Puri Jagannadh: 7 సినిమాలకు సైన్ చేశారు.. చాలా బాధపడ్డాం.. డైరెక్టర్ పూరి జగన్నాథ్ కామెంట్స్-director puri jagannadh comments on sanjay dutt in double ismart big bull song launch event ram pothineni comments ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Puri Jagannadh: 7 సినిమాలకు సైన్ చేశారు.. చాలా బాధపడ్డాం.. డైరెక్టర్ పూరి జగన్నాథ్ కామెంట్స్

Puri Jagannadh: 7 సినిమాలకు సైన్ చేశారు.. చాలా బాధపడ్డాం.. డైరెక్టర్ పూరి జగన్నాథ్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Aug 09, 2024 05:12 PM IST

Puri Jagannadh On Sanjay Dutt In Double Ismart Big Bull: డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన మరో సినిమా డబుల్ ఇస్మార్ట్. ఆగస్ట్ 8న డబుల్ ఇస్మార్ట్ మూవీ నుంచి బిగ్ బుల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బిగ్ బుల్ సాంగ్ లాంచ్‌ ఈవెంట్‌లో పూరి జగన్నాథ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

7 సినిమాలకు సైన్ చేశారు.. చాలా బాధపడ్డాం.. డైరెక్టర్ పూరి జగన్నాథ్ కామెంట్స్
7 సినిమాలకు సైన్ చేశారు.. చాలా బాధపడ్డాం.. డైరెక్టర్ పూరి జగన్నాథ్ కామెంట్స్

Puri Jagannadh Double Ismart Big Bull Launch: డ్యాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ ప్లాప్ తర్వాత తెరకెక్కించిన సినిమా డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాలో రామ్ పోతినేని హీరోగా చేశాడు. కావ్య థాపర్ హీరోయిన్‌గా చేసింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు.

ఆగస్ట్ 8 గురువారం రోజున డబుల్ ఇస్మార్ట్ సినిమాలోని బిగ్ బుల్ పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా ముంబైలో బిగ్ బుల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉస్తాద్ రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి కౌర్, హీరోయిన్ కావ్య థాపర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఉస్తాద్ రామ్ పోతినేని మాట్లాడుతూ.. "నార్త్ ఆడియన్స్ సౌత్ ఫిలిమ్స్‌ని ఇష్టంగా చూస్తారు. నేరుగా హిందీలో రిలీజ్ చేయమని కోరుతుంటారు. డబుల్ ఇస్మార్ట్ తో నార్త్ ఆడియన్స్ ముందుకు రావడం ఆనందంగా ఉంది. సినిమాని దాదాపు ముంబైలో షూట్ చేశాం. డబుల్ ఇస్మార్ట్ మ్యాడ్‌నెస్ ఇక్కడ కూడా విట్నెస్ చేస్తారని ఆశిస్తున్నాను" అని అన్నాడు.

"డబుల్ ఇస్మార్ట్ మెంటల్ మాస్ మ్యాడ్‌నెస్ క్యారెక్టర్. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. పూరి గారు నా కోసం ఈ క్యారెక్టర్ రాయడం ఆనందంగా ఉంది. ఈ క్యారెక్టర్‌ని చాలా ఎంజాయ్ చేస్తూ ప్లే చేశాను. ఇస్మార్ట్ శంకర్‌ని ఆడియన్స్ హ్యుజ్ హిట్ చేశారు. ఇప్పుడు డబుల్ ఎనర్జీ, డబుల్ మాస్, ఎంటర్ టైన్మెంట్‌తో వస్తున్నాం" అని రామ్ పోతినేని చెప్పాడు.

"సంజయ్ దత్ గారు ఇందులో హైలెట్. ఈ క్యారెక్టర్‌ని ఆయన తప్పితే మరొకరు చేయలేరు. ఆయన స్వీట్ హార్ట్. ఆయనతో వర్క్ చేయడం హానర్. పూరి గారు హీరోలకు కూల్ యాటిట్యూడ్, స్వాగ్ యాడ్ చేశారు. తను కంప్లీట్ ట్రెండ్ సెట్టర్. ఆయనతో వర్క్ చేయడం ఆల్వేస్ హానర్. థాంక్ యూ" అని రామ్ పోతినేని తన స్పీచ్ ముగించాడు.

"నేను సంజయ్ బాబాకి బిగ్ ఫ్యాన్‌ని. ఆయనకి నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. ఆయన వెర్సటైల్ యాక్టర్. అన్ని రకాల పాత్రలు చేశారు. మేము కలసినప్పుడు ఆయన ఏడు సినిమాలకి సైన్ చేసి ఉన్నారు. డేట్స్ లేవని చాలా వర్రీ అయ్యాం. ఫైనల్‌గా ఆయన డేట్స్ దొరికాయి. ఆయన డబుల్ ఇస్మార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా చేసినందుకు ఆయనకి థాంక్ యూ" అని డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలిపారు.

"డబుల్ ఇస్మార్ట్‌ని ముంబైలో ప్రమోట్ చేయడం చాలా అనందంగా ఉంది. 2019లో ఇస్మార్ట్ శంకర్ మంచి హిట్ అయింది. మీ అందరి ప్రేమతో ఈ సినిమా సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్‌ని ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. పూరి సర్ అద్భుతంగా తీశారు. నార్త్ ఇండియాలో డబుల్ ఇస్మార్ట్ హ్యుజ్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" అని నిర్మాత ఛార్మి కౌర్ ఆశాభావం వ్యక్తం చేశారు.