New National Crush: నేషనల్ న్యూ క్రష్ మీరని అంటున్నారు.. మిస్టర్ బచ్చన్ హీరోయిన్ సమాధానం ఇదే!-mr bachchan heroine bhagyashri borse reacts to calling her new national crush bhagyashri borse about ravi teja ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  New National Crush: నేషనల్ న్యూ క్రష్ మీరని అంటున్నారు.. మిస్టర్ బచ్చన్ హీరోయిన్ సమాధానం ఇదే!

New National Crush: నేషనల్ న్యూ క్రష్ మీరని అంటున్నారు.. మిస్టర్ బచ్చన్ హీరోయిన్ సమాధానం ఇదే!

Sanjiv Kumar HT Telugu
Aug 10, 2024 06:44 AM IST

Bhagyashri Borse About New National Crush: రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ మూవీలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే చేసింది. ఈ సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది భాగ్యశ్రీ బోర్సే. ఇందులో తాను కొత్త నేషనల్ క్రష్ అనే కామెంట్‌పై రియాక్ట్ అయింది.

నేషనల్ న్యూ క్రష్ మీరని అంటున్నారు.. మిస్టర్ బచ్చన్ హీరోయిన్ సమాధానం ఇదే!
నేషనల్ న్యూ క్రష్ మీరని అంటున్నారు.. మిస్టర్ బచ్చన్ హీరోయిన్ సమాధానం ఇదే!

Mr Bachchan Heroine About New National Crush: మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ చిత్రం మిస్టర్ బచ్చన్. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోన్న ఈ సినిమాను ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అత్యద్భుతమైన గ్రాండియర్‌తో నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు.

మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మీడియా ఇంటర్వ్యూ సమావేశంలో సినిమా, ఇతర ఇంట్రెస్టింగ్ విశేషాలను పంచుకున్నారు.

మీకు సినిమాలపై ఇంట్రస్ట్ ఎప్పుడు ఏర్పడింది? మిస్టర్ బచ్చన్ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చారు?

-మాది ఔరంగాబాద్, మహారాష్ట్ర. మా నాన్నగారు ఉద్యోగ రిత్యా లాగోస్ (నైజీరియా) షిఫ్ట్ అయ్యారు. అక్కడే నా స్కూలింగ్ జరిగింది. బిజినెస్ మేనేజ్‌మెంట్ కోసం ముంబై వచ్చాను. గ్రాడ్యువేషన్‌లో ఉండగా చాలా మంది మోడలింగ్ చేయమని ప్రోత్సహించారు. ఆ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత చాలా నచ్చింది. కెమరా భయం పోయింది. కొన్ని కమర్షియల్స్ చేశాను.

-మంచి అవకాశం ఎదురుచూస్తున్నప్పుడు మిస్టర్ బచ్చన్ అవకాశం వచ్చింది. హైదరాబద్‌కి వచ్చి ఆడిషన్ ఇచ్చాను. నా ఆడిషన్ మేకర్స్‌కి నచ్చింది. జిక్కీ పాత్రకు నేను పర్ఫెక్ట్ అని సెలెక్ట్ చేశారు. తర్వాత లుక్ టెస్ట్ కోసం వచ్చినపుడు రవితేజ గారిని కలిశాను.

మీ తొలి సినిమాతోనే మాస్ రవితేజ గారితో నటించారు. ఆయన ఎనర్జీ మ్యాచ్ చేయగలిగారా?

-నేను ఏదైనా చేసినప్పుడు హండ్రెడ్ పెర్సెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. హార్డ్ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. రవితేజ గారితో వర్క్ చేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. రవితేజ గారు ఛార్మింగ్ పర్సనాలిటీ.

ఇందులో మీ పాత్ర ఎలా ఉండనుంది?

-ఇందులో నా పాత్ర పేరు జిక్కీ. తను తెలుగు మార్వాడి గర్ల్. తను చాలా క్యూట్, లవబుల్. డైరెక్టర్ గారు ఈ క్యారెక్టర్‌ని చాలా బ్యూటీఫుల్‌గా తీర్చిదిద్దారు. బచ్చన్ లైఫ్‌లో జిక్కీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సినిమా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేసేలా ఉంటుంది.

ఇందులో మీ మెమరబుల్ మూమెంట్?

-ఇందులో క్యాసెట్ రికార్డింగ్ షాప్‌లో ఓ సీన్ ఉంటుంది. ఆ సీన్ చేసిన తర్వాత డైరెక్టర్ గారు.. 'ఐయాం ప్రౌడ్ అఫ్ యూ' అన్నారు. అది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్ గురించి ?

-నా మొదటి తెలుగు సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్‌లో చేయడం చాలా ఆనందంగా ఉంది. వారు చాలా స్వీట్ పీపుల్. చాలా కంఫర్ట్బుల్‌గా చూసుకున్నారు. వారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్.

మిమ్మల్ని నేషనల్ న్యూ క్రష్ అంటున్నారు?

-థాంక్ యూ. అదొక కాంప్లిమెంట్‌లా తీసుకుంటాను. (నవ్వుతూ)