీజర్ వచ్చేసింది. ర్యాప్ సాంగ్‍తో ఉన్న ఈ టీజర్ సూపర్‌గా ఉంది. హీరో విజయ్ దేవరకొండ అదరగొట్టారు.

Family Star Teaser: ఫ్యామిలీ స్టార్ టీజర్ వచ్చేసింది.. ర్యాప్ సాంగ్‍తో అదుర్స్.. హైలైట్‍గా పెట్రోల్ డైలాగ్

Family Star Teaser: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీపై చాలా ఆసక్తి ఉంది. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గీతగోవిందం తర్వాత విజయ్ - పరుశురామ్ కాంబో రిపీట్ అవుతోంది. ఈ చిత్రం నుంచి ఇటీవల వచ్చిన నందనందన పాట చాలా పాపులర్ అయింది. ఈ చిత్రంలో పిల్లల తండ్రిగా పక్కా ఫ్యామిలీ మ్యాన్‍ పాత్రను విజయ్ పోషించడం కూడా క్యూరియాసిటీని పెంచింది. ఈ క్రమంలో నేడు (మార్చి 4) ఫ్యామిలీ స్టార్ సినిమా టీజర్ రిలీజ్ అయింది.

పంచె కట్టులో భుజంపై సంచితో విజయ్ దేవరకొండ ఎంట్రీతో ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ షూరు అయింది. ఆ తర్వాత ఫైట్ సీన్ ఉంది. విజయ్ ఇంట్లో పూజ చేస్తూ, దోశలు వేస్తూ ఫ్యామిలీ మ్యాన్‍లా కనిపించాడు. “దేఖోరే.. దేఖోరే.. దేఖోరే దేఖో.. కలియుగ రాముడు వచ్చిండు కాకో” అంటూ ర్యాప్ సాంగ్‍తో ఫ్యామిలీ స్టార్ టీజర్ అదిరిపోయింది. యాక్షన్‍తో పాటు ఫ్యామిలీ అంశాలతో ఈ టీజర్ ఆకట్టుకుంది.

“ఏవండి.. కాలేజ్‍కు వెళ్లాలి.. కొంచెం దించేస్తారా” అని మృణాల్ ఠాకూర్ అంటే.. “ఓ లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా” అని విజయ్ అనడంతో టీజర్ ముగిసింది. ఈ డైలాగ్ ఈ టీజర్‌కు హైలైట్‍గా నిలిచింది. ఈ టీజర్లో విజయ్ ఫుల్ జోష్‍తో కనిపించాడు. 64 సెకన్లు ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‍గా సాగింది. మిడిల్ క్లాస్ రాము పాత్రలో ఈ చిత్రంలో చేశారు విజయ్. ఓవైపు ఇంటి బాధ్యతలను చూసుకోవడంతో పాటు విలన్ల తాటతీసే క్యారెక్టర్‌లో అతడి నటన అదిరిపోయేలా కనిపిస్తోంది. ఫ్యామిలీ స్టార్ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఫ్యామిలీ స్టార్ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‍లో రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ నిర్ణయించింది. అయితే, ఇప్పటికి తెలుగు టీజర్ మాత్రమే వచ్చింది. మిగిలిన భాషల్లో త్వరలోనే వచ్చే ఛాన్స్ ఉంది.

ఆలస్యంగా టీజర్.. ఫ్యాన్స్ అసహనం

ఫ్యామిలీ స్టార్ టీజర్‌ను నేటి సాయంత్రం తీసుకొస్తామని మేకర్స్ ముందుగా ప్రకటించారు. అయితే, ఆలస్యమైంది. దీంతో చాలా మంది ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత రాత్రి 8.19 నిమిషాలకు తెస్తామని ప్రకటించినా.. అప్పుడు కూడా రిలీజ్ కాలేదు. దీంతో కొందరు నెటిజన్లు అసహనం చెందారు. మొత్తానికి రాత్రి 9 గంటల 15 నిమిషాల తర్వాత ఈ టీజర్‌ను మేకర్స్ తీసుకొచ్చారు.

ఫ్యామిలీ స్టార్ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. సంక్రాంతికే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మూవీ టీమ్ ముందుగా భావించింది. అయితే, అప్పటికి సినిమా రెడీ అవలేదు. దేవర సినిమా వాయిదా పడడంతో ఏప్రిల్ 5ను ఎంపిక చేసుకుంది.

లైగర్, ఖుషీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఫ్యామిలీ స్టార్ చిత్రంపై విజయ్ దేవరకొండ భారీ ఆశలు పెట్టుకున్నారు. టీజర్‌తో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. మరి, ఈ చిత్రంతో అయినా విజయ్ మళ్లీ హిట్ బాటపడతారేమో చూడాలి.