Akash Puri: తండ్రి పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో సినిమా చేయనన్న ఆకాష్ పూరి.. ఇప్పటికీ ఆ కంప్లైంట్ ఉందంటూ!-akash puri brand ambassador to rc trend setters crazy mens cloth branding akash puri comments ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Akash Puri: తండ్రి పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో సినిమా చేయనన్న ఆకాష్ పూరి.. ఇప్పటికీ ఆ కంప్లైంట్ ఉందంటూ!

Akash Puri: తండ్రి పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో సినిమా చేయనన్న ఆకాష్ పూరి.. ఇప్పటికీ ఆ కంప్లైంట్ ఉందంటూ!

Sanjiv Kumar HT Telugu
Mar 11, 2024 05:55 AM IST

Akash Puri Brand Ambassador RC Trend Setters: డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆకాష్ పూరి బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. అలాగే తనపై ఇప్పటికీ ఓ కంప్లైంట్ ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

బ్రాండ్ అంబాసిడర్‌గా పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి.. నాపై ఇప్పటికీ ఆ కంప్లైంట్ ఉందంటూ!
బ్రాండ్ అంబాసిడర్‌గా పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి.. నాపై ఇప్పటికీ ఆ కంప్లైంట్ ఉందంటూ!

Akash Puri RC Trend Setters: డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు హీరోగా మారి తనదైన శైలీలో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి యంగ్ హీరో ఆకాష్ పూరి తాజాగా బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. తొలిసారి ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్లాత్ బ్రాండింగ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్రేజీ మెన్స్ క్లాత్ బ్రాండింగ్‌గా పేరు తెచ్చుకుంటోంది. ఈ క్లాతింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేయడం హ్యాపీగా ఉందని ఆకాష్ పూరి తెలిపాడు.

yearly horoscope entry point

ఆదివారం (మార్చి 10) హైదరాబాద్‌లో జరిగిన ఈ బ్రాండింగ్ లాంఛ్ కార్యక్రమంలో ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ వ్యవస్థాపకులు రమేష్, రోమన్‌తో కలిసి ఆకాష్ పూరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆకాష్ పూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

"ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండమని రమేష్ , రోమన్ నన్ను సంప్రదించారు. నేను ఈ బ్రాండింగ్‌కు ప్రచారకర్తగా చేయడం కరెక్టేనా అని ఆలోచించాను. ఎందుకంటే నేను చాలా క్యాజువల్ డ్రెస్‌లో బయటకు వెళ్తుంటాను. వీళ్లు అనేక రకాల మెన్స్ వేర్ బ్రాండ్స్ నాకు చూపించారు. అయితే క్లాతింగ్ రంగంలో వీళ్ల ప్లానింగ్, లక్ష్యం గురించి తెలుసుకున్న తర్వాత ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు ముందుకొచ్చాను" అని ఆకాష్ పూరి తెలిపాడు.

"నేను చేస్తున్న ఫస్ట్ బ్రాండింగ్ ఇదే కావడం హ్యాపీగా ఉంది. నిన్న ఈ బ్రాండ్‌ను లాంఛ్ చేస్తూ అనౌన్స్ మెంట్ ఇచ్చాం. ఆ ప్రకటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదే కాకుండా మరికొన్ని బ్రాండింగ్స్‌కు కూడా అంబాసిడర్‌గా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఇక నా కెరీర్ పరంగా చూస్తే గత సినిమా చోర్ బజార్ అంతగా ఆదరణ పొందలేదు. అందుకే ఈసారి నేను చేసే సినిమాను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలని అనుకుంటున్నాను" అని ఆకాష్ పూరి అన్నాడు.

"ఓ లవ్ స్టోరీ, మరో యాక్షన్ మూవీ కథలు విన్నాను. అవి ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాం. ప్రాజెక్ట్ లాక్ అయ్యాక మీకు వివరాలు చెబుతాను. నేను ఈసారి చేసే సినిమా కిడ్స్, ఫ్యామిలీ, యూత్ అందరికీ నచ్చేలా చూసుకుంటాను. నేను ఇప్పటికీ చిన్న పిల్లాడిలా ఉంటాను అనే కంప్లైంట్ ఉంది. హీరోగా సెట్ అయిన తర్వాతే విలన్ వంటి క్యారెక్టర్స్ చేయడం గురించి ఆలోచిస్తా. నాన్న పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో ఇప్పట్లో నటించకూడదు అని అనుకున్నా. నాకు నేనుగా హీరోగా పేరు తెచ్చుకున్న తర్వాతే నాన్న డైరెక్షన్‌లో మూవీ చేస్తా" అని ఆకాష్ చెప్పుకొచ్చాడు.

"నాకు అమ్మా నాన్న ఇద్దరి సపోర్ట్ పూర్తిగా ఉంది. నా స్క్రిప్ట్స్ నాన్న చదువుతారు. మన ఇండస్ట్రీలో చాలా గొప్ప సినిమాలు వస్తున్నాయి. కార్తికేయ 2, హనుమాన్ వంటి మూవీస్ చూసినప్పుడు ఇలాంటి సినిమాల్లో నటించాలి అనే కోరిక కలుగుతుంటుంది. నాన్న పూరి డైరెక్షన్‌లో రామ్ గారు నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ చాలా బాగా వస్తోంది. ఈ మధ్యే టీజర్ రఫ్ కట్ చూశాను. రామ్ గారి అభిమానులు హ్యాపీగా ఫీలయ్యేలా టీజర్ ఉంటుంది. ప్రభాస్ గారిని కలిసినప్పుడు ఎంతో ప్రేమగా మాట్లాడుతారు. ప్రస్తుతానికి నేను సింగిల్ గానే ఉన్నాను. ఏ అమ్మాయినీ ప్రేమించడం లేదు" అని ఆకాష్ పేర్కొన్నాడు.

Whats_app_banner