Gajalakshmi Yogam: కష్టాలు ఇంకా కొన్ని రోజులే- గజలక్ష్మీయోగం వచ్చేస్తుంది ఈ రాశుల వారిని ఆపేవారే ఉండరు-gajalakshmi yoga in gemini and there will be no one to stop these zodiac signs in 2025 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Gajalakshmi Yogam: కష్టాలు ఇంకా కొన్ని రోజులే- గజలక్ష్మీయోగం వచ్చేస్తుంది ఈ రాశుల వారిని ఆపేవారే ఉండరు

Gajalakshmi Yogam: కష్టాలు ఇంకా కొన్ని రోజులే- గజలక్ష్మీయోగం వచ్చేస్తుంది ఈ రాశుల వారిని ఆపేవారే ఉండరు

Ramya Sri Marka HT Telugu

Gajalakshmi Yogam:గ్రహాలన్నింటిలోనూ శుభ గ్రహంగా చెప్పుకునే బృహస్పతి త్వరలో రాశి మారబోతున్నాడు. బృహస్సతి సంచారంలో మార్పులు అన్ని రాశుల వారిపై ప్రభావం చూపినప్పటికీ కొందర రాశుల వారికి విపరీతమైన అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. 2025లో ఈ రాశుల వారిని ఆపేవారు ఉండరు.

2025లో గజలక్ష్మి యోగం

జ్యోతిషశాస్త్రంలో బృహస్సతి(గురువు)ను శుభ గ్రహంగా పరిగణిస్తారు. గురు గ్రహ అనుగ్రహం ఉంటే సంపద, కీర్తి, ఐశ్యర్యం, సంతానం, సంతోషం, శ్రేయస్సుకు కొదవే ఉండదు. బృహస్పతి ఒక రాశి నుండ మరొక రాశిలోకి మారడానికి సుమారు 13నెలలు పడుతుంది.ప్రస్తుతం బృహస్పతి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. వచ్చే ఏడాది 2025లో బృహస్పతి మిథున రాశిలోకి మారనుంది.

బృహస్పతి సంచారము వచ్చే ఏడాది అంటే 2025లో జరుగుతుంది. మే 14, 2025 రాత్రి 11:20 గంటలకు బృహస్పతి వృషభ రాశి నుండి బయటకు వెళ్లి మిథున రాశిలోకి ప్రవేశిస్తుంది. అప్పటికే శుక్రుడు మిథున రాశిలో ఉంటాడు. బృహస్పతి శుక్రుడి కలయికతో శుభయెగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో దీన్నే గజలక్షీ యోగం అంటారు.ఈ గజలక్ష్మీ యోగం కొన్ని రాశి చక్ర గుర్తుల వారికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా 2025లో మూడు రాశుల వారిని ఆపేవారు ఉండలేరు. ఆ రాశులేవో చూద్దాం.

మిథున రాశి :

బృహస్పతి శుక్ర గ్రహాల కలయికతో ఏర్పడే గజలక్ష్మీ యోగం మిథున రాశి వారికి విపరీతంగా కలిసి వస్తుంది. 2025 సంవత్సరంలో ఈ రాశివారికి వారి సంతానం నుండి ఆనందం లభిస్తుంది. అన్నింటా అదృష్టం కలిసి వస్తుంది. శుభవార్తలు వింటారు. నిలిచిపోయిన వివాహాలు కొలిక్కి వస్తాయి. మానసిక సమస్యల నుంచి బయటపడతారు. లాభావకాశాలు దండిగా ఉంటాయి. వ్యాపారల్లో ఆర్థిక లాభం, ఆదాయం గడించే కొత్త వనరులు సంవత్సరం పొడవునా తెరుచుకుంటాయి. ఫలితంగా మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు.

సింహం :

గజలక్ష్మీ యోగం ఫలితంగా సింహ రాశి వారికి 2025 సంవత్సరం శుభదాయకంగా ఉంటుంది. లాభాల బాటలో పయనిస్తారు. కోరికలు నెరవేరతాయి. పని ప్రాంతంలో విజయం లభిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు, భౌతిక సౌకర్యాలు, సవాళ్లు తొలగిపోతాయి. డబ్బుకు కొదవ ఉండదు. అకస్మాత్తుగా లాభాల అవకాశాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మంచి విజయాలు అందుకుంటారు. బృహస్పతి మరియు శుక్రుడి శుభ స్థానం కారణంగా శుభవార్తలు వింటారు.ఆరోగ్యం విషయంలో ఎలాంటి సమస్యలు ఉండవు.

కన్యా రాశి:

ఈ రాశి వారికి 2025 సంవత్సరం చాలా బాగా కలిసొస్తుంది. గురు, శుక్రుల కలయికతో ఏర్పడే గజలక్ష్మీ యోగం కన్యా రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అన్నింటా అదృష్టం కలిసి వస్తుంది. సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక లాభం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకు విద్యా రంగంలో మంచి గౌరవం లభిస్తుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.