Ram Charan: రామ్ చరణ్‌ లోపల తెలియని శక్తి ఉంది.. గేమ్ చేంజర్‌కు హీరోగా తీసుకోవడంపై డైరెక్టర్ శంకర్ కామెంట్స్-director shankar reveals why he chose ram charan for game changer and praises global star says dil raju felt perfect ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan: రామ్ చరణ్‌ లోపల తెలియని శక్తి ఉంది.. గేమ్ చేంజర్‌కు హీరోగా తీసుకోవడంపై డైరెక్టర్ శంకర్ కామెంట్స్

Ram Charan: రామ్ చరణ్‌ లోపల తెలియని శక్తి ఉంది.. గేమ్ చేంజర్‌కు హీరోగా తీసుకోవడంపై డైరెక్టర్ శంకర్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Dec 20, 2024 08:56 AM IST

Director Shankar About Ram Charan Over Game Changer: రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. కోలీవుడ్ అగ్ర దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన సినిమాలో రామ్ చరణ్‌ను హీరోగా సెలెక్ట్ చేసుకోడానికి గల కారణాలను డైరెక్టర్ శంకర్ వివరించారు.

రామ్ చరణ్‌ లోపల తెలియని శక్తి ఉంది.. గేమ్ చేంజర్‌కు హీరోగా తీసుకోవడంపై డైరెక్టర్ శంకర్ కామెంట్స్
రామ్ చరణ్‌ లోపల తెలియని శక్తి ఉంది.. గేమ్ చేంజర్‌కు హీరోగా తీసుకోవడంపై డైరెక్టర్ శంకర్ కామెంట్స్

Director Shankar On Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ ఎస్.శంకర్ దర్శకత్వం వహించారు. రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్‌లో సినిమా అనగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే సినిమాలో నటీనటులు, మేకింగ్ ఉన్నట్లు తెలుస్తోంది.

బడ్జెట్‌లో నో కాంప్రమైజ్

గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ బడ్జెట్‌లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా గేమ్ చేంజర్ సినిమాను నిర్మించారు.

వచ్చే ఏడాది అంటే సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10న తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా గేమ్ చేంజర్ మూవీ గ్రాండ్ రిలీజ్ అవుతోంది. దీంతో గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఇదివరకే గేమ్ చేంజర్ సాంగ్స్ రిలీజ్ చేయగా మంచి హైప్ క్రియేట్ అయింది.

రామ్ చరణ్‌ను తీసుకోడానికి కారణం

గేమ్ చేంజర్ ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు శంకర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రానికి, ఆ పాత్రకు రామ్ చరణ్‌ను ఎంపిక చేసుకోవడానికి గల కారణాలను, సినీ విశేషాలను శంకర్ వివరించారు.

డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ.. "RRR రిలీజ్‌కి ముందే ఈ సినిమా చేయాలని రామ్ చరణ్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో రామ్ చరణ్ నటిస్తే బాగుంటుందని దిల్ రాజు భావించారు. నాకు కూడా అదే పర్‌ఫెక్ట్ ఛాయిస్ అనిపించింది. నా కథల్లో యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది. కాబట్టి ఓ పెద్ద హీరో అయితే బాగుంటుందని అనుకుని రామ్ చరణ్‌తో ప్రయాణం ప్రారంభించాం" అని అన్నారు.

"రామ్ చరణ్‌ని చూస్తే.. లోలోపల ఏదో తెలియని శక్తిని కంట్రోల్ చేసి పెట్టుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. సమయం, సందర్భంగా వచ్చినప్పుడు ఆ శక్తి విస్పోటనం చెందుతుందా? అన్నట్టుగా ఉంటుంది. డీప్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగల గొప్ప ఆర్టిస్ట్. మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న రామ్ చరణ్ ఎలాంటి సీన్ అయినా అద్భుతంగా, అందంగా హ్యాండిల్ చేస్తారు" అని డైరెక్టర్ శంకర్ తెలిపారు.

డిఫరెంట్ లుక్స్‌లో చెర్రీ

ఇదిలా ఉంటే, గేమ్ చేంజర్‌లో అవినీతి రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసే ఐఏఎస్ అధికారిగా రామ్ చరణ్ కనిపించనున్నారు. టీజర్‌లో రకరకాల గెటప్స్, డిఫరెంట్ లుక్స్‌లో ఉన్న రామ్ చరణ్‌ను చూపించారు. రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో సినిమా అద్భుతంగా ఉండబోతోందని అర్థం అవుతోంది.

రామ్ చరణ్‌తో పాటు గేమ్ ఛేంజర్‌లో కియారా అద్వానీ, ఎస్‌‌జె సూర్య, సముద్రఖని, హీరోయిన్ అంజలి, నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీలోని "జరగండి", "రా మచ్చా", "జానా హైరాన్ సా" పాటలు చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. నాలుగో పాట అయిన డోప్ డిసెంబర్ 22న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన డోప్ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది.

బాక్సాఫీస్ హిట్

గేమ్ చేంజర్ సినిమాకు థమన్ సంగీతం అందించగా.. తిరునావుక్కరసు సినిమాటోగ్రఫీ అందించారు. వీటికి తోడు శంకర్ మేకింగ్‌తో గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Whats_app_banner