Hebah Patel Sandeham OTT Release: క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఊహించని ట్విస్టులు, గ్రిప్పింగ్ సీన్స్, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కిస్తే మంచి ఆదరణ పొందుతాయి. ఇక క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెలుగు సినిమాలు రావడం చాలా తక్కువగా ఉంటాయి. అయితే, చిన్న బడ్జెట్‌తో రూపొందించే సినిమాలను దాదాపుగా ఇలాంటి జోనర్స్‌లోనే తెరెకెక్కిస్తున్నారు.
ఇక క్రైమ్ థ్రిల్లర్స్‌కు కాస్తా రొమాన్స్ ఎలిమెంట్స్ యాడ్ చేసి యూత్‌కి కనెక్ట్ అయి మంచి ఆదరణ పొందుతాయి. అయితే, ఇలా రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన తెలుగు సినిమానే సందేహం. ఈ సినిమాలో కుమారి 21 ఎఫ్ ఫేమ్ హెబ్బా పటేల్ మెయిన్ లీడ్ రోల్ చేసింది. అలాగే, మరో ప్రధాన పాత్రలో సుమన్ వూట్కూరు నటించాడు.
అలాగే, సందేహం సినిమాలో బిగ్ బాస్‌తో పాపులారిటీ తెచ్చుకున్న శ్వేతా వర్మ, శుభ శ్రీ రాయగురు, రాశిక శెట్టి, శ్రీనివాస్ భోగిరెడ్డి, సుందర్ రావు పర్చా, చంద్రశేఖర్ ఇతరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఊరికి ఉత్తరాన సినిమా ఫేమ్ సతీష్ పరమవేద ఈ సందేహం చిత్రానికి దర్శకత్వం వహించారు. విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్‌పై సత్యనారాయణ పర్చా నిర్మాతగా లవ్ అండ్ ఎంగేజ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు.
రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన సందేహం ట్రైలర్ జూన్ 18న రిలీజ్ కాగా థియేటర్లలో జూన్ 22న విడుదలైంది. థియేటర్లలో సందేహం చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా ఐఎమ్‌డీబీ నుంచి ప్రస్తుతం 8.6 రేటింగ్ సాధించుకుంది. అలాగే, సందేహం సినిమాకు పాజిటివ్‌గానే రివ్యూస్ వచ్చాయి. ఇలా థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సందేహం ఓటీటీలో కూడా రాణిస్తోంది.
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో సందేహం డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. నవంబర్ 28న ఈటీవీ విన్‌లో సందేహం ఓటీటీ రిలీజ్ అయింది. విడుదలైనప్పటి నుంచే సందేహం సినిమా ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం ఈటీవీ విన్‌లో సందేహం ఓటీటీ ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమాలో హెబ్బా పటేల్ నటనకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు.
ఈ వారం ఓటీటీ రిలీజ్ అయిన చిత్రాల్లోకెల్లా సందేహం అందరినీ ఆకట్టుకుని ఓటీటీలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇందులో నటించిన అన్ని పాత్రలకు తగిన ప్రాధాన్యం ఉండటం విశేషం. ఈ మూవీకి ప్రవీణ్ వనమాలి సినిమాటోగ్రఫీ, వెంకట ప్రభు ఎడిటింగ్ మేజర్ అట్రాక్షన్‌గా నిలిచాయి. సుభాష్ ఆనంద్ సంగీతం ఆడియెన్స్‌ను మెప్పించిందని టాక్ వినిపిస్తోంది.
సందేహం కథ విషయానికొస్తే శ్రుతి, హర్ష ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. కానీ, భర్తను శారీరక సంబంధానికి దూరం పెడుతూ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ ఆర్యతో సన్నిహితంగా ఉంటుంది శ్రుతి. ఈ క్రమంలోనే శ్రుతిపై హర్షకు అనుమానం వస్తుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తను లేకుంటే తన భార్య ఏం చేస్తుందోనని తెలుసుకునేందుకు హర్ష బెంగళూరు వెళ్తాడు. అప్పుడే కొవిడ్ 19 కారణంగా లాక్‌డౌన్ ప్రకటిస్తారు.
అప్పుడు సడెన్‌గా హర్ష కరోనా బారిన పడి చనిపోయినట్ల తెలుస్తుంది. అసలు హర్ష ఎలా చనిపోయాడు, బాయ్‌ఫ్రెండ్ కోసం శ్రుతినే భర్తను చంపేసిందా ఆర్య ఎవరు అతనితో శ్రుతి ఎందుకు సన్నిహితంగా ఉంది హర్షను శారీరకంగా ఎందుకు దూరం పెట్టింది వంటి ట్విస్టులతో సినిమా సాగుతుంది. క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్‌తో ఆకట్టుకుంటుంది సందేహం సినిమా.