Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్‍న్యూస్.. ‘హరిహర వీరమల్లు’పై అప్‍డేట్ ఇచ్చిన నిర్మాణ సంస్థ-hari hara veera mallu movie update pawan kalyan film vfx works on going ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్‍న్యూస్.. ‘హరిహర వీరమల్లు’పై అప్‍డేట్ ఇచ్చిన నిర్మాణ సంస్థ

Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్‍న్యూస్.. ‘హరిహర వీరమల్లు’పై అప్‍డేట్ ఇచ్చిన నిర్మాణ సంస్థ

Pawan Kalyan Hari Hara Veera Mallu Movie: హరిహర వీరమల్లు సినిమా గురించి నిర్మాణ సంస్థ అప్‍డేట్ ఇచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న ఈ మూవీ వర్క్స్ గురించి వెల్లడించింది.

Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్‍న్యూస్.. ‘హరిహర వీరమల్లు’పై అప్‍డేట్ ఇచ్చిన నిర్మాణ సంస్థ

Hari Hara Veera Mallu Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ సుమారు నాలుగేళ్ల క్రితం మొదలైంది. స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఆరంభంలో చిత్రీకరణ జోరుగా సాగింది. అయితే, ఆ తర్వాత కరోనా రావటంతో బ్రేక్‍లు పడ్డాయి. ఇక అప్పటి నుంచి ఈ మూవీకి అనేక అవరోధాలు వచ్చాయి. అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందో.. రద్దవుతుందో అనే అనుమానాలు వచ్చాయి. ఒక్క గ్లింప్స్ మినహా పెద్దగా అలాంటి అప్‍డేట్లు రాలేదు. అందులోనూ దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడంటూ ఇటీవల రూమర్లు బయటికి వచ్చాయి. దీంతో ఈ అనుమానాలు బలపడ్డాయి. ఈ తరుణంలో నేడు (ఫిబ్రవరి 12) హరిహర వీరమల్లును నిర్మిస్తున్న ప్రొడక్షన్ హౌస్ ఓ కీలకమైన అప్‍డేట్ ఇచ్చింది.

హరిహర వీరమల్లు సినిమా వీఎఫ్‍ఎక్స్ పనులు జరుగుతున్నాయని మెగా సూర్య ప్రొడక్షన్స్ సంస్థ నేడు వెల్లడించింది. దీంతో ఈ చిత్రం క్యాన్సిల్ కాలేదని సంకేతాలు ఇస్తూ.. పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్‍న్యూస్ చెప్పింది. ఈ చిత్రం అందరి ఊహలకు మించి ఉంటుందని ప్రకటన ద్వారా వెల్లడించింది.

కొన్ని సిటీల్లో ప్రస్తుతం ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయని ప్రొడక్షన్ హౌస్ పేర్కొంది. “విప్లవ యోధుడి సినిమా ‘హరిహర వీరమల్లు’ గురించి అప్‍డేట్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న పవర్ స్టార్ అభిమానులు, సినిమా ప్రేమికులందరికీ.. ప్రస్తుతం ఈ ప్రతిష్టాత్మక సినిమా హైఎండ్ వీఎఫ్‍ఎక్స్ పనులు ఇరాన్, కెనడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అత్యంత భారీతనంతో మీ ఊహలను మించి మా చిత్రం ఉంటుంది. అందుకే అలాగే థ్రిల్‍తో ఉండండి” అని మెగా సుప్రియా ప్రొడక్షన్స్ వెల్లడించింది.

త్వరలో స్పెషల్ ప్రోమో

హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించి త్వరలోనే స్పెషల్ ప్రోమో రిలీజ్ చేయనున్నట్టు కూడా నిర్మాణ సంస్థ వెల్లడించింది. ప్రోమో అద్భుతంగా ఉంటుందని మెగా సుప్రియా ప్రొడక్షన్ తెలిపింది. ఈ బ్యానర్‌ ఏఎం రత్నం, దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

క్రిష్ ఊసు లేకుండా..

హరిహర వీరమల్లు సినిమా నుంచి దర్శకుడు క్రిష్ తప్పుకున్నారని కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఈ చిత్రంలోని కొన్ని పోర్షన్లపై పవన్ అసంతృప్తిగా ఉన్నారని, అందుకే క్రియేటివ్ డిఫరెన్సులతో ఈ ప్రాజెక్టు నుంచి క్రిష్ వైదొలిగారని వార్తలు వచ్చాయి. అయితే, తమ ప్రకటనలో క్రిష్ గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు మెగా సుప్రియా ప్రొడక్షన్. మరి, ప్రోమో ద్వారా ఈ విషయంపై క్లారిటీ ఇస్తుందోమో చూడాలి.

హరిహర వీరమల్లు సినిమా మొఘలుల కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో రూపొందుతోంది. ఈ చిత్రంలో భారత యోధుడిగా పవన్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలకపాత్ర చేస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‍గా ఉన్నారు. విక్రమ్‍జీత్ వివేక్, నోహా ఫతేహి, జుస్సు సెంగుప్త కూడా నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఉన్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‍లో రానుంది.

పవన్ కల్యాణ్ చేతిలో ప్రస్తుతం ఓజీ, ఉస్తాత్ భగత్ సింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 27న ఓజీ మూవీ రిలీజ్ కానుంది. మరి హరిహర వీరమల్లు ఎప్పటికల్లా రెడీ అవుతుందోననే ఉత్కంఠ ఉంది. పవన్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.