Varanasi: వారణాసిని మృత్యు నగరం అని ఎందుకు అంటారు? వారణాసి గురించి తప్పక ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి
Varanasi: కాశీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. కాశీని శివుని యొక్క నగరం అని అంటారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నారు. అయితే, ఎందుకు వారణాసిని మృత్యు నగరం (సిటీ ఆఫ్ డెత్) అని అంటారు..? దాని వెనుక కారణం ఏంటి..?
మన భారతదేశంలో ఉన్న అతి ప్రాచీన నగరాల్లో కాశీ ఒకటి. ఇక్కడ గంగా నదిలో స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయని, పునర్జన్మ నుంచి విముక్తులు అవుతారని హిందువులు నమ్ముతారు. వరుణ, అస్సి అనే రెండు నదులు ఈ నగరంలో గంగా నదిలో కలుస్తాయి. అందుకని వారణాసి అనే పేరు వచ్చింది. కేవలం హిందువులకే కాదు. ఈ క్షేత్రం బౌద్ధులకు, జైనులకు కూడా పుణ్యక్షేత్రమే.
ఇక్కడ విశ్వేశ్వర ఆలయంతో పాటుగా అన్నపూర్ణాలయం, విశాలాక్షి ఆలయం, వారాహిమాత ఆలయం కూడా ఉన్నాయి. అలాగే తులసి మానస మందిరం, దుర్గామాత ఆలయం, కాలభైరవ ఆలయం, సంకట మోచనాలయం కూడా ఉన్నాయి. సుమారు 5000 ఏళ్ళ క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథలు చెప్తున్నాయి, హిందువుల ఏడు పవిత్ర నగరాల్లో ఇది ఒక నగరం. స్వయంగా కాశీలో శివుడు కొలువై ఉన్నారు. అష్టాదశ శక్తి పీఠాల్లో కాశి ఒకటి.
శివుని నగరం కాశీ
కాశీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. కాశీని శివుని యొక్క నగరం అని అంటారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నారు. చాలామంది నిత్యం కాశీ వెళ్తూ ఉంటారు. దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది కాశీ వెళ్లి పరమేశ్వరుడుని దర్శించుకుంటారు. అయితే, ఎందుకు వారణాసిని మృత్యు నగరం (సిటీ ఆఫ్ డెత్) అని అంటారు..? దాని వెనుక కారణం ఏంటి..? అనే వాటి గురించి చూద్దాం.
కాశీని మృత్యు నగరం అని ఎందుకు అంటారు?
కాశీకి ఎంతో విశిష్టత ఉంది. వేదాల్లో, పురాణాల్లో, రామాయణ, మహాభారతంలో కూడా వర్ణించడం జరిగింది. పైగా కాశీని మోక్షాన్ని ఇచ్చే నగరం అని కూడా అంటారు. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చనిపోతారు. జీవితంలో పుట్టుక, చావు రెండు కూడా పెద్ద నిజాలు. ఎవరైనా చనిపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎంతో బాధపడతారు. కానీ కాశీలో చనిపోతే సంతోషపడతారు. కాశీలోని ముముక్ష భవన్ లో దాదాపు 80 నుంచి 100 మంది ఉంటున్నారు. చనిపోవడం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ముమోక్ష భవనం 1920ల నుంచి వారణాసిలో ఉంది. శివుడు కొలువై ఉన్న వారణాసిలో ఎవరు చనిపోయిన లేదా ఎవరి అంతిమ సంస్కారాలు ఇక్కడ జరిపినా వారు జనన, మరణ చక్రం నుంచి విముక్తిని పొందుతారు.
అలాగే మోక్షాన్ని పొందుతారు అని మత విశ్వాసం. అందుకనే కాశీని మృత్యు నగరం అని పిలవడం జరుగుతుంది. వారణాసిలో దాదాపు 84 ఘాట్లు ఉన్నాయి. ఇక్కడ దహన సంస్కారాలను జరుపుతారు. శివుడు వినాసానికి దేవుడని, స్మశాన వాటికలో ఉంటారని చెప్తారు. శివుని కృపతో ఒకరు మరణాన్ని పొందుతే మోక్షాన్ని పొందవచ్చు. కనుక కాశీలో అంత్యక్రియలు చేయడం చాలా ముఖ్యం. ఇలా కాశీకి ఇంత విశిష్టత ఉంది కాబట్టే చాలా మంది కాశీలో చనిపోవాలని కోరుకుంటారు. అక్కడ చనిపోతే మోక్షాన్ని పొందవచ్చని.. ఏళ్ల తరబడి కాశీలో ఉంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.