Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్! ఎస్బీఐ షేర్ ప్రైజ్ టార్గెట్ ఇదే..
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్ స్టాక్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 964 పాయింట్లు పడి 79,218 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 247 పాయింట్లు కోల్పోయి 23,951 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 564 పాయింట్లు పడి 51,576 వద్దకు చేరింది.
“నిఫ్టీ50కి తదుపరి కీలక మద్దతు 200 రోజుల ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ (డీఈఎంఏ) వద్ద ఉంది. ఇది 23,700 స్థాయి వద్ద ఉంది. దీని కంటే తక్కువకు ఇండెక్స్ పడితే, మరింత ప్రతికూలతకు దారితీస్తుంది,” అని అజిత్ మిశ్రా - ఎస్వీపీ, రీసెర్చ్, రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ తెలిపారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4224.92 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3943.24 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
డిసెంబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 523.4 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 15172.04 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 90 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.04శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.09శాతం పతనమైంది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.10శాతం పడింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
కొఫోర్జ్ లిమిటెడ్- బై రూ. 9657, స్టాప్ లాస్ రూ. 9319, టార్గెట్ రూ. 10333
బీఎస్ఈ లిమిటెడ్- బై రూ. 5791.45, స్టాప్ లాస్ రూ. 5589, టార్గెట్ రూ. 6197
ఇమామీ లిమిటెడ్- బై రూ. 600, స్టాప్ లాస్ రూ. 585, టార్గెట్ రూ. 620
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- బై రూ. 833, స్టాప్ లాస్ రూ. 820, టార్గెట్ రూ. 855
ఐసీఐసీఐ బ్యాంక్- బై రూ. 1288, స్టాప్ లాస్ రూ. 1265, టార్గెట్ రూ. 1320
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
కామత్ హోటల్స్: రూ.242.50 వద్ద కొనండి, టార్గెట్ రూ.255, స్టాప్ లాస్ రూ.233;
మాల్కామ్ ఇండియా: రూ.1610.25 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1700, స్టాప్ లాస్ రూ.1555;
పోకర్ణ: రూ.1266.85 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1350, స్టాప్ లాస్ రూ.1225;
జోటా హెల్త్ కేర్: రూ.805.25 వద్ద కొనండి, టార్గెట్ రూ.860, స్టాప్ లాస్ రూ.775;
శ్రీ రాయలసీమ హై-స్ట్రెంత్ హైపో: రూ .837.90 వద్ద కొనండి, టార్గెట్ రూ .900, స్టాప్ లాస్ రూ .810.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం