Brahmamudi December 7th Episode: కోమాలోకి తాతయ్య- ఆస్తి పంచిస్తానన్న సుభాష్- కావ్యపై నిందలు- సాధించేసిన రుద్రాణి, ధాన్యం-brahmamudi serial december 7th episode indiradevi in pain subhash on house property star maa brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi December 7th Episode: కోమాలోకి తాతయ్య- ఆస్తి పంచిస్తానన్న సుభాష్- కావ్యపై నిందలు- సాధించేసిన రుద్రాణి, ధాన్యం

Brahmamudi December 7th Episode: కోమాలోకి తాతయ్య- ఆస్తి పంచిస్తానన్న సుభాష్- కావ్యపై నిందలు- సాధించేసిన రుద్రాణి, ధాన్యం

Sanjiv Kumar HT Telugu
Dec 07, 2024 09:38 AM IST

Brahmamudi Serial December 7th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 7 ఎపిసోడ్‌లో సీతారామయ్య కోమాలోకి వెళ్లినట్లు డాక్టర్ చెబుతాడు. అప్పటికే బ్యాడ్ టైమ్ నడుస్తుందని ఫీల్ అయిన రుద్రాణి మరింత షాక్ అవుతుంది. ఇక ఇంట్లో ఆస్తి గురించి మళ్లీ రచ్చ చేస్తారు ధాన్యలక్ష్మీ, రుద్రాణి. దాంతో ఇందిరాదేవి ఫైర్ అవుతుంది.

బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 7వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 7వ తేది ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో హాస్పిటల్‌లో సీతారామయ్యకు క్రిటికల్‌గా ఉండటంతో అంతా బాధపడుతూ ఉంటారు. అసలే ఇంట్లో బ్యాడ్ టైమ్ నడుస్తుంటే ఈ సాడ్ న్యూస్ ఏంట్రా మనకి. మనల్ని సెట్ చేయకుండా ఈ ముసలాయన టాటా బై బై చెప్పేస్తాడా ఏంటీ అని రాహుల్‌తో రుద్రాణి అంటుంది. ఇంతలో అక్కడికి కల్యాణ్ వస్తాడు.

yearly horoscope entry point

అత్యాశే అవుతుంది

ఇందిరాదేవి ఏడుస్తుంటే కల్యాణ్ తాతయ్యకు ఏం కాదని ఓదారుస్తాడు. వచ్చాడమ్మా ఓదార్పుయాత్రికుడు. అయినా ఆ ముసలోడు పాతికేళ్ల వయసులో హాస్పిటల్ పాలు అయినట్లు ఫీల్ అవుతారేంటీ. ఇన్నాళ్లు ఉండటమే చాలా పెద్ద విషయం. ఇంతకంటే ఎక్కువ ఆశించటం అత్యాశ అవుతుందని వీళ్లకు తెలియట్లేదు పూర్ ఫెల్లోస్ అని రుద్రాణి అంటుంది. తాతయ్యకు ఎలా ఉందని, ఏమైందని రాజ్‌‌ను అడుగుతాడు కల్యాణ్.

ఏం చెప్పలేదు. ట్రీట్‌మెంట్ నడుస్తుందని రాజ్ అంటాడు. కొంతమంది బుద్ధి లేని వాళ్ల జరిగిందంటూ అపర్ణ చెబుతుంటే సుభాష్ వద్దని అంటాడు. డాక్టర్ రాగానే అంతా ఏమైందని అడుగుతారు. చూశావా గొర్రెల మందలా ఎలా పడిపోయారో. వీళ్ల దెబ్బకు డాక్టర్ కూడా పేషంట్ అవుతాడు అని సెటైర్లు వేస్తూ ఉంటుంది రుద్రాణి. మా ప్రయత్నం బాగా చేశాం. కానీ, బీపీ బాగా పెరిగిపోయి బ్రెయిన్‌పై హెవీగా ఒత్తిడి పడింది. దాంతో ఆయన కోమాలోకి వెళ్లిపోయారు అని డాక్టర్ చెబుతాడు.

దాంతో అంతా షాక్ అవుతారు. ఇందిరాదేవి కళ్లు తిరిగి కుప్పకూలిపోతుంది. ఇదేంట్రా ముసలోడు ఇంతపెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆస్తి పంపకాలు ఎవరు చేస్తారని రుద్రాణి అనుకుంటుంది. మేము చేయగిలిగింది ఏం లేదు. పేషంట్‌లో చలనం వస్తేనే ఏమైనా చేయగలం. దానికి కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు పట్టొచ్చు. అప్పటివరకు అబ్జర్వేషన్‌లో ఉంచాలి అని డాక్టర్ అంటాడు. మా నాన్నగారి ప్రాణాలకు ప్రమాదం ఏం లేదు కదా అని సుభాష్ అడుగుతాడు.

ఇంటికి వెళ్లనంటూ

అది ఇప్పుడే చెప్పలేం. హార్ట్ కండిషన్ అయితే నార్మల్‌గానే ఉంది. అంతా మంచే జరగాలని కోరుకుందాం అని చెప్పేసి వెళ్లిపోతాడు డాక్టర్. దాంతో ఇందిరాదేవి ఏడుస్తూనే ఉంటుంది. కావ్య ఓదారుస్తుంది. నానమ్మను ఇక్కడే ఉంచుతే మరింత కుంగిపోతుంది. నేను ఇక్కడ తాతయ్యను చూసుకుంటాను. మీరు ఇంటికి వెళ్లండి అని కల్యాణ్ అంటాడు. నేను ఆయన్ను వదిలిపెట్టి వెళ్లను అని ఇందిరాదేవి మొండిగా అంటుంది. దాంతో అపర్ణ, రాజ్ వచ్చిన కన్విన్స్ చేస్తారు.

పేషంట్ దగ్గరే ఒక్కరే ఉండాలని రాజ్ చెబుతాడు. సుభాష్ కూడా అనడంతో ఎందుకు నన్ను బలవంతపెడుతున్నారు. ఇక్కడే ఉంటాను అంటుంది. అమ్మమ్మ మీరు ఇక్కడే ఉండి మరో పేషంట్ అవుతారా. తాతయ్య గారు ఆరోగ్యంగా కోలుకుని వచ్చేసరికి మీరు బాగా ఉంటేనే కదా ఆయన సంతోషిస్తారు. ఆయన కోసమైనా మీరు ఇంటికి రావాలి. వస్తున్నారు అంతే అని కావ్య అంటుంది. దాంతో ఇందిరాదేవి వెళ్లడానికి ఒప్పుకుంటుంది.

అంతా వెళ్లిపోతారు. హాస్పిటల్‌లో కల్యాణ్ ఒక్కడే ఉంటాడు. మరోవైపు కనకంకు జరిగింది చెబుతుంది కావ్య. కృష్ణమూర్తి వచ్చి ఏమైందని అడుగుతాడు. అల్లుడు గారికి ఇష్టం లేకపోయినా పెద్దాయన మాటతో ఊరుకున్నారు. ఇకనైనా ఆ పెద్దాయన మాట విని అల్లుడు గారు కావ్యను బాగా చూసుకుంటారని అనుకున్నాం. ఇంటికి వెళ్లాక ఆ బుర్ర తక్కువ ధాన్యలక్ష్మీ, బుద్ధిలేని రుద్రాణి ఆస్తి కోసం గొడవ పడ్డారట. వారిని వారిస్తుంటే ఆ పెద్దాయనకు గుండెపోటుకు వచ్చారట. ఇప్పుడే ఇంటికి వెళ్లారట. ఆయన కోమాలోకి వెళ్లారట అని కనకం అంటుంది.

ఆజ్యం పోసినట్లు అవుతుంది

మహావృక్షం లాంటి ఆ మనిషి అలా కూలిపోవడం ఏంటీ అని కృష్ణమూర్తి అంటాడు. పేరుకే అది లంకతో కొంప కానీ, పిచ్చుక గూడంత ప్రేమలేదని ఇప్పుడే అర్థం అవుతుంది అని కనకం అంటుంది. పాపం ఆ పెద్దావిడ సంగతి ఏంటీ అని కృష్ణమూర్తి అంటాడు. కానీ, ఆయనకు అలా కావడం కావ్య వల్లే అని నిందిస్తారో, కావ్య వెళ్లిన వేళ విశేషం బాగాలేదంటారేమో అని భయంగా ఉంది. ఓసారి వెళ్లి చూసొద్దామా అని కనకం అంటుంది.

వద్దు. ఇప్పుడు మనం వెళ్తే అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతుంది అని కృష్ణమూర్తి అంటాడు. మన అమ్మాయికి జీవితాంతం అడుగడుగునా కష్టాలు ఎదురవతూనే ఉన్నాయి అని బాధపడతారు. మరోవైపు సీతారామయ్య ఫొటో పట్టుకుని ఇందిరాదేవి బాధపడుతుంది. కావ్య వచ్చి ఓదారుస్తుంది. మీరే ధైర్యంగా లేకపోతే ఎలా. ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొని వచ్చి ఉంటారు. ఇలా అయితే ఎలా అని అంటుంది. నేను అన్ని ఎదుర్కుంది ఆయన వల్లే. ఆయనే లేకపోతే ఎలా అనిపిస్తుంది. ఆయన్ను అలా చూస్తుంటే చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది అని ఇందిరాదేవి అంటుంది.

తాతయ్య గారు మిమ్మల్ని తిరిగి కలుసేందుకు చావుకు ఎదురుతిరిగారు. తన ప్రాణాలతో పోరాడుతున్నారు. మీరు మాత్రం నమ్మకాన్ని కోల్పోయి ఇలా బాధపడుతున్నారు. తాతయ్య గారు ఇంటికి వచ్చినరోజు మీరు కుంగిపోయి బాధపడుతుంటే ఆయన బాధపడరా. నా వల్ల నా చిట్టి ఇలా అయిందని కుంగిపోరా. మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా తాతయ్యకు సంతోషాన్ని ఇస్తుంది. ఈ కష్టాన్ని దాటి ముందుకు రండి. ధైర్యంగా నిలబడండి. అప్పుడే ఇంట్లోవాళ్లకు ధైర్యం వస్తుంది. ఉదయం నుంచి ఏం తినలేదు. వచ్చి భోజనం చేయండి అని కావ్య మోటివేట్ చేస్తుంది.

ఏదోటి నిర్ణయం తీసుకోవాలి

ఇందిరాదేవి తినాలని లేదే అని అంటుంది. అయితే నేను కూడా తినను. మీరు ఎన్నిరోజులు పస్తులుంటే నేను ఉంటాను అని కావ్య అనడంతో తినడానికి ఒప్పుకుంటుంది ఇందిరాదేవి. డైనింగ్ టేబుల్ దగ్గర అంతా ఉంటారు. అందరికి కావ్య వడ్డిస్తుంది. అడుగు అని ధాన్యలక్ష్మీకి చెబుతుంది రుద్రాణి. ధాన్యలక్ష్మీ సైలెంట్‌గా ఉండటంతో అన్నయ్య ఏం ఆలోచించారు. ఏదోటి నిర్ణయం తీసుకోవాలి కదా. ధాన్యలక్ష్మీ ఉరెసుకోడానికి సిద్ధపడింది. కొంచెం మానవత్వం, దయ, జాలి లేవా అని రుద్రాణి అంటుంది.

ఇప్పుడే అందరం కలిసి ఏదో ఒక పరిష్కారం తీసుకుంటే బాగుంటుంది. నాన్నకు జరగరానిది జరిగితే ఎవరికేం చేయాలో అర్థం కాకుండా పోతుంది అని రుద్రాణి అంటుంది. ఎంత కమిషన్ అడ్వాన్స్‌గా తీసుకున్నారు. ధాన్యలక్ష్మీగారికి ఆస్తి రాయించడానికి ఎంత పర్సంటేజ్ మాట్లాడుకున్నారు అని కావ్య అంటే.. రుద్రాణి కోపంగా లేవడానికి ట్రై చేస్తుంది. హేయ్ ఆగు. వేడి వేడి సాంబారు నెత్తిమీద పోసి చంపేస్తాను అని స్వప్న వార్నింగ్ ఇస్తుంది.

తాతయ్య గారు అలా ఉంటే ఇంటి కోడలిగా అందరు కడుపుకు ఇంత అన్నం తినేలా చేయాలి. కానీ, ఇలా ఆస్తి కోసం రుద్రాణిలాంటి వారిని ఎగదోయకూడదు ధాన్యలక్ష్మా గారు అని కావ్య అంటుంది. చూశారా పేరు పెట్టి పిలుస్తుంది అని ధాన్యలక్ష్మీ అంటుంది. సిగ్గుండాలి. ఇంకొకరైతే బుద్ధిలేదా అని తిట్టేవాళ్లు అని ప్రకాశం అంటాడు. మీరు అడిగిన మనిషిని వదిలేశారు అంకుల్ అని స్వప్న అంటుంది. దాన్ని ఎవడైనా మనిషి అంటారా. పెంపుడు జంతువులు నయం అని ప్రకాశం అంటాడు.

నీకు ఇచ్చేదేంటీ మర్యాద

అన్నం తినేటప్పుడు ఇలాంటి మాటలు అవసరమా అని కావ్య అంటే.. నీకు ఏం సంబంధం ఉంది అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఏమన్నావ్. నేను ఎలా పెద్ద కోడలిగా వచ్చానో. తను కూడా అలాగే వచ్చింది. ఆ మాట ఎలా అంటున్నావ్. అసలు ఏం సంబంధం ఉందని, ఏ దిక్కులేని వాళ్లు మా మావయ్య పంచన చేరిన వాళ్లతో మాట్లాడించావ్ అని అపర్ణ అంటుంది. వదినా మాటలు మర్యాదగా రాని అని రుద్రాణి అంటుంది.

హే షటప్. నీకు ఇంకా మర్యాద ఇచ్చేదేంటీ. నీ ముందు అన్నం ఉంది. అది ఎవరి వల్ల వచ్చింది. ఆ అన్నం పెట్టిన మనిషి చావుబతుకుల్లో ఉంటే చెంచాగిరి చేస్తున్నావా. ఎంత కమిషన్‌కు ఒప్పందం చేసుకున్నావ్ అని అపర్ణ అంటుంది. నేను ఉరెసుకునేదాకా వెళ్లిన మీరు మారేలా లేరు. ఏదో ఒక సాగు చూపించి ఎంతకాలం సాగదీస్తారో చెప్పండి. అయినా పెద్దవాళ్లు మీరు మాట్లాడాలి. కానీ, కావ్య జోక్యం చేసుకోవడం ఏంటీ. పెద్ద కోడలు అని నువ్వంటే సరిపోదు. నీ కొడుకు కూడా ఒప్పుకోవాలి అని ధాన్యలక్ష్మీ అంటుంది.

పుట్టింట్లో గతిలేక ఏడుస్తుంటే ఇక్కడ బతకమని మావయ్య గారు తీసుకొచ్చారు ఆవిడను అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఏంటీ. పుట్టింట్లో గతిలేక ఉందా. అత్తింటికి అన్నం తీసుకొచ్చి పెట్టింది. నేను నా కోడలు ఇంట్లో లేకపోతే ఇంటి పెద్ద దిక్కుకు అన్నం పెట్టలేని కోడలివి. ఆస్తి విషయం వచ్చేసరికి హక్కుల గురించి మాట్లాడుతున్నావా. నోర్ మూసుకో అని అపర్ణ అంటుంది. తర్వాత ప్రకాశం వారిస్తాడు. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. మీ పుట్టిల్లు ఏది. మీరు ఎప్పుడు వెళ్లలేదే. అంత గతిలేని వాళ్ల మీ పుట్టింటివాళ్లు అని స్వప్న పంచ్ వేస్తుంది.

ఆస్తి పంచిస్తానన్న సుభాష్

నీ హద్దుల్లో ఉండు అని ధాన్యలక్ష్మీ అంటుంది. స్వప్న అన్నదాంట్లో తప్పేముంది. ఏనాడైనా నా తమ్ముడిని పండక్కి పిలిచారా. నా కోడలి పుట్టింటి గురించి అనే హక్కు నీకు ఎక్కడిదమ్మా అని సుభాష్ అంటాడు. ఇలానే ఆస్తి విషయం దాటేయాలని చూస్తున్నారా అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో ఒక్కసారిగా ఆపండి అని ఇందిరాదేవి అరుస్తుంది. అసలేం జరుగుతుంది ఇంట్లో అని మండిపడుతుంది ఇందిరాదేవి.

మరుసటి రోజు ఇంట్లో మీ అందరికి హక్కు ఉన్నట్లే నాకు ఉంది. నా వాటా నాకు పంచండి అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఆస్తి పంచాల్సిందే. ఎవరి వాటా వారికి ఇవ్వాల్సిందే అని రుద్రాణి అంటుంది. మా నాన్న ఇలా ఉంటే ఆస్తుల కోసం కొట్టుకు చచ్చే మీలాంటి వాళ్లతో కలిసి ఉండటం కంటే దరిద్రాన్ని వదిలించుకోవడమే మంచిది. రేపే లాయర్‌ని పిలిచి మొత్తం ఆస్తి వాటాలు పంచిస్తాను అని తెగేసి చెబుతాడు సుభాష్. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner