Telangana News Live November 23, 2024: Bandi Sanjay : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేం కూల్చబోం, తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతుంది- బండి సంజయ్
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 23 Nov 202404:10 PM IST
Bandi Sanjay : మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల ప్రభావంత తెలంగాణపై ఉంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాలు కారణంగానే మహాయుతికి 225 సీట్లకు పైగా వచ్చాయన్నారు. కాంగ్రెస్ ఐరన్ లెగ్ పార్టీ అని విమర్శించారు.
Sat, 23 Nov 202402:01 PM IST
CM Revanth Reddy : ఈ నెల 30న మహబూబ్ నగర్ లో రైతు సదస్సు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన, వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Sat, 23 Nov 202412:26 PM IST
TGPSC Group 2 Vs RRB : తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు కొత్త చిక్కు ఎదురైంది. గ్రూప్-2 పరీక్ష రోజునే ఆర్ఆర్బీ జేఈ పరీక్ష రావడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండింటిలో ఒక పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్నారు.
Sat, 23 Nov 202412:17 PM IST
- TG Army Recruitment Rally : ఇండియన్ ఆర్మీలో చేరాలని చాలామంది లక్ష్యంగా పెట్టుకుంటారు. అందుకోసం కసరత్తు చేస్తారు. అలాంటి వారికి ఇది శుభవార్త. అవును.. త్వరలోనే హైదారాబాద్‌లో అగ్నివీర్‌ల రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. దానికి సంబంధించిన ఆర్హత, ముఖ్య తేదీలు, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sat, 23 Nov 202411:40 AM IST
- Karimnagar : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ రాబోతుంది. పెండింగ్ ప్రాజెక్టులపై ఈనెల 30న ఉమ్మడి జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించనున్నారు. వచ్చే ఏడాదిలోగా అదనంగా మరో లక్ష ఎకరాలకు సాగునీరు అందించే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Sat, 23 Nov 202411:39 AM IST
Hyderabad Real Estate : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం జోరు కొనసాగుతోంది. అక్టోబర్ నెలలో హైదరాబాద్ స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు 20 శాతం మేర పెరిగాయని నైట్ ఫ్రాంక్ ఇండియా సర్వే తెలిపింది.
Sat, 23 Nov 202410:24 AM IST
- Maharashtra Election Result : మహారాష్ట్రలో బీజేపీ చరిత్ర సృష్టించింది. ఎన్డీఏ కూటమికే ప్రజలు పట్టం కట్టారు. ఇండియా కూటమి నిరాశలో ఉండగా.. బీజేపీ జోష్‌లో ఉంది. అయితే.. మహా ఎన్నికల ఫలితాలు తెలంగాణలో రాజకీయ కాక రేపుతున్నాయి. కాంగ్రెస్ ఓటమికి రేవంత్ కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Sat, 23 Nov 202409:44 AM IST
- Lagacharla Incident : తెలంగాణలో లగచర్ల లడాయి కొనసాగుతోంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. చర్లపల్లి జైలుకు వెళ్లారు. అక్కడ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.
Sat, 23 Nov 202409:19 AM IST
TGSRTC Drivers Posts : టీజీఎస్ఆర్టీసీలో 1201 డ్రైవర్ పోస్టులకు తెలంగాణ సైనిక సంక్షేమ శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే పోస్టులకు మాజీ సైనికులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఈ నెల 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.
Sat, 23 Nov 202407:57 AM IST
- TG Govt Jobs : తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు ఏడాది కావొస్తుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అంశం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. అసలు ఎన్ని ఉద్యోగాలు భర్తీ అయ్యాయనే చర్చ జరుగుతోంది.
Sat, 23 Nov 202406:55 AM IST
- TG Late Death Certificate : ప్రస్తుతం ఏ పని అయినా సర్టిఫికెట్లతోనే అవుతోంది. భూముల రిజిస్ట్రేషన్ మొదలు.. ఏదైనా పథకం రావాలన్నా.. రెవెన్యూ శాఖ నుంచి వచ్చే ధ్రువీకరణ పత్రాలే కీలకం. అయితే.. ఈ సర్టిఫికెట్లు తీసుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాటిల్లో ఒకటి లేట్ డెత్ సర్టిఫికెట్.
Sat, 23 Nov 202405:54 AM IST
- Warangal : మావోయిస్టులు తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు మళ్లీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ములుగు జిల్లాలో ఇద్దరిని అతి దారుణంగా నరికి చంపారు. అతి కూడా పోలీస్ స్టేషన్‌కు అతి సమీపంలో. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలనంగా మారింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
Sat, 23 Nov 202404:11 AM IST
- BRS : బీఆర్ఎస్ గురించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దేశంలోని రిజనల్ పార్టీల్లో బీఆర్ఎస్ రిచ్ అని వెల్లడైంది. అటు టీడీపీ, వైసీపీ ఖాతాల్లో ఉన్న ముగింపు నిల్వలను కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. టీడీపీ అకౌండ్‌లో రూ.272 కోట్లు ఉన్నాయి.
Sat, 23 Nov 202402:25 AM IST
- Telangana High Court Recruitment:తెలంగాణ హైకోర్టులో లా క్లర్క్ ల భర్తీకి ప్రకటన జారీ అయిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు ఇవాళ్టితో(నవంబర్ 23) ముగియనున్నాయి. మొత్తం 33 ఖాళీలు ఉన్నాయి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
Sat, 23 Nov 202401:54 AM IST
- TGPSC Group 1 Results : గ్రూప్ 1 ఫలితాల ప్రకటనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తోంది. ఇటీవలనే మెయిన్స్ పరీక్షలు పూర్తి కాగా… మూల్యాంకనం మొదలుపెట్టింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఫలితాలను ప్రకటించాలని యోచిస్తోంది.