OTT Telugu Thriller: సడెన్‍గా రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన అనన్య నాగళ్ల రూరల్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చు?
OTT Telugu Thriller: పొట్టేల్ సినిమా రెండు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అనన్య నాగళ్ల ప్రధాన పాత్ర పోషించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం సడెన్‍గా స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈ చిత్రాన్ని ఎక్కడ చూడొచ్చంటే..
హీరోయిన్ అనన్య నాగళ్ల, యువ చంద్ర కృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన పొట్టేల్ సినిమా ముందు నుంచి క్యూరియాసిటీ పెంచింది. టైటిల్ నుంచి టీజర్, ట్రైలర్ వరకు హైప్ తెచ్చుకుంది. ప్రమోషన్లను కూడా మూవీ టీమ్ గట్టిగానే చేసింది. అక్టోబర్ 25న ఈ రూరల్ రస్టిక్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలోకి వచ్చింది. అయితే, పొట్టేల్ సినిమా అంచనాలకు తగ్గట్టుగా టాక్ తెచ్చుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఈ చిత్రం సడెన్‍గా నేడు (డిసెంబర్ 20) ఓటీటీలోకి అడుగుపెట్టింది. రెండు ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్ట్రీమింగ్ ఎక్కడంటే..
పొట్టేల్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో నేడు స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ముందస్తుగా ప్రచారం లేకుండా సడెన్‍గా ఓటీటీల్లో అడుగుపెట్టింది. ఇప్పుడు ఈ రెండు ఓటీటీల్లో ఈ పొట్టేల్ సినిమాను చూసేయవచ్చు.
ఎనిమిది వారాలకు..
పొట్టేల్ సినిమా థియేటర్లలో రిలీజైన సుమారు ఎనిమిది వారాలకు ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చింది. నెలలోపే వస్తుందని అంచనాలు వచ్చినా అలా జరగలేదు. ఆలస్యమైంది. ఎట్టకేలకు నేడు ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో పొట్టేల్ సినిమా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.
పొట్టేల్ సినిమాకు సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించారు. తెలంగాణ రూరల్ బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1980ల కాలం నాటి పరిస్థితుల్లో.. ఎంతటి కఠిన పరిస్థితులు ఎదురైనా కూతురిని చదివించాలని తపన పడే ఓ తండ్రి, బలి ఇవ్వాలనుకున్న గొర్రె తప్పిపోవడం చుట్టూ ఈ మూవీని రూపొందించారు.
పొట్టేల్ చిత్రంలో యువ చంద్ర కృష్ణ, అనన్యతో పాటు అజయ్, నోయల్, శ్రీకాంత్ అయ్యంగార్, ప్రియాంక శర్మ, తనస్వి చత్రపతి శేఖర్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రంలో నటీనటుల పర్ఫార్మెన్స్‌కు మంచి స్పందన వచ్చింది. అయితే, స్క్రీన్‍ప్లే, రొటీన్ సీన్ల విషయంలో మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో అనుకున్న స్థాయిలో బాక్సాఫీస్ వద్ద పొట్టేల్ చిత్రం రాణించలేకపోయింది.
పొట్టేల్ మూవీని ప్రజ్ఞా సన్నిధి క్రియేషన్స్, నీసా ఎంటర్‌టైన్‍మెంట్ పతాకాలపై నిశాంక్ రెడ్డి, కృతి, సురేశ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రం సుమారు రూ.2.5కోట్ల కలెక్షన్లు సాధించినట్టు అంచనాలు ఉన్నాయి.
పొట్టేల్ సినిమాను ఓ సందేశంలో దర్శకుడు తెరకెక్కించారు. గ్రామీణ బ్యాక్‍డ్రాప్‍లో థ్రిల్లర్‌గా రూపొందించారు. బలి ఇవ్వాలనుకునే గొర్రెల తప్పిపోవడం, దాన్ని వెతికే క్రమంలో ఎదురయ్యే సవాళ్లు, సామాజిక పరిస్థితులు ఇలా అనేక అంశాలను జోడించారు. పిల్లల చదువు, కులవ్యవస్థ అంశాలను చూపించారు. అయితే, నెమ్మదిగా సాగే కథనం పొట్టేల్ మూవీకి మైనస్‍గా మారింది.
సంబంధిత కథనం