Nayanthara Vignesh shivan: భ‌ర్త పుట్టిన‌రోజు - రొమాంటిక్ ఫొటో షేర్ చేసిన న‌య‌న‌తార‌-nayanthara vignesh shivan romantic swimming pool photo viral on social media ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nayanthara Vignesh Shivan: భ‌ర్త పుట్టిన‌రోజు - రొమాంటిక్ ఫొటో షేర్ చేసిన న‌య‌న‌తార‌

Nayanthara Vignesh shivan: భ‌ర్త పుట్టిన‌రోజు - రొమాంటిక్ ఫొటో షేర్ చేసిన న‌య‌న‌తార‌

HT Telugu Desk HT Telugu
Sep 18, 2023 12:28 PM IST

Nayanthara Vignesh shivan: భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ పుట్టిన‌రోజు నాడు రొమాంటిక్ ఫొటోను అభిమానుల‌తో పంచుకున్న‌ది న‌య‌న‌తార‌. స్విమ్మింగ్‌పూల్‌లో విఘ్నేష్ శివ‌న్‌తో క‌లిసి దిగిన‌ ఓ ఫొటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది.

న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్
న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్

Nayanthara Vignesh shivan: భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో రొమాంటిక్ ఫొటోను షేర్ చేసి అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేసింది న‌య‌న‌తార‌. స్విమ్మింగ్‌పూల్‌లో భ‌ర్త‌పై భుజంపై చేయివేసి రొమాంటిక్‌గా దిగిన‌ ఫొటోను ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోకు బ్లిస్ అంటూ క్యాప్ష‌న్ జోడించింది.

న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్‌ల ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 2015 నుంచి ప్రేమ‌లో ఉన్న ఈ జంట 2022లో పెళ్లి చేసుకున్నారు. గ‌త ఏడాది స‌రోగ‌సీ విధానం ద్వారా క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది న‌య‌న‌తార‌.

జ‌వాన్‌తో బాలీవుడ్ ఎంట్రీ...

ఇటీవ‌లే జ‌వాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది న‌య‌న‌తార‌. షారుఖ్‌ఖాన్ హీరోగా న‌టించిన ఈ సినిమా 11 రోజుల్లోనే 850 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇండ‌స్ట్రీ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీలో స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్ ఆఫీస‌ర్‌గా యాక్ష‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌య‌న‌తార క‌నిపించింది. జ‌వాన్ సినిమాలో విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా న‌టించాడు.

1960 బ్యాక్‌డ్రాప్‌లో ...

న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోన్న త‌మిళ మూవీ మ‌న్న‌న్‌గ‌ట్టి ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ను సోమ‌వారం రిలీజ్ చేశారు. పురాత‌న నాణెల‌తో పాటు కొత్త క‌రెన్సీ నోట్లు మ‌ట్టిలో క‌ప్పి ఉంచిన‌ట్లుగా డిజైన్ చేసిన ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

వీడియో మోష‌న్ పోస్ట‌ర్‌లో అడ‌వి, గుడితో పాటు క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టి ఉన్న న్యాయ‌దేవ‌త‌ను చూపించారు. మాన్న‌న్‌గ‌ట్టి అనే టైటిల్ కింద ఉన్న సిన్స్ 1960 అనే క్యాప్ష‌న్ ఆస‌క్తిని పంచుతోంది. ఈ సినిమాకు డ్యూడ్ విక్కీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌కాబోతున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు.