OTT Movies: ఓటీటీలో 25 సినిమాలు- ఏకంగా 15 స్పెషల్- ఇవాళ ఒక్కరోజే 3- 2 హారర్ చిత్రాలు, క్రైమ్, కామెడీ స్పై థ్రిల్లర్స్!-ott movies release this week on netflix amazon prime zee5 jiocinema hotstar aay ott release two horror films special ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies: ఓటీటీలో 25 సినిమాలు- ఏకంగా 15 స్పెషల్- ఇవాళ ఒక్కరోజే 3- 2 హారర్ చిత్రాలు, క్రైమ్, కామెడీ స్పై థ్రిల్లర్స్!

OTT Movies: ఓటీటీలో 25 సినిమాలు- ఏకంగా 15 స్పెషల్- ఇవాళ ఒక్కరోజే 3- 2 హారర్ చిత్రాలు, క్రైమ్, కామెడీ స్పై థ్రిల్లర్స్!

Sanjiv Kumar HT Telugu
Sep 10, 2024 12:33 PM IST

OTT Movies Releases This Week: ఈ వారం ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీసులు అన్ని కలిపి మొత్తంగా 25 వరకు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో ఏకంగా 15 వరకు చాలా స్పెషల్‌గా ఉండనున్నాయి. అందులోనూ రెండు హారర్ సినిమాలతోపాటు క్రైమ్, కామెడీ, పొలిటికల్, స్పై థ్రిల్లర్ మూవీస్‌, ఇంట్రెస్టింగ్ కానున్నాయి.

ఓటీటీలో 25 సినిమాలు- ఏకంగా 15 స్పెషల్- ఇవాళ ఒక్కరోజే 3- 2 హారర్ చిత్రాలు, క్రైమ్, కామెడీ స్పై థ్రిల్లర్స్!
ఓటీటీలో 25 సినిమాలు- ఏకంగా 15 స్పెషల్- ఇవాళ ఒక్కరోజే 3- 2 హారర్ చిత్రాలు, క్రైమ్, కామెడీ స్పై థ్రిల్లర్స్!

This Week OTT Movies: ఎప్పటిలాగే మరో కొత్త వారం రానే వచ్చింది. అయితే, ఈ వారం థియేటర్లలో మత్తు వదలరా 2 వంటి క్రేజీ సినిమా ఉంది. ఇక ఇక ఓటీటీల్లో అయితే, ఈ వారం (సెప్టెంబర్ 9 నుంచి 15) సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తంగా 25 వరకు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఆయ్ (తెలుగు సినిమా)- సెప్టెంబర్ 12

మిస్టర్ బచ్చన్ (తెలుగు మూవీ)- సెప్టెంబర్ 12

బ్రేకింగ్ డౌన్ ది వాల్ (డాక్యుమెంటరీ)- సెప్టెంబర్ 12

ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 4 పార్ట్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12

మిడ్‌నైట్ ఎట్ ది పెరా ప్యాలెస్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12

సెక్టార్ 36 (హిందీ చిత్రం)- సెప్టెంబర్ 13

అగ్లీస్ (హాలీవుడ్ సినిమా)- సెప్టెంబర్ 13

ఆఫీసర్ బ్లాక్ బెల్ట్ (కొరియన్ చిత్రం)- సెప్టెంబర్ 13

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

గోలి సోడా రైజింగ్ (తెలుగు డబ్బింగ్ తమిళ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 13

హౌ టు డై ఎలోన్- సెప్టెంబర్ 13

ఇన్ వోగ్ ది 90స్ (డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబర్ 13

లెగో స్టార్ వార్స్: రీబిల్డ్ ది గెలాక్సీ (ఇంగ్లీష్ చిత్రం)- సెప్టెంబర్ 13

జీ5 ఓటీటీ

రఘుతాత (తమిళ పొలిటికల్ కామెడీ డ్రామా సినిమా)- సెప్టెంబర్ 13

బెర్లిన్ (హిందీ చిత్రం)- సెప్టెంబర్ 13

నునాకుజి (మలయాళ సినిమా)- సెప్టెంబర్ 13

సోనీ లివ్ ఓటీటీ

తలవన్ (తెలుగు డబ్బింగ్ మలయాళ చిత్రం)- సెప్టెంబర్ 10

బెంచ్ లైఫ్ (తెలుగు వెబ్ సిరీస్)-సెప్టెంబర్ 12

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

విశేషం (మలయాళ కామెడీ మూవీ)- సెప్టెంబర్ 10

ది మనీ గేమ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబర్ 10

రూపాంతర (కన్నడ అంథాలజీ మూవీ)- సెప్టెంబర్ 13 (రూమర్ డేట్)

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

లేట్ నైట్ విత్ ది డెవిల్ (ఇంగ్లీష్ హారర్ సినిమా)- సెప్టెంబర్ 13

ది రెంటల్ (ఇంగ్లీష్ హారర్ మిస్టరీ మూవీ)- సెప్టెంబర్ 13

కమిటీ కుర్రోళ్లు (తెలుగు చిత్రం)-ఈటీవీ విన్‌ ఓటీటీ- సెప్టెంబర్ 12

కల్‌బరి రికార్డ్స్ (హిందీ చిత్రం)- జియో సినిమా ఓటీటీ- సెప్టెంబర్ 12

నంబన్ ఒరువన్ వంత పిరగు (తమిళ కామెడీ మూవీ)- ఆహా తమిళ్ ఓటీటీ- సెప్టెంబర్ 13

మొత్తం 25 ఓటీటీ రిలీజ్

ఇలా ఈ వారం సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తంగా 25 ఓటీటీ రిలీజ్ కానున్నాయి. వాటిలో తెలుగు సినిమాలు ఆయ్, మిస్టర్ బచ్చన్, కమిటీ కుర్రోళ్లుతోపాటు తెలుగు వెబ్ సిరీస్ బెంచ్ లైఫ్ స్పెషల్ కానున్నాయి. అలాగే, కీర్తి సురేష్ తమిళ చిత్రం రఘుతాత, తమిళ వెబ్ సిరీస్ గోలి సోడా రైజింగ్, క్రైమ్ థ్రిల్లర్ మూవీ సెక్టార్ 36, స్పై థ్రిల్లర్ బెర్లిన్, మలయాళ మర్డర్ మిస్టరీ తలవన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు కానున్నాయి.

15 స్పెషల్

ఇక ఈ వారం లేట్ నైట్ విత్ ది డెవిల్, ది రెంటల్ వంటి రెండు హారర్ సినిమాలు, కన్నడ అంథాలజీ సినిమా రూపాంతర, తమిళ కామెడీ చిత్రం నంబన్ ఒరువన్ వంత పిరగు, మలయాళ సినిమా విశేషం, హాలీవుడ్ చిత్రం లెగో స్టార్ వార్స్: రీబిల్డ్ ది గెలాక్సీ కూడా స్పెషల్ అవనున్నాయి. ఇలా 13 సినిమాలు, రెండు వెబ్ సిరీసులతో మొత్తం 15 చాలా స్పెషల్ కానున్నాయి. వీటిలో ఇవాళ ఒక్కరోజే 3 ఓటీటీ రిలీజ్ అయ్యాయి.