తెలుగు న్యూస్ / ఫోటో /
డిసెంబర్‌లో ఈ రాశుల వారికి చాలా లక్.. ధనయోగం, మనశ్శాంతి!
- డిసెంబర్‌లో కొన్ని గ్రహాల స్థితిగతులు మారనున్నాయి. మార్పులు జరగనున్నాయి. వీటి వల్ల కొన్ని రాశుల వారికి ఆనెలలో భారీగా కలిసి రానుంది. లాభాలు దక్కనున్నాయి. ఆ వివరాలు ఇవే.
- డిసెంబర్‌లో కొన్ని గ్రహాల స్థితిగతులు మారనున్నాయి. మార్పులు జరగనున్నాయి. వీటి వల్ల కొన్ని రాశుల వారికి ఆనెలలో భారీగా కలిసి రానుంది. లాభాలు దక్కనున్నాయి. ఆ వివరాలు ఇవే.
(1 / 5)
జ్యోతిషం ప్రకారం, గ్రహాల కదలికలు ప్రజల అదృష్టాన్ని మార్చేస్తుంటాయి. గ్రహాల సంచారాల వల్ల రాశులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. డిసెంబర్‌లో గ్రహాల సంచారాల్లో కీలక మార్పులు ఉండనున్నాయి. (freepik)
(2 / 5)
వచ్చే నెల (డిసెంబర్)లో సూర్యుడు, కుజుడి సంచారంలో మార్పులు ఉండననున్నాయి. మరిన్ని గ్రహాల మార్పులు, కలయికలు, రాశుల స్థానాల్లో మార్పులు జరగన్నాయి. ఈ కారణంతో డిసెంబర్‌లో మూడు రాశుల వారికి అదృష్టం మెండుగా ఉండనుంది. ఆ రాశులు ఏవంటే..
(3 / 5)
సింహం: డిసెంబర్ నెల మొత్తం సింహరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభాలు దక్కే అవకాశం ఉంది. జీవితంలో సంతోషం, మనశ్శాంతి పెరుగుతాయి. కొత్త అవకాశాలు వస్తాయి. జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది.
(4 / 5)
మీనం: వచ్చే నెలలో మీన రాశి వారికి ప్రయోజనాలు కలుగుతాయి. చేసే పనుల్లో చాలా శాతం సఫలీకృతమవుతాయి. వ్యాపారులకు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు పెండింగ్‍లో ఉన్న జీతాల పెంపు మంజూరు కావొచ్చు. కార్యాలయాల్లో ప్రశంసలు దక్కుతాయి. తోబుట్టువుల నుంచి మద్దతు లభిస్తుంది.
(5 / 5)
కన్య: గ్రహాల కదలికల కారణంగా డిసెంబర్ నెల.. కన్య రాశి వారికి కలిసి రానుంది. వీరికి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వారికి సత్ఫలితాలు ఉంటాయి. మునుపటి కంటే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. (గమనిక: శాస్త్రాలు, నమ్మకాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాల నివృత్తికి సంబంధిత నిపుణులను సంప్రదించాలి.)
ఇతర గ్యాలరీలు