తెలుగు న్యూస్ / ఫోటో /
AP Rains Update: ఉత్తరకోస్తా వైపు కదులుతున్న అల్పపీడనం, నేడు రేపు భారీ వర్షాలు, రైతులకు అలర్ట్..
- AP Rains Update: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కోస్తా తీరం వైపు కదులుతోంది. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తరదిశగా కదు లుతూ ఏపీ తీరం వెంబడి పయనించనుడంతో శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి,కాకినాడ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశముంది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP Rains Update: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కోస్తా తీరం వైపు కదులుతోంది. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తరదిశగా కదు లుతూ ఏపీ తీరం వెంబడి పయనించనుడంతో శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి,కాకినాడ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశముంది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 11)
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి తీరం వైపు కదులుతోంది. కోస్తా తీరం వైపు రాబోయే 24 గంటల్లో ఉత్తరదిశగా కదు లుతూ ఏపీ తీరం వెంబడి పయనించనుంది. దీని ప్రభావంతో శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. (unsplash.com)
(2 / 11)
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశముందని ఐఎండి పేర్కొంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు. ఏపీలోని పోర్టులకు మూడో నంబరు హెచ్చరికలు జారీ చేశారు. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గరిష్టంగా గంటకు 60 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
(3 / 11)
నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొ నసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారుతుందా..? లేదా.? అనేదానిపై రకరకాల అంచనాలు వెలువడుతున్నాయి. వాయుగుం డంగా బలపడితే ఈశాన్యంగా దిశ మార్చుకుని మయన్మార్ తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని ఒక మోడల్ అంచనా వేస్తోందని వాతావరణ నిపుణులు తెలిపారు. (unsplash.com)
(4 / 11)
అల్పపీడన ప్రభావంతో కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టులకు మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశాారు. సముద్రం ఆల జడిగా మారడంతో మత్స్యకారులు ఆదివారం వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
(5 / 11)
అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం, నెల్లూరు, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన తదితర జిల్లాల్లో గురువారం తేలికపాటి వర్షాలు కురిశాయి. కళింగపట్నం, ఒంగోలు, కావలి, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖపట్నం, నరసా పురం తదితర ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు 2-5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.
(6 / 11)
రాయలసీమలో ఈ సీజన్లో అక్టోబరు 1 నుంచి ఇప్పటి వరకు) రాష్ట్రంలో 289 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్రలో సాధారణ వర్షపాతం(456.8 మి.మీ కంటే తక్కువగా 331.2 మి.మీ. నమో దైంది. రాయలసీమలో సాధారణం 230 మి. మీ కంటే 43% ఎక్కువ వర్షం కురిసింది. ఈ నెలాఖరు వరకు దక్షిణ భారతంలో సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని ఐఎండీ పేర్కొంది.
(7 / 11)
తీవ్ర అల్పపీడ నం గురువారం నాటికి నైరుతి, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖా తంలో కొనసాగుతోంది. శుక్రవారం ఉదయానికి అది వాయవ్యంగా పయనించి ఉత్తర తమిళనాడు, దక్షిణాంధ్ర తీరం సమీపంగా రానుంది. తర్వాత 24 గంట ల్లో ఉత్తరంగా కోస్తాంధ్ర తీరానికి ఆనుకుని పయనిస్తుందని భారత వాతావర ణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
(8 / 11)
గురువారం కోస్తాలోని అనేక ప్రాంతాల్లో మేఘాలు ఆవరించగా, ఉత్తర కోస్తాలో పలుచోట్ల ఒక మోస్తరు వ రాలు కురిశాయి. శుక్రవారం కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు పడతాయని.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కా కినాడ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హె చ్చరిక కేంద్రం తెలిపింది.
(9 / 11)
అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ కూడా పేర్కొంది. కాగా, తీవ్ర అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబ డి గంటకు 35 నుంచి 45, అప్పుడప్పుడూ 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తు న్నందున ఈ నెల 21, 22వ తేదీల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది.
(10 / 11)
తీవ్ర అల్పపీడనం నెమ్మదిగా పయనించే క్రమంలో బలహీన పడినా దాని ప్రభావంతో ఈ నెల 23, 24వ తేదీల్లో ఉత్తర కోస్తాలో భారీవ రాలు కురిసే అవకాశం ఉందని మరో మోడల్ చెబుతుందన్నారు. దీనిపై శు క్రవారం మరింత స్పష్టత వస్తుందని చెబుతున్నారు.
ఇతర గ్యాలరీలు