Feng Shui: ఫెంగ్ షూయి ప్రకారం ఈ ఒక్క వస్తువు మీ ఇంట్లో ఉందంటే సంపదకు కొదువ ఉండదు
Feng Shui: ఫెంగ్ షూయి ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సంపద, శ్రేయస్సును తీసుకొస్తుంది. అలాంటి వస్తువులలో ఇదీ ఒకటి. మీ ఇంట్లో సరైన ప్రదేశంలో వాటర్ ఫౌంటెన్ పెట్టుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.
భారతీయులు వాస్తు శాస్త్రం గురించి ఎంతగా విశ్వసిస్తారో చైనీయులు ఫెంగ్ షూయిని అంత పవిత్రంగా భావిస్తారు. ఫెంగ్ షూయి చర్యలను అనుసరించడం ద్వారా గ్రహాల అననుకూల ప్రభావాలు తగ్గుతాయి.
ఫెంగ్ షూయి ఇంటి అందాన్ని పెంపొందించడమే కాకుండా గ్రహ దోషాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఫెంగ్ షూయి ప్రకారం ఇంట్లో నీటి ఫౌంటెన్ ఉంచడం ఆర్థిక ప్రయోజనాలను తెస్తుందని నమ్ముతారు. ఇది ఇంటికి అందాన్ని ఇవ్వడమే కాదు అనేక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఇంట్లో ఏ ప్రదేశంలో వాటర్ ఫౌంటెన్ ఉంచడం శ్రేయస్కరమో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫౌంటెన్ ఏ దిశలో ఉంచాలి?
ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఫెంగ్ షూయి వాటర్ ఫౌంటెన్ ఉంచాలి. ప్రధాన ద్వారం దగ్గర ప్రవహించే నీటి బుగ్గ ఉన్న ఇల్లు సంపదను తెస్తుందని నమ్ముతారు. అలాంటి ఇంటి మీద లక్ష్మీదేవి విశేష ఆశీస్సులు ఉంటాయి. ప్రధాన ద్వారం కుడి వైపున వాటర్ ఫౌంటెన్ ఉంచవచ్చు. దీన్ని ఈ ప్రదేశంలో ఉంచడం శ్రేయస్కరం.
ఫెంగ్ షూయి వాటర్ ఫౌంటెన్ నీటి భాగం ఇంటి లోపలి వైపు ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక లాభం ఉంటుంది. ఫౌంటెన్‌ను ఆగ్నేయ దిశలో కూడా ఉంచవచ్చు. ఈ దిశలో వాటర్ ఫౌంటెన్ ఉంచడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.
ఫౌంటెన్ ఉత్తర దిశలో కూడా పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కెరీర్‌లో పురోగతి ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. ఫౌంటెన్ నీటి ప్రవాహ దిశ ఎప్పుడూ ఇంటి లోపలికి ఉండే విధంగా చూసుకోవాలి. ఇంటి వెలుపలకు ఉంటే డబ్బు వృధా జరిగే అవకాశాలు పెరుగుతాయని అర్థం చేసుకోవాలి.
ఈ విషయాలను గుర్తుంచుకోండి
రెండు నీటి ఫౌంటెన్‌లను ఎప్పుడూ తలుపు వెలుపల ఉంచకూడదు. నీరు పడే శబ్దం మీ పడకగదికి చేరకూడదు. నీటి ఫౌంటెన్‌లోని నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉండాలి. ఆగిపోకుండా చూసుకోవాలి. నీటి ప్రవాహంలో అడ్డంకులు ఉండే ఫౌంటెన్ వెంటనే మార్చుకోవాలి. లేదంటే ఆర్థిక పెరుగుదలలో ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే పడకగది, వంట గదిలో ఫౌంటెన్ ఉంచకూడదు. దీన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. లేదంటే నెగటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది. ఫౌంటెన్ ఉంచిన ప్రయోజనాలు మీకు దక్కకపోవచ్చు. ఇంట్లో వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేసుకోవడం వల్ల డబ్బు సమృద్ధిగా ఉంటుందని నమ్ముతారు. అలాగే ప్రవహించే నీటి శబ్ధం ప్రశాంతతను ఇస్తుంది.
సూర్య కాంతి ఎక్కువగా దీని మీద పడకుండా చూసుకోవాలి. అలాగే ఫౌంటెన్ లో నీరు అన్ని వైపులా సమానంగా ప్రవహించే విధంగా చూసుకోవాలి. ఇంటి తలుపు వైపు ప్రవహించే నీరు సంపద, శ్రేయస్సును సూచిస్తుంది. ఇంటి నుంచి నీరు దూరంగా ప్రవహిస్తే సంపదను కోల్పోతారు అనే దానికి సంకేతంగా భావిస్తారు. ఇది ఆర్థిక సమస్యలను కలిగిస్తుంది.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము క్లెయిమ్ చేయము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి.
టాపిక్