తెలుగు న్యూస్ / ఫోటో /
Shankar Daughter Marriage: గ్రాండ్‍గా డైరెక్టర్ శంకర్ కూతురు వివాహం.. హాజరైన స్టార్ హీరోలు: ఫొటోలు
- Shankar Daughter Marriage: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య వివాహం ఘనంగా జరిగింది. శంకర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ అయిన తరుణ్ కార్తీకేయన్‍ను ఆమె పెళ్లాడారు. ఈ వివాహ వేడుకకు కోలీవుడ్ స్టార్ హీరోలు హాజరయ్యారు. ఆ ఫొటోలు ఇవే.

(1 / 5)
స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య - తరుణ్ కార్తికేయన్ వివాహం నేడు (ఏప్రిల్ 15) చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు.
(2 / 5)
తమిళ సీనియర్ స్టార్ హీరో, లోకనాయకుడు కమల్ హాసన్ ఈ వివాహానికి హాజరయ్యారు. శంకర్ - కమల్ హాసన్ కాంబినేషన్‍లో రూపొందిన ఇండియన్ 2 చిత్రం ఈ ఏడాది జూన్‍లో రిలీజ్ కానుంది.
(3 / 5)
ఐశ్వర్య వివాహానికి తమిళ స్టార్ హీరోలు, అన్నదమ్ములు సూర్య, కార్తీ వచ్చారు. సంప్రదాయబద్ధంగా పంచె కట్టులో వారు ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు.
(4 / 5)
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కూడా శంకర్ - కార్తికేయన్ పెళ్లికి హాజరయ్యారు. అలాగే, మరికొందరు నటీనటులు, టెక్నిషియన్లు కూడా వచ్చారు.
ఇతర గ్యాలరీలు