Bachhala Malli Twitter Review: బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ.. అల్లరి నరేష్, హనుమాన్ హీరోయిన్ మూవీకి టాక్ ఎలా ఉందంటే?
Bachhala Malli Twitter Review In Telugu: అల్లరి నరేష్ నటించిన రూరల్ రస్టిక్ డ్రామా మూవీ బచ్చల మల్లి. అల్లరి నరేష్‌కు జోడీగా హనుమాన్ హీరోయిన్ అమృత అయ్యర్ నటించిన ఈ సినిమా ఇవాళ రిలీజ్ కానుంది. ఇప్పటికే పలు చోట్ల పెయిడ్ ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ నేపథ్యంలో బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూలోకి వెళితే..!
Bachhala Malli Twitter Review Telugu: కమెడియన్ హీరోగా అలరించిన అల్లరి నరేష్ సీరియస్ ట్రాక్ ఎక్కాడు. నాంది సినిమాతో సూపర్ హిట్ కొట్టిన అల్లరి నరేష్ ఆ తర్వాత సీరియస్ రోల్స్‌తో ప్రయోగాలు చేస్తున్నాడు. అయితే, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం వంటి సినిమాలు నాంది అంత హిట్ కొట్టలేకపోయాయి.
విలేజ్ బ్యాక్‌డ్రాప్ రస్టిక్ డ్రామా
మరోసారి అల్లరి నరేష్ సీరియస్ అండ్ రస్టిక్ రోల్‌లో నటించిన సినిమా బచ్చల మల్లి. విలేజ్ బ్యాక్‌డ్రాప్ రస్టిక్ డ్రామాగా తెరకెక్కిన అల్లరి నరేష్ బచ్చల మల్లి మూవీకి సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహించారు. బచ్చల మల్లిలో అల్లరి నరేష్‌కు జోడీగా హనుమాన్ హీరోయిన్ అమృత అయ్యర్ నటించింది. రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరించిన బచ్చల మల్లి మూవీ ఇవాళ (డిసెంబర్ 20) రిలీజ్ కానుంది.
పెయిడ్ ప్రీమియర్ షోస్
ఈ నేపథ్యంలో హైదరాబాద్, అమెరికా వంటి కొన్ని లొకేషన్స్‌లలో బచ్చల మల్లి పెయిడ్ ప్రీమియర్ షోలు వేశారు. ఈ షోలు చూసిన ఆడియెన్స్, నెటిజన్స్ సినిమా ఎలా ఉందని చెబుతున్నారో బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం.
మల్లిగాడు గుర్తుండిపోతాడు
"ఇప్పుడే బచ్చల మల్లి సినిమా పూర్తి అయింది. ఈ మల్లిగాడు (అల్లరి నరేష్) గుర్తుండిపోతాడు అన్న. నాకు కావేరి (అమృత అయ్యర్) లాంటి అమ్మాయి కావాలి. చాలా బాగా చేసింది. డైరెక్టర్ ఎమోషనల్ ఫీల్ అయ్యేలా తెరకెక్కించారు. రైటింగ్‌లో డెప్త్ అదిరిపోయింది. సాంగ్స్ సూపర్బ్‌గా ఉన్నాయి" అని రాసుకొచ్చిన ఓ నెటిజన్ సినిమాకు 3.5 రేటింగ్ ఇచ్చారు.
"బచ్చలమల్లి మూవీ ఒక రూరల్ బ్యాక్‌డ్రాప్ డ్రామా. ఒక యూనిక్ పాయింట్‌తో ఈ సినిమా వచ్చింది. అయితే, రొటీన్ స్క్రీన్‌ప్లేతో మూవీలోని సోల్ వీక్‌గా అనిపిస్తుంది. చాలా వరకు సీన్స్ ఇలాంటి తరహా సినిమాల్లో కనిపించినట్లుగానే ఉన్నాయి. వాటిని డైరెక్టర్ సరిగ్గా ప్రజెంట్ చేయడంలో విఫలం అయ్యాడు. కానీ, అల్లరి నరేష్ మాత్రం బాగా నటించాడు. సంగీతం బాగుంది. స్క్రిప్ట్ బాగుంది. కానీ, టేకింగ్ ఇంట్రెస్టింగ్‌గా లేదు. కథలో నిజాయితీ ఉన్న ఆవిష్కరణలో లోపం ఏర్పడింది" అని ఒకరు రివ్యూ ఇస్తూ సినిమాకు 2.25 రేటింగ్ ఇచ్చారు.
"సినిమాకు నా రివ్యూ 5కి 3 స్టార్ రేటింగ్. బచ్చల మల్లిలో అల్లరి నరేష్ నటనతో ఇరగదీశాడు.యాక్టింగ్, స్క్రీన్ ప్లే వావ్ అనిపించేలా ఉన్నాయి. విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం సినిమాకు సోల్ అని చెప్పొచ్చు. ఎఫెక్టివ్ డైరెక్టర్ అని సుబ్బు మంగాదేవి నిరూపించారు. హీరోయిన్ అందంగా ఉంది" అని ఒకరు చెప్పారు.
ఒక్కో రేటింగ్
ఇలా అల్లరి నరేష్ రూరల్ రస్టిక్ డ్రామా బచ్చల మల్లికి మిక్స్‌డ్ టాక్ వస్తూ.. ఒక్కొక్కరూ ఒక్కోలా రేటింగ్ ఇస్తున్నారు. అయితే, సినిమాలో అల్లరి నరేష్ యాక్టింగ్ అదిరిపోయిందని అంటున్నారు. కానీ, మూవీ టేకింగ్ ఎంగేజింగ్‌గా లేదని చెబుతున్నారు. అల్లరి నరేష్ కమ్‌బ్యాక్ కోసం ఇంకా వెయిటింగ్, చాలా వరకు పొటెన్షియాలిటీ మిస్ అయింది, కెరీర్‌లోనే అల్లరి నరేష్‌ది బెస్ట్ పర్ఫామెన్స్ అంటూ బచ్చల మల్లి సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది.