OnePlus Ace 5 : 6,400 ఎంఏహెచ్ బ్యాటరీతో వన్‌ప్లస్ ఏస్ 5 సిరీస్- లాంచ్ ఎప్పుడంటే..
OnePlus Ace 5 : వన్‌ప్లస్ ఏస్ 5 సిరీస్ లాంచ్ డేట్‌ని సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..
దిగ్గజ వన్‌ప్లస్ సంస్థ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ లాంచ్‌కు రెడీ అవుతోంది. దీని పేరు వన్‌ప్లస్ ఏస్ 5. ఇందులో 2 గ్యాడ్జెట్స్ ఉంటాయి. అవి ఏస్ 5, ఏస్5 ప్రో. వీటిని డిసెంబర్ 26న చైనాలో లాంచ్ చేస్తున్నట్టు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
వన్‌ప్లస్ ఏస్ 5 సిరీస్: కలర్ వేరియంట్లు..
వన్‌ప్లస్ ఏస్ 5 సిరీస్ కోసం కాన్ఫిగరేషన్ ఆప్షన్స్, కలర్ వేరియంట్లను బ్రాండ్ వెల్లడించింది. 12జీబీ+256జీబీ, 12జీబీ+512జీబీ, 16జీబీ+256జీబీ, 16జీబీ+512జీబీ, 16జీబీ+1టీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి. ఏస్ 5 స్మార్ట్‌ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి.. గ్రావిటేషనల్ టైటానియం, ఫుల్ స్పీడ్ బ్లాక్, సెలెస్టియల్ పార్సిలీన్. ఏస్ 5 ప్రో మూన్ వైట్ పింగాణీ, సబ్ మెరైన్ బ్లాక్, స్టార్రీ పర్పుల్ రంగుల్లో రానుంది. పార్సిలీన్ మోడళ్లలో సిరామిక్ బ్యాక్ ప్యానెల్స్ ఉంటాయని, ఇతర రంగుల్లో గ్లాస్ బ్యాక్ ఉండవచ్చని తెలుస్తోంది.
వన్‌ప్లస్ ఏస్ 5 సిరీస్: స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..
స్పెసిఫికేషన్ల పరంగా ఏస్ 5, ఏస్ 5 ప్రో పలు ఫీచర్లను పంచుకోనున్నాయి. ఈ రెండు మోడళ్లలో 6.78 ఇంచ్ ఫ్లాట్ బీఓఈ ఎక్స్2 ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆప్టికల్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయని సమాచారం. ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఈ రెండు ఫోన్లు పనిచేయనుండగా, ఇందులో ఐఆర్ బ్లాస్టర్, అలర్ట్ స్లైడర్, డ్యూయెల్ స్పీకర్లు, మెటల్ మిడిల్ ఫ్రేమ్ ఉన్నాయి.
సెల్ఫీల కోసం, రెండు డివైజ్లలో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు. ఏస్ 5 ప్రో స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనాలు ఉన్నాయి. వీటిలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి.
వన్‌ప్లస్ ఏస్ 5 స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 6,400 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో కనెక్ట్ చేసి ఉంటుంది. వన్‌ప్లస్ ఏస్ 5 ప్రోలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్, 6,100 ఎంఏహెచ్ బ్యాటరీ, 100వాట్ ర్యాపిడ్ ఛార్జింగ్ సపోర్ట్ వంటివి ఉంటాయి.
వీటి ధరలేంటి? ఈ గ్యాడ్జెట్స్ ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతాయి? వంటి వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు.
సంబంధిత కథనం