Annapurna: అన్నపూర్ణ మాతకు కాశీ విశ్వానాధుడికి ఉన్న అనుబంధం ఏమిటి?
Annapurna: ఈసారి అన్నపూర్ణ జయంతి డిసెంబర్ 15న వచ్చింది. ప్రతి ఏటా మార్గశిర మాసం పౌర్ణమి నాడు అన్నపూర్ణ జయంతి జరుపుకుంటాము. డిసెంబర్ 14 సాయంత్రం 4:58 గంటలకి పౌర్ణమి తిధి మొదలవుతుంది. డిసెంబర్ 15వ తేదీన 2:31 గంటలకు ముగుస్తుంది. అన్నపూర్ణ దేవికి, కాశీ విశ్వేశ్వరుడికి మధ్య సంబంధం ఏంటో తెలుసుకుందాం.
ప్రతీ రోజూ కూడా మనం పరమేశ్వరుడిని ఆరాధిస్తూ ఉంటాము. ప్రత్యేకించి సోమవారం నాడు పరమేశ్వరుడిని ఆరాధిస్తూ ఉంటాము. శివుని ఆరాధించడం వలన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. అలాగే మనం అన్నపూర్ణను కూడా ఆరాధిస్తూ ఉంటాము.
ఈసారి అన్నపూర్ణ జయంతి డిసెంబర్ 15న వచ్చింది. ప్రతి ఏటా మార్గశిర మాసం పౌర్ణమి నాడు అన్నపూర్ణ జయంతి జరుపుకుంటాము. డిసెంబర్ 14 సాయంత్రం 4:58 గంటలకి పౌర్ణమి తిధి మొదలవుతుంది. డిసెంబర్ 15వ తేదీన 2:31 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిధి ప్రకారంగా చూసుకోవాలి. కాబట్టి, డిసెంబర్ 15న అన్నపూర్ణ జయంతిని జరుపుకోవాలి. అన్నపూర్ణ జయంతి నాడు చేసే పూజలకి, ధానాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
అన్నపూర్ణ జయంతి నాడు ఏం చేస్తే మంచిది?
ప్రతి ఏటా మార్గశిర మాసం పౌర్ణమి నాడు అన్నపూర్ణ జయంతి జరుపుకుంటాము. అన్నపూర్ణ జయంతి నాడు ఆహారం, బట్టలు దానం చేస్తే మంచి జరుగుతుంది. ఇలా చేయడం వలన ఆహారం, డబ్బుకి లోటు ఉండదు.
అన్నపూర్ణ దేవికి, కాశీ విశ్వేశ్వరుడికి మధ్య సంబంధం ఏంటి?
అన్నపూర్ణ దేవి పార్వతి దేవి యొక్క రూపమే. ఆమెను అన్నదా అని కూడా పిలుస్తారు. ప్రజల ఆకలి తీర్చాలని పార్వతి దేవి అన్నపూర్ణాదేవిగా మారారు. కాశీని శివుని ప్రాంతం అని అంటారు. శివుడు అక్కడ ప్రతీ చోట ఉంటారని భక్తుల నమ్మకం. కాశీలో అన్నపూర్ణ దేవి ఆలయం కూడా ఉంది. కేవలం ఈ యొక్క ఆలయం మాత్రమే శ్రీయంత్రం ఆకారంలో నిర్మించబడింది. మన భారత దేశంలో చాలా చోట్ల అన్నపూర్ణ దేవి ఆలయాలు ఉన్నాయి. కానీ కాశీలో ఉన్న ఆలయం ప్రత్యేకమైనది.
పార్వతీ దేవి కాశీలో అన్నపూర్ణ దేవిగా ఉండాలన్న కోరికను పరమేశ్వరుడికి చెప్పగా, పరమేశ్వరుడు ఆమెను కాశీకి తీసుకువచ్చారు. కాశీ విశ్వేశ్వరుడి ఆలయానికి సమీపంలో అన్నపూర్ణ దేవి ఆలయం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. కాశీ విశ్వేశ్వర దేవాలయం దర్శించుకున్న తర్వాత అన్నపూర్ణ దేవి ఆలయానికి కూడా వెళ్తారు. అన్నపూర్ణ జయంతి నాడైతే కాశీలో ఉన్న ఈ ఆలయానికి చాలా ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు. అన్నపూర్ణ దేవి అనుగ్రహం ఉంటే ఆహారం, డబ్బుకి లోటు ఉండదు. అలాగే సంతోషంగా ఉండొచ్చు.
సంబంధిత కథనం