Pushpa 2 Ticket Price: పుష్ప 2 టికెట్‌కు 1800.. తిట్టుకుంటున్న నెటిజన్స్.. నెల ఆగితే బీరు బిర్యానీతో చూడొచ్చు అంటూ!
Pushpa 2 The Rule Advance Bookings And Trolling: అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. డిసెంబర్ నుంచి తెలంగాణలో పుష్ప 2 ప్రీమియర్ షోలు వేయనున్నారు. అయితే, వీటికి పెంచిన టికెట్ ధరలపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Pushpa 2 The Rule Ticket Price Trolling: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మరోసారి జంటగా నటించిన పుష్ప 2 ది రూల్ మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. అయితే, వీటి ధరలు దారుణంగా ఉన్నాయి.
ఢిల్లీ, ముంబైలో ధరలు
పుష్ప 2 ది రూల్ టికెట్ రేట్స్ ఢిల్లీలో రూ.1,800 ఉండగా.. ముంబైలో రూ.1,600కు చేరుకున్నాయి. అలాగే, బెంగళూరులో పుష్ప 2 టికెట్ వెయ్యి రూపాయలు పలుకుతున్నాయి. దీంతో ఈ సినిమాకు ఓపెనింగ్ డే నాడు అత్యధిక కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, తెలంగాణలో డిసెంబర్ 4 నుంచి పుష్ప 2 ప్రీమియర్ షోలకు అనుమతి లభించిన విషయం తెలిసిందే.
తెలంగాణలో పుష్ప 2 ది రూల్ ప్రీమియర్ షో, బెన్‌ఫిట్ షోలకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటల నుంచి ప్రీమియర్ షోలు ప్రదర్శితం కానున్నాయి. అయితే, పుష్ప 2 ప్రీమియర్ షోలకు ఒక టికెట్ రేట్ రూ. 800 పెంచుతూ అనుమతినిచ్చారు.
నెటిజన్స్ ఆగ్రహం
అలాగే, డిసెంబర్ 4 రాత్రి 9:30 గంటల షో టికెట్ రేట్స్ సింగిల్ స్క్రీన్‌లో రూ. 1121, మల్టీప్లెక్స్‌ల్లో 1239గా ధరలు పలుకుతున్నాయట. పుష్ప 2 విడుదలైన మొదటి నాలుగు రోజులు సింగిల్ స్క్రీన్స్‌లో 354 రూపాయలు, మల్టీప్లెక్స్‌ల్లో 531 రూపాయలకుగా ఉన్నాయి. అయితే, పుష్ప 2 ది రూల్ బెనిఫిట్ షోలకు రూ. 800 పెంపుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టికెట్స్ దారుణంగా పెంచేశారని, ఇలా అయితే కామన్ ఆడియెన్స్ ఎవరు చూస్తారని తిట్టిపోస్తున్నారు. పుష్ప 2 సినిమాను మొదటి రెండు రోజులు అభిమానులే ఎక్కువగా చూస్తారని, ఆ తర్వాత టాక్ బాగుంటేనే సాధారణ ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారని, మొదటి రోజుల టికెట్ ధరల బారం అల్లు అర్జున్ ఫ్యాన్స్‌పైనే పడుతుందని నెటిజన్స్ అంటున్నారు.
బీరు బిర్యానీతో చూడొచ్చు
"అతి వల్లనే ఐబొమ్మ వినియోగదారులు ఎక్కువ అవుతున్నారు. ఒక నెల ఆగితే బీరు బిర్యానీతో ఐ బొమ్మలో ప్రశాంతంగా చూడొచ్చు" అని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు.
"800 రూపాయలు అంటే ఒక ఫ్యామిలీలో నలుగురు మెంబర్స్ చూడాలంటే 3,200 రూపాయలు. అది కూడా ఒక స్మగ్లర్, రౌడీ లైఫ్‌లొ ఇల్లీగల్‌గా ఎలా ఎదిగాడు అనే ఒక స్టోరీని పిల్లలు, పెద్ద వాళ్లతో చూడాలి. కర్మ రా బాబు" అని మరొక ఎక్స్ యూజర్ ట్వీట్ చేశాడు.