Brahmamudi December 20th Episode: కావ్య సహాయం కోరిన రాజ్- హగ్ చేసుకుని కన్నీళ్లు- ఆస్తిపై ధాన్యలక్ష్మీతో రుద్రాణి ప్లాన్
Brahmamudi Serial December 20th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 20 ఎపిసోడ్‌లో కావ్య చుట్టూ రాజ్ తిరుగుతుంటే.. వాడు నీకు దగ్గర అవ్వాలని చూస్తున్నాడు అని అపర్ణ చెబుతుంది. గదిలో రాజ్ కావ్య మధ్య రొమాంటిక్ సీన్ చూసి రుద్రాణి, ధాన్యలక్ష్మీ చీదరించుకుంటారు. రాజ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడని కావ్య అనుకుంటుంది.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కల్యాణ్‌తో ఫోన్ మాట్లాడిన అప్పు తనను అవమానించివారి ముందు తలెత్తుకునేందుకు అంత కష్టపడుతునట్లు చెబుతుంది. ఆరోజు కోసమే ఎదురు చూస్తున్నా అని కల్యాణ్ చెబుతాడు. ఓసారి రావొచ్చు కదా. విజిటింగ్ అవర్స్ ఉంటాయని, ఒక్కరోజు అయినా వస్తావని ఎదురుచూస్తుంటున్నాను అప్పు అంటుంది.
ఏదో మార్పు కనిపిస్తుంది
అలా ఏం లేదని, ఇక్కడ ఓ ముఖ్యమైన పని ఉందని, అది మన భవిష్యత్తు అని కల్యాణ్ అంటాడు. పెళ్లాన్ని పట్టించుకోనంత బిజీ ఏంటీ. కొంపదీసి నేను లేను అని ఇంకా ఎవరినైనా ట్రై చేస్తున్నావా. అలా చేస్తే చంపేయను అని అప్పు అంటుంది. అలాంటిది ఏం లేదని కాల్ కట్ చేస్తాడు కల్యాణ్. ట్రైనింగ్‌కు వచ్చినప్పటి నుంచి వీడిలో ఏదో మార్పు కనిపిస్తుందే. నా దగ్గర ఏదైనా దాస్తున్నాడా. నా మొగుడు అలాంటివాడు కాదులే అని అప్పు డౌట్ పడుతుంది.
మరోవైపు కావ్యను రాజ్ పలకరిస్తే కావ్య వెటకారంగా మాట్లాడుతుంది. మీకు ఏం కావాలి, ఎందుకు వచ్చారు. మీ ఇంట్లో మీకు మొహమాటం ఏంటీ అడుగుతుంది కావ్య. ఏయ్ నా ఇల్లు ఏంటీ. మన ఇల్లు అని రాజ్ అంటాడు. అబ్బా అలా కూడా అనిపిస్తుందా. సరే ఏం కావాలో చెప్పండి అని కావ్య అంటుంది. ఏదోటి చెప్పాలని టీ అడుగుతాడు రాజ్. సరే నువ్ పనిలో ఉన్నావ్ కదా. నేనే టీ పెట్టుకుంటాను అని రాజ్ అంటాడు. మీరు ఇంత మారితే సూర్యూడు కూడా మారుతాడు కదా అని కావ్య అంటుంది.
వెటకారాలు ఆపు అని టీ పెట్టుకునేందుకు ట్రై చేస్తాడు రాజ్. ఇంతలో అపర్ణ వచ్చి ఏం చేస్తున్నావ్ అంటుంది. రాజ్ చెప్పిన డైలాగ్స్‌ను కావ్య చెబుతుంది. అయితే, టీకి వేయాల్సింది టీ పొడి, కాఫీ పొడి కాదు అని తనే పెట్టిస్తుంది అపర్ణ. కావ్యను, నన్ను అడగొచ్చు కదా అని అపర్ణ అంటే.. కావ్య వేరే పనిలో ఉంది కదా. ఇబ్బంది పెట్టడం ఎందుకని అని రాజ్ అంటాడు. దాంతో అపర్ణ, కావ్య షాక్ అవుతారు. నువ్ ఒకరి ఇబ్బంది గురించి, అది కూడా కావ్య ఇబ్బంది గురించి ఆలోచిస్తున్నావా అని అపర్ణ అంటుంది.
నీకు దగ్గర అవుతున్నాడు
మీతో ఇదే ఇబ్బంది. మంచిగా ఉంటే ఓ బాధ లేకపోతే ఒక బాధ. అబ్బా మీ తల్లి పెళ్లాం మధ్య నలిగిపోతున్నాను అని రాజ్ అంటాడు. నిజంగా నీకు మార్పు వస్తే నాకు సంతోషమే. కానీ, ఇంత తొందరగా రావడమే ఆశ్చర్యంగా ఉందని అపర్ణ అంటే.. పో మమ్మీ అని రాజ్ వెళ్లిపోతాడు. వాడి మీద ఏమైనా మంత్రించిన నీల్లు జల్లావా. నువ్వేం చేసిన కొప్పడేవాడు. ఇప్పుడు నీకు దగ్గర అవుతున్నాడు. నీ వంటను మెచ్చుకుంటున్నాడు. మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది. అయినా నాకు కావాల్సింది కూడా అదే అని నవ్వుతూ వెళ్తుంది అపర్ణ.
ఏముందబ్బా అని కావ్య ఆలోచిస్తుంది. తర్వాత కావ్య బూజు దులుపుతుంటే రాజ్ చూస్తాడు. బెడ్‌పై నుంచి కావ్యకి స్లిప్ అవడం చూసి కంగారుగా కళావతి అని పిలుస్తాడు. దాంతో కావ్య ఉలిక్కిపడి కిందపడబోతుంటే రాజ్ పట్టుకుంటాడు. ఇద్దరు రొమాంటిక్‌గా చూసుకుంటారు. తర్వాత ఇంత సడెన్‌గా పిలిస్తే ఎలా. దడుసుకున్నాను అని కావ్య అంటుంది. ఊరుకో కళావతి. నువ్ దడుసుకోవడం ఏంటీ. నువ్వు ఆడపులివి. ఆడ సింహానివి అని రాజ్ అంటాడు.
ఏంటీ ఆకాశానికి ఎత్తేస్తున్నారు అని చెప్పిన కావ్య బెడ్‌పై గీతలు గీసినదాని గురించి ఎత్తుతుంది. అది తీయకు నాకు వాత పెట్టినట్లు ఉంటుంది. సరే నీకు ఏ విధంగా సహాయపడగలను. నాకు ఆఫీస్ వర్క్ తక్కువగా ఉంది. నీకు ఏదైనా హెల్ప్ చేద్దామని అని రాజ్ అంటాడు. సీలింగ్ మొత్తం క్లీన్ చేయాలి. మీరు చేసి పెడతారా అని కావ్య అడిగితే.. ఇబ్బందిగా ఫీల్ అయి తర్వాత ఒప్పుకుంటాడు. బెడ్ ఎక్కి సీలింగ్ క్లీన్ చేస్తుంటాడు రాజ్.
ఉలిక్కిపడిన రాజ్
నీకు ఒక విషయం చెప్పాలి అని రాజ్ అనుకుంటూ బెడ్ చివరకు వచ్చి స్లిప్ అయి కావ్యపై పడతాడు రాజ్. ఇక్కడ మరోసారి రొమాంటిక్‌గా చూసుకుంటారు ఇద్దరు. అప్పుడే అటుగా వెళ్తున్న ధాన్యలక్ష్మీ, రుద్రాణి చూసి కోపంగా వెళ్లిపోతారు. కింద ఉన్న రాజ్‌తో అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఒక కొడుకు అని కావ్య అంటుంది. దాంతో ఉలిక్కిపడి రాజ్ పైకి లేచి వెళ్లిపోతాడు. మరోవైపు రాజ్, కావ్య గురించి మాట్లాడుకుంటారు. ఆ జంట పక్షుల రొమాంటిక్ సన్నివేశం అని రుద్రాణి అంటుంది.
వేళపాళ లేకుండా ఆ ముద్దు ముచ్చట ఏంటీ. ఏదైనా ఉంటే తలుపులు వేసుకోవాలి కానీ, ఇంతమంది జనం ఉన్నారు. ఎవరైనా చూస్తారన్న జ్ఞానం, కొంచెం కూడా సిగ్గు లేదు. అందుకే వెంటనే వచ్చాను అని ధాన్యలక్ష్మీ అంటుంది. నీకు అర్థమైంది అదేనా. వాళ్లిద్దరు అలా కలిసిపోతే మనిద్దరం ఇంట్లో ఏం చేయలేం. ముసలోడు ఇంట్లోకి తీసుకొస్తే ఏ ప్రేమ జీవి పుట్టిందో కానీ, కావ్యే జీవితం అన్నట్లుగా రొమాన్స్ చేస్తున్నాడు. ఇంట్లో అధికారం కావ్య చేతిలో, ఆఫీస్ రాజ్ చేతిలో ఉంది. వాళ్లిద్దరే ఇల్లును ఏలుతారు అని రుద్రాణి అంటుంది.
ఇక నీ కొడుకు కవితలు రాస్తాడు కాబట్టి వాళ్ల రాజ్యంలో ఆస్థాన కవిలా, నా కొడుకు బాడీ ఉంది కాబట్టి సైన్యాధ్యక్షుడులా పదో పరకో తీసుకుని బతుకుతారు. ఎలా చేస్తే నీకు ఆస్తి, వాటా వస్తుందో అది ఆలోచించు అని మంట పెట్టి వెళ్లిపోతుంది రుద్రాణి. మరోవైపు సుభాష్‌తో రాజ్ చాలా మారిపోయాడు అని, మనముందు కావ్య మీద ఇష్టంలేనట్లు నటిస్తూనే చాటుగా దానిపై ప్రేమను చూపించడం మొదలుపెట్టాడు అని అపర్ణ అంటుంది.
సమస్యలన్ని తీరిపోతాయ్
పగటి కలలు కంటున్నావా అని సుభాష్ అంటాడు. లేదు చూశాను. వాడు కావ్యను కవ్విస్తున్నాడు అని రాజ్ చేసిందంతా చెబుతుంది అపర్ణ. వీళ్లిద్దరు ఇలాగే ఉంటే ఇల్లును ఎవ్వరు ముక్కలు చేయరు. ఇలాగే ఉంటాం అని అపర్ణ అంటుంది. అవునా. నిజానికి సమస్యలన్ని వాడి వల్లే వస్తున్నాయి. వాడే మారి కావ్యను అర్థం చేసుకుని ఒక్కటైతే అన్ని సమస్యలు తీరిపోతాయి అని సుభాష్ అంటాడు. నిజంగా జరుగుతుంది. త్వరలోనే తన మనసులోని ప్రేమను రాజ్ బయటపెడతాడు అని అపర్ణ అంటుంది.
ఆ మాటలు విన్న కావ్య నిజంగా ఆ మొండి మనిషిలో మార్పు వచ్చిందో. నిజంగా నాకు ప్రపోజ్ చేస్తారా. చూద్దాం ఎలా చేస్తారో అని కావ్య సంతోషపడుతుంది. మరోవైపు రాజ్‌కు మేనేజర్ కాల్ చేసి రేపు బ్యాంక్ ఆఫీసర్స్ ఆఫీస్‌కు వస్తున్నారు. వాళ్లకు మనం అమౌంట్ సెటిల్ చేసే డేట్ చెప్పాలి. లేకపోతే జప్తు చేయడానికి తర్వాతి ప్రొసీజర్స్ ప్రిపేర్ చేస్తారు అని చెబుతాడు. అదంతా నేను చూసుకుంటాను. నువ్ మాత్రం ఇది ఎవరికి చెప్పకు అని రాజ్ అంటాడు.
ఏడ్చిన రాజ్
ఎలాగైనా ఈ విషయం కావ్యకు చెప్పి సాల్వ్ చేయాల్సిందే అని కావ్య దగ్గరికి వెళ్తాడు రాజ్. అది చూసి కావ్య మురిసిపోతుంది. దాంతో రాజ్ షాక్ అవుతాడు. డోర్ వేయనా, గడియ పెట్టనా అని రాజ్ అడిగితే.. సిగ్గుగా మీ ఇష్టం అని కావ్య అంటుంది. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నేను ఒక పెద్ద సమస్యలో ఉన్నాను. నువ్వే నాకు సహాయం చేయాలి అని ఆస్తి జప్తు గురించి జరిగింది చెబుతాడు రాజ్. తర్వాత కావ్యను హగ్ చేసుకుని ఎమోషనల్ అవుతాడు రాజ్. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.