Varanasi Special Trains: విశాఖ నుంచి వారణాసికి ప్రత్యేక రైళ్లు
Varanasi Special Trains: గంగా పుష్కరాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వారణాసి వెళ్లే యాత్రికుల కోసం వేసవిలో ప్రత్యేక రైళలను ఏర్పాటు చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులు ప్రకటించారు.
Varanasi Special Trains: గంగా పుష్కరాల సందర్భంగా, వేసవిలోవిశాఖపట్నం-వారణాసి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే బోర్డు బుధవారం ప్రకటించింది.
రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చొరవ, విజ్ఞప్తితో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జోక్యంతో విశాఖపట్నం-వారణాసి మధ్య గంగా పుష్కరాల కోసం వేసవి కాలంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే బోర్డు గురువారం ప్రకటించింది.
శ్రీ కాశీ తెలుగు సమితి గంగా పుష్కరాల నిర్వహణ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నజీవీఎల్ పుష్కరాలకు ప్రత్యేక రైలు కోసం ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి కార్యాలయం, వారణాసి జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ తగిన ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికుల సౌకర్యార్ధం ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
విశాఖపట్నం నుంచి వారణాసి వెళ్లేందుకు ప్రత్యేక రైళ్ల షెడ్యూల్‌ను రైల్వే శాఖ ప్రకటించింది. "విశాఖపట్నం నుండి వారణాసికి గంగా పుష్కరాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 19 , ఏప్రిల్ 26 న బయలుదేరుతాయి. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 20, ఏప్రిల్ 27న తిరిగి వస్తాయి.
విశాఖపట్నం నుండి వారణాసికి వెళ్లడానికి తిరుగు ప్రయాణంలో ప్రత్యేక రైళ్లు కూడా మేలో కూడా 5 రోజులు నడుస్తాయనిప్రకటించారు. వేసవిలో రద్దీ దృష్ట్యా జూన్‌లో విశాఖపట్నం నుండి వారణాసికి 11 జతల ప్రత్యేక రైళ్లను రెండు వైపులా నడపనున్నారు.
విశాఖపట్నం రైల్వే డివిజన్ నుంచి వేసవి కోసం ప్రత్యేక రైళ్లను ప్రతిపాదించారు. విశాఖపట్నం నుండి వారణాసికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని పట్టుబట్టడంతో ఈ ప్రత్యేక రైళ్లను మంజూరు చేసినట్లు రైల్వే వర్గాలు ప్రకటించాయి.
"పెద్ద సంఖ్యలో యాత్రికులు వారణాసికి సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా విజయవాడ మరియు తిరుపతి నుండి వారణాసికి ప్రత్యేక రైళ్లను మంజూరు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎంపీ జీవీఎల్ రావు తెలిపారు.