Brahmamudi December 13th Episode: కావ్య సమర్థురాలని నమ్మిన రాజ్- కల్యాణ్‌తో ధాన్యలక్ష్మీ కేసు- డబ్బు అడుక్కున్న రుద్రాణి-brahmamudi serial december 13th episode raj trust in kavya dhanyalakshmi files case star maa brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi December 13th Episode: కావ్య సమర్థురాలని నమ్మిన రాజ్- కల్యాణ్‌తో ధాన్యలక్ష్మీ కేసు- డబ్బు అడుక్కున్న రుద్రాణి

Brahmamudi December 13th Episode: కావ్య సమర్థురాలని నమ్మిన రాజ్- కల్యాణ్‌తో ధాన్యలక్ష్మీ కేసు- డబ్బు అడుక్కున్న రుద్రాణి

Sanjiv Kumar HT Telugu
Dec 13, 2024 07:39 AM IST

Brahmamudi Serial December 13th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 13 ఎపిసోడ్‌లో కావ్యకు ఇంటి పత్రాలతోపాటు ఇంటి తాళాలు కూడా ఇస్తుంది అపర్ణ. ఇంటి బాధ్యతలను ధైర్యంగా నెరవేర్చమని చెబుతుంది. తనకు బాధ్యతలు వద్దన్న కావ్య అంటే నువ్వే కరెక్ట్, సమర్థురాలివి అని ఆప్యాయంగా రాజ్ మాట్లాడుతాడు.

బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 13వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 13వ తేది ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో తనపై ఆస్తి మొత్తం రాయడంపై కృష్ణుడితో చెప్పుకుంటుంది కావ్య. సౌభాగ్యం కావాలని అడిగితే ఐశ్వర్యం మొత్తం రాయించి ఇస్తావా. ఇదేం లీలా స్వామి. నువ్ గోవర్ధన గిరి కొండ ఎత్తావ్. దానికంటే బరువైనది ఈ బాధ్యత. నువ్ కాలియిని తోక పట్టుకుని పడగలపై నాట్యం చేశావ్. అంతకంటే పెద్ద సర్పం ఉంది ఈ ఇంట్లో. దానిని మదించడం నా వల్ల అగునా అని కావ్య అంటుంది.

ఆ దేవుడే తోడు

నా భర్త మనసు మార్చి నా మనసు తేలిక చేస్తావ్ అని ఆశ పడితే నా నెత్తిన ఇంత బరువు పెట్టి నన్ను నడవమంటావా. ఇదెక్కడి న్యాయం కృష్ణ అని కావ్య అంటుంది. ఇంతలో ఇందిరాదేవి వచ్చి ఇక్కడేం చేస్తున్నావ్ అంటుంది. నిందాస్థుతి అని కావ్య అంటుంది. ఆ దేవుడు నీకు ఏం ఇవ్వాలో అదే ఇచ్చాడు. ఏది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు. ఆ జగద్గురువే నీ తోడు ఉంటాడు. నీకు వెలుగు చూపిస్తాడు. ఇంత ఆస్తి ఇచ్చింది ఆయనే. ఇదే నీకు సముచితమైన స్థానం, కాదనకుండా బాధ్యత తీసుకో అని ఇందిరాదేవి అంటుంది.

సుభాష్ వచ్చి చాలా సంతోషంగా ఉంది. ఆస్తి మొత్తం అపాత్రదానం కాకుండా దేవుడు కాపాడాడు. సమయానికి మనకు ఈ వీలునామా వచ్చేలా చేశాడు. ఆస్తి నా పేరుమీద రాసిన, రాజ్ మీద రాసిన ఆ రాబందులు అడగకుండా ఉండరు. అందుకే చాలా దూరం ఆలోచించి నీ మీద నాన్న రాశారు అని సుభాష్ అంటాడు. చిన్నత్తయ్య కోర్ట్‌కు వెళ్తానంటున్నారు, రుద్రాణి ఎగదోస్తున్నారు. వీరిని నేను అడ్డుకోగలనా అని కావ్య అంటుంది.

వాళ్లు ఇక ఏం చేయలేరు. అంత పకడ్బంధీగా వీలునామా రాశారు అని సుభాష్ అంటే.. ధైర్యంగా ముందడుగు వేయు. నీకు అత్త మామలే కాదు మా అత్త మామల సపోర్ట్ ఉంది అని అపర్ణ అంటుంది. దాంతో వీలునామాను కావ్యకు సుభాష్ ఇస్తాడు. ఇకనుంచి ఆస్తి బాధ్యతలే కాదు. ఇంటి బాధ్యతలు నీకే అప్పగిస్తున్నాను అని తాళాలు ఇస్తుంది అపర్ణ. మీరు బాధ్యత నుంచి తప్పుకుని బాగానే ఉంటారు. ఇకనుంచి నాకే కత్తిమీద సాములా ఉంటుంది అని కావ్య అంటుంది.

బాధ్యతలు నా వల్ల కాదు

ఇది నువ్ ఎప్పుడైనా చేయాల్సిందే. కోడలిగా భరించాల్సిన బాధ్యతే ఇది. కానీ, కాస్తా ముందు వచ్చింది అని అపర్ణ అంటుంది. ఈ దారి ముళ్లదారి కాదనట్లేదు. ఏరిపారేస్తు నడవాల్సిందే. ధైర్యంగా ఉండు అని ఇందిరాదేవి అంటుంది. అంతా వెళ్లిపోతారు. వీళ్లు ఇలాగే మాట్లాడతారు. ఆయనకు చెప్పి ఎలాగైనా ఈ బాధ్యత నుంచి తప్పుకోవాలి అని కావ్య అనుకుంటుంది. రాజ్ దగ్గరికి వెళ్లి ఇంటి పత్రాలు, ఇంటి తాళాలు పెడుతుంది.

ఇంటి బాధ్యతలను అత్తయ్య ఇచ్చారు. అది నా వల్ల కాదు. ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చాను. ఖర్చులు, బాధ్యతలు అంటూ పెద్దమాటలు మాట్లాడుతున్నారు. అది కొంచెం చూసుకోండి అని కావ్య వెళ్లిపోతుంది. ఏంటీ కామెడీ చేస్తున్నావా. తాతయ్య నీకు ఇస్తే ఇలా వెళ్లిపోవడంలో అర్థమేంటీ. నేను తీసుకోను. ఈ ఇంట్లో అందరికంటే సమర్థురాలివి. అందుకే తాతయ్య నీ మీద నమ్మకంతో రాశారు అని రాజ్ అంటాడు.

తాతయ్య వచ్చాకా చెబుతాను. ఇప్పుడు అయితే మీరు తీసుకోండి అని కావ్య అంటుంది. నేను ఏదైనా సాధించుకుంటాను. ఇలా దానధర్మాలతో ఇస్తే వద్దు. ఏది ఇచ్చిన తాతయ్య ఇవ్వాలి. నువ్వు కాదు. నీకు చెప్పిన పని నాకు చెప్పి ఇబ్బంది పెడుతున్నావ్ అని రాజ్ అంటాడు. కావ్య పత్రాలు తీసుకుంటుంది. కళావతి నేను ఆలోచించుకునే చెబుతున్నాను. ఒకరకంగా ఈ బాధ్యతలను చూసుకోడానికి నువ్వే కరెక్ట్. ఆ తాళాలు నీ చేతుల్లోనే ఉంటేనే సేఫ్‌గా ఉంటాయి. తాతయ్య పెట్టుకున్న నమ్మకాన్ని నిలెబడతావని అనుకుంటున్నాను అని రాజ్ చెబుతాడు.

చేతిలో చిప్ప

దాంతో కావ్య ఆశ్చర్యంగా ఫీల్ అవుతుంది. మరోవైపు రుద్రాణి, రాహుల్ తల పట్టుకుని కూర్చుంటారు. కుట్రలు, కుతంత్రాలు చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయిందని రుద్రాణ అంటుంది. కావ్య క్యారెక్టర్ ఇంతటితో క్లోజ్ అవుతుందనుకున్న ప్రతిసారి రీ ఎంట్రీ ఇచ్చి మనకే షాక్ ఇచ్చిందని రాహుల్ అంటే.. ఆస్తి మొత్తం తన గుప్పిట్లో పెట్టుకుని షాక్ ఇచ్చింది అని రుద్రాణి అంటుంది. షాక్ కాదు మామ్ చేతిలో చిప్ప ఇచ్చిందని రాహుల్ అంటాడు.

దీని నుంచి కోలుకోవాలి. లేకుంటే భవిష్యత్ భయంకరంగా ఉంటుంది. తలుచుకుంటేనే భయమేస్తుంది అని రుద్రాణి అంటుంటే అనుకున్నది ఒక్కటి అయింది ఒక్కటి అని పాట వినిపిస్తుంది. ఇంతలో స్వప్న వస్తుంది. చిరాకు తెప్పించకు. నాకు కోపం తెప్పించకు. నేను ఉరేసుకుని చచ్చి దానికి నువ్వే కారణం అని చెబుతాను అని రుద్రాణి అంటుంది. మాకు అంత అదృష్టం ఎక్కడిది. మీరు పోతే పచ్చని సంసారంలో నిప్పులు పోసేది ఎవరు. విలన్స్ లేని సినిమాలు, మీలాంటి లేని కొంపలు ఉండవేమో కదా అని స్వప్న అంటుంది.

ఒసేయ్ పిచ్చిమొహమా. రాహుల్‌కు ఆస్తి వస్తే నీకు వచ్చినట్లే కదా. ఇప్పుడు నీ చెల్లి మొత్తం నొక్కేసింది. ఈ ఇంటి పగ్గాలు దాని చేతికి వెళ్తే సొంత చెల్లి దగ్గరే చేతులు చాచి అడుక్కోవాలి అని రుద్రాణి అంటుంది. అడుగుతాను అని స్వప్న అంటే.. నీకు సిగ్గు లేదా. అసలు నువ్ నా కోడలివేనా అని రుద్రాణి అంటుంది. కుతంత్రాలు చేసిన నీకు లేని సిగ్గు నాకెందుకు. నీ కోడలి అనేది నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేయడానికి ట్రై చేసినప్పుడు తెలియలేదా అని స్వప్న అంటుంది.

కావ్య కాళ్లు పట్టుకోవాలా

నీకు సిగ్గు లేకుంటే నాకు ఉంది. దాని నుంచి ఆస్తిని ఎలా లాక్కోవాలో నాకు బాగా తెలుసు అని రుద్రాణి అంటుంది. మిమ్మల్ని ఎలా ఆపాలో నాకు తెలుసు. ఆస్తి లాక్కోవడం కాదు. ఆస్తిలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్న కావ్య కాళ్లు పట్టుకునేలా చేస్తాను అని స్వప్న వెళ్లిపోతుంది. మామ్ ఇప్పుడు మన ఖర్చులకు నిజంగానే ఆ కావ్య కాళ్లు పట్టుకోవాలా అని రాహుల్ అంటే.. కాళ్లు పట్టుకోవడం కాదు. అదే మన కాళ్లు పట్టుకునేలా చేస్తాను చూడు అని రుద్రాణి అంటుంది.

మరోవైపు చూడండి లాయర్ గారు. నా కొడుకు విషయంలో అన్యాయం జరిగితే మాత్రం నేను ఊరుకోను. ఎంత ఖర్చు అయిన పర్లేదు నా కొడుకుకు రావాల్సిన వాటా రావాల్సిందే. ఎక్కడైనా తాత ఆస్తి మనవళ్లకు రావాలి. కానీ, ఇక్కడ కోడలికి రాశారు. అది అఫీషియల్‌గా చెల్లదుగా అని ఫోన్‌లో లాయర్‌తో ధాన్యలక్ష్మీ అంటుంది. అవును మేడమ్. చెల్లదు. మనమే గెలుస్తాం. మీరు అన్నట్లుగానే కావ్య మీద కేస్ ఫైల్ చేస్తాను అని అటు నుంచి లాయర్ అంటాడు. ఆ మాటలు ప్రకాశం వింటాడు.

కావ్యపై కేస్ వేయడానికి రెడీ అయిపోవా. లాయర్ కేసు తీసుకుంటా అన్నాడా అని ప్రకాశం అంటాడు. కేసు గెలుస్తామని కూడా అన్నాడని ధాన్యలక్ష్మీ అంటుంది. కేస్ తీసుకునేముందు వంద కథలు చెబుతాడు. ఎందుకుంటే ముందు వాడికి కేసు కావాలి. నీ దగ్గర లక్షలు గుంజాలి కదా. అసలు నీకు ఏ అధికారం ఉందని కావ్యపై కేసు వేసి గెలుస్తానని అనుకుంటున్నావ్ అని ప్రకాశం అంటాడు. అంటే, నేను గెలవని అనుకుంటున్నారా, కల్యాణ్‌కు అధికారం ఉందని ధాన్యం అంటుంది.

వాడి ప్రేమను గెలుచుకో

కల్యాణ్ తన వదినపై ఆస్తికోసం కేసు వేస్తాడని అనుకుంటున్నావా అని ప్రకాశం అంటే.. వేస్తాడు. నేను అడిగితే వేస్తాడు అని ధాన్యలక్ష్మీ అంటాడు. నీ వల్లే ఇంటి నుంచి వెళ్లిపోయినవాడు నీ మాట ఎందుకు వింటాడు. కల్యాణ్‌కు నిజంగా ఆస్తి కావాలంటే అస్థిత్వం కోసం బయటకు వెళ్లడు. ఇంట్లో మహారాజులా కూర్చునేవాడు. ముందు వాడి ప్రేమను గెలుచుకో అని ప్రకాశం వెళ్లిపోతాడు. తర్వాత హాస్పిటల్ నుంచి కల్యాణ్ కాల్ చేసి ఏమైనా చెప్పాడా అని ఇందిరాదేవి అడుగుతుంది.

కోమాలో ఉన్న వాళ్ల గురించి కొత్తగా చెప్పాల్సింది ఏముంటుంది. ఇప్పట్లో బయటకు రారని చెప్పారుగా అని రుద్రాణి అంటుంది. రావడం చెప్పలేం అన్నారు. అదృష్టం ఉంటే త్వరగా కోలుకుంటారు అని అపర్ణ అంటుంది. మనింట్లో అదృష్టం కనుమరుగై చాలా రోజులు అయిందని రుద్రాణి అంటుంది. దాంతో స్వప్న పంచ్‌లు వేస్తుంది. ఇంతలో కనకం వస్తుంది. అక్కడే ఉండటంతో ఆగిపోయావే అని అపర్ణ లోపలికి పిలుస్తుంది. ఇంట్లో అధికారం నీ కూతురికే ఉంది. నువ్ దర్జాగా రావొచ్చు అని రుద్రాణి అంటుంది.

ఇంట్లోకి ఎంట్రీ దొరకదనుకున్న కావ్యకు మావయ్య పుణ్యంతో ఇంటి పత్రాలే వచ్చాయి అని ధాన్యలక్ష్మీ అంటుంది. రుద్రాణి, ధాన్యలక్ష్మీ నానా మాటలు అంటారు. ప్రకాశం అడ్డుకోవడంతో కనకం వచ్చి ఇందిరాదేవిని పలకరిస్తుంది. ఓదార్పుగా కనకం మాట్లాడుతుంటే రుద్రాణి పంచ్‌లు వేస్తుంది. దానికి స్వప్న పంచ్ వేస్తే రాహుల్ తల్లిని సమర్ధిస్తాడు. దాంతో ప్రకాశం పంచ్‌లు వేస్తాడు. ఆస్తికోసం గుంట నక్కల్లా ఎదురు చూస్తుంది మీరిద్దరే కదా అని ప్రకాశం అంటాడు.

గొడవలు పడటం ఎందుకు

పలకరించడానికి వచ్చిందో.. ఆస్తి పగ్గాలు ఎలాగు కూతురికి ఇచ్చారు అని ఏదైనా ఆస్తి రాయించుకుందామని వచ్చిందో అని రుద్రాణి అంటుంది. అపర్ణ వారిస్తుంది. మీకు కావాల్సిన వారు వచ్చారు కదా. ఇచ్చుకోండి. ఆస్తి మొత్తం కనకంకే ఇచ్చుకోండి అని వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మీ. నా గురించి మీరు గొడవలు పడటం ఎందుకు అని కనకం అంటుంది. చేసిందంతా చేసి ఎంత అమాయకంగా నటిస్తున్నావ్. మీ కూతురుతో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయించి రాయించేలా చేశావ్ అని రుద్రాణి అంటుంది.

అలాంటి ఆలోచనలు నాకు, నా కూతుళ్లకు లేదు. కావ్యే సమర్థురాలని ఆ పెద్దాయన రాశారు అని కనకం అంటుంది. కట్ చేస్తే కావ్యను రుద్రాణి రెండు లక్షలు అడుగుతుంది. ఎందుకని కావ్య అడిగితే.. అది చెప్పాల్సిన అవసరం నీకు లేదు. అలా అడిగితే మమ్మల్ని నువ్ అవమానించినట్లే అని ధాన్యలక్ష్మీ అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి ఎపిసోడ్ ముగుస్తుంది.

Whats_app_banner