Game Changer: గేమ్ చేంజర్ సాంగ్ లీక్ చేసిన ఇద్దరు అరెస్ట్.. జరగండి పాట రిలీజ్ ఎప్పుడంటే?-ram charan game changer song leak and cyber police arrested two ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ram Charan Game Changer Song Leak And Cyber Police Arrested Two

Game Changer: గేమ్ చేంజర్ సాంగ్ లీక్ చేసిన ఇద్దరు అరెస్ట్.. జరగండి పాట రిలీజ్ ఎప్పుడంటే?

Sanjiv Kumar HT Telugu
Nov 09, 2023 08:42 AM IST

Game Changer Song Leak Culprits Arrested: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటించిన సినిమా గేమ్ చేంజర్. ఇటీవల ఈ సినిమా నుంచి సాంగ్ లీక్ అయిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆ సాంగ్ లీక్ చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

గేమ్ చేంజర్ సాంగ్ లీక్ చేసిన ఇద్దరు అరెస్ట్.. జరగండి పాట రిలీజ్ ఎప్పుడంటే?
గేమ్ చేంజర్ సాంగ్ లీక్ చేసిన ఇద్దరు అరెస్ట్.. జరగండి పాట రిలీజ్ ఎప్పుడంటే?

గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజ‌ర్‌’. ఎన్నో సూప‌ర్ డూప‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను రూపొందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ఈ మూవీని నిర్మిస్తోంది. భారీ బ‌డ్జెట్‌తో నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్ అన్ కాంప్ర‌మైజ్డ్‌గా అంచ‌నాల‌కు ధీటుగా గేమ్ చేంజ‌ర్‌ను నిర్మిస్తున్నారు. RRR వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ చేస్తోన్న సినిమా కావ‌టంతో గేమ్ ఛేంజ‌ర్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

గేమ్ చేంజర్ సినిమా నుంచి గతంలో జరగండి అనే పాట లీక్ అయింది. దీనిపై నిర్మాత దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సాంగ్ లీక్‌పై సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ లీకులో భాగమైన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి లీకులు చేయొద్దని హెచ్చరించారు. సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీ చాంద్ భాషా, ఎస్సై శ్రీ భాస్కర్ రెడ్డి, శ్రీ ప్రసేన్ రెడ్డి, శ్రీ సాయి తేజ్ గార్ల బృందం ఈ కేసును చేధించారు. సాంగ్‌ లీక్ చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి మీద ఐటీ చట్టంలోని సెక్షన్ 66సీ, 66 ఆర్/డబ్ల్యూ కింద కేసు నమోదు చేశారు.

ఇక దీపావ‌ళి సంద‌ర్బంగా ‘గేమ్ ఛేంజ‌ర్’ సినిమా నుంచి తొలి సాంగ్‌ను విడుద‌ల చేస్తున్నారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌ల‌తో పాటు మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్ఎస్ థమన్ క‌లిసి తొలిసారి వ‌ర్క్ చేస్తున్న గేమ్ ఛేంజ‌ర్ సినిమా నుంచి పాట‌ను పాన్ ఇండియా రేంజ్‌లో దీపావళికి గ్రాండ్ లెవ‌ల్‌లో రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని చిత్ర యూనిట్ తెలిపింది.

సౌత్ ఇండియ‌న్ సినిమా రేంజ్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లిన సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ మేకింగ్ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న తెర‌కెక్కించిన సినిమాల‌ను మించేలా ‘గేమ్ ఛేంజ‌ర్‌’ను ఆయ‌న రూపొందిస్తున్నారు. పవరఫుల్ రోల్ లో చ‌ర‌ణ్‌ను ప్రెజెంట్ చేస్తున్నారు శంక‌ర్‌. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతోందన్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా చేస్తున్నారు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.