Saturn transit: 2025 లో ఈ రాశుల వాళ్ళు చేయాల్సిన పనులు ఇవే- అప్పుడే శని కోపం నుంచి తప్పించుకుంటారు
Saturn transit: శని తన సొంత రాశి నుంచి మరి కొద్ది రోజుల్లో బయటకు రాబోతున్నాడు. దీని వల్ల ఏలినాటి శని, అర్థాష్టమ శని ప్రభావం ఎదుర్కొనే రాశులలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త సంవత్సరంలో ఏ రాశులకు శని ప్రభావం ఉంటుంది. వాటి నుంచి బయట పడేందుకు ఏం చేయాలో తెలుసుకోండి.
శని దేవుడు 30 సంవత్సరాల తర్వాత తన రాశి కుంభ రాశికి వచ్చాడు. రెండున్నర సంవత్సరాల పాటు ఈ రాశిలో ఉంటాడు. ఇప్పుడు 2025 సంవత్సరంలో శని తన రాశిని మారుస్తోంది. రాశులలో శని మారడం వల్ల మూడు రాశుల వారికి శనీశ్వరుని ఏలినాటి శని, అర్థాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభించి ఈ రాశుల వారికి శుభకాలం ప్రారంభమవుతుంది.
శని రాశి మార్పు కారణంగా మూడు కొత్త రాశులపై ఏలినాటి శని, అర్థాష్టమ శని యాత్రలు ప్రారంభం కానున్నాయి. 2025 మార్చి నెలలో శని కుంభ రాశిని వీడి బృహస్పతికి చెందిన మీన రాశిలోకి ప్రవేశిస్తుంది. ఇందులో రెండున్నర సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ రాశిలో శని రాకతో అనేక రాశులకు చాలా మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. ఎందుకంటే శని రాశిని మార్చడం ద్వారా మూడు రాశుల వారికి ఏలినాటి శని, అర్థాష్టమ శని నుండి ఉపశమనం లభిస్తుంది.
ఏలినాటి శని, అర్థాష్టమ శని ఏ రాశుల మీద ముగుస్తుంది?
మార్చి 2025లో శని తన రాశిని మారుస్తుంది. అటువంటి పరిస్థితిలో మకర రాశి వారికి ఏలినాటి శని నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే వృశ్చికం, ధనుస్సు రాశి వారికి అర్థాష్టమ శని ఉపశమనం లభిస్తుంది. 2025లో ఈ రాశుల వారు శని ప్రభావం నుండి విముక్తి పొందుతారు.
2025లో ఈ రెండు రాశులవారు శని ప్రభావం నుంచి విముక్తి పొంది సింహం, ధనుస్సు రాశుల్లో శని ప్రభావం మొదలవుతుంది. అర్థాష్టమ శని వల్ల ఈ రెండు రాశుల వాళ్ళు రెండున్నరేళ్లపాటు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మేష రాశిలో శనిగ్రహం ఏలినాటి శని మొదటి దశ ప్రారంభమవుతుంది. ఇది కాకుండా మీన రాశిలో శని సాడే సతి ఉచ్ఛస్థితిలో ఉంటుంది.
ఈ సమయంలో ఏమి చేయాలి?
శని న్యాయాధిపతిగా వ్యవహరిస్తారు. కష్టపడి పని చేసిన వారికి అధిక ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే చెడు పనులు చేసిన వారికి కర్మల అనుసారం ఫలితాలు ఎదురవుతాయి. అందుకే శని కోపం బారిన పడకుండా ఉండటం కోసం ఈ రాశుల వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
ఏ రాశుల వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుందో ఆ రాశుల వారు కష్టపడి పనిచేయాలి. క్రమశిక్షణతో ఉండాలి. ఎందుకంటే క్రమశిక్షణకు శని బాధ్యత వహిస్తారు. తప్పుడు పనులు చేయకూడదు. ఈ సమయంలో మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనాలి. త్వరగా పూర్తి అవుతాయి కదాని తప్పుడు మార్గంలో, షార్ట్‌కట్ పద్ధతిలో ఏ పనీ చేయకూడదు. ఒకరు తన బాధ్యతలకు కట్టుబడి ఉండాలి. సత్యాన్ని సమర్థించే, నిజాయితీగా, క్రమశిక్షణతో ఉండే వ్యక్తులను శని ఎల్లప్పుడూ ఇష్టపడతాడు. వారికి ఎలాంటి కష్టాలు ఉండవు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.