Double Ismart Teaser: బూతులతో డబుల్ ఇస్మార్ట్ టీజర్.. రామ్ పోతినేని-పూరి జగన్నాథ్ మ్యాజిక్ రిపీట్ అవుద్దా?-puri jagannadh ram pothineni double ismart teaser out now on ram pothineni birthday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Double Ismart Teaser: బూతులతో డబుల్ ఇస్మార్ట్ టీజర్.. రామ్ పోతినేని-పూరి జగన్నాథ్ మ్యాజిక్ రిపీట్ అవుద్దా?

Double Ismart Teaser: బూతులతో డబుల్ ఇస్మార్ట్ టీజర్.. రామ్ పోతినేని-పూరి జగన్నాథ్ మ్యాజిక్ రిపీట్ అవుద్దా?

Sanjiv Kumar HT Telugu
May 15, 2024 10:40 AM IST

Double Ismart Teaser Out Now: పూరి జగన్నాథ్ రామ్ పోతినేని క్రేజీ కాంబినేషన్‌లో వస్తోన్న రెండో మూవీ డబుల్ ఇస్మార్ట్ టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. మరోసారి ఈ కాంబో మ్యాజిక్ రిపీట్ చేయనుందా అనే అనుమానం టీజర్ చూస్తే వస్తోంది. డబుల్ ఇస్మార్ట్ టీజర్ విశేషాల్లోకి వెళితే..

బూతులతో డబుల్ ఇస్మార్ట్ టీజర్.. రామ్ పోతినేని-పూరి జగన్నాథ్ మ్యాజిక్ రిపీట్ అవుద్దా?
బూతులతో డబుల్ ఇస్మార్ట్ టీజర్.. రామ్ పోతినేని-పూరి జగన్నాథ్ మ్యాజిక్ రిపీట్ అవుద్దా?

Double Ismart Teaser Released: డ్యాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ (Puri Jagannadh), ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) కాంబినేషన్‌లో వస్తున్నమోస్ట్ అవైటెడ్ సీక్వెల్ మూవీ 'డబుల్ ఇస్మార్ట్'. 2019లో వచ్చి సూపర్ హిట్ అందుకున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ వస్తున్న విషయం తెలిసిందే.

మరోసారి పూరి జగన్నాథ్-రామ్ పోతినేని కాంబోలో సినిమా రావడంతో ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. డబుల్ ఇస్మార్ట్ టైటిల్ రివీల్ చేసినప్పటినుంచి ఫుల్ బజ్ క్రియేట్ అయింది. ప్రస్తుతం ముంబైలో ఈ మూవీ షూటింగ్ జరుగుతన్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో రామ్ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ (Sanjay Dutt) ఎక్స్‌ట్రార్డినరీ రోల్ ప్లే చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

ఇటీవల డబుల్ ఇస్మార్ట్ టీజర్‌ను (Double Ismart Teaser) మే 15న అంటే ఇవాళ ఉదయం 10 గంటల ప్రాంతంలో రామ్ పోతినేని బర్త్ డే (Ram Pothineni Birthday) సందర్భంగా విడుదల చేస్తామని ప్రకటించారు. దానికి తగినట్లుగానే తాజాగా డబుల్ ఇస్మార్ట్ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఎంటర్టైనింగ్‌గా ఉంది. మరోసారి పూరి, రామ్ పోతినేని కాంబో మ్యాజిక్ రిపీట్ కానుందని అభిమానులు ఆశపడుతున్నారు.

టీజర్ ప్రారంభం కావడంతోనే గన్స్, బూతులు వినిపిస్తాయి. ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్ శంకర్, నాకు తెల్వకుండానే నాతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తే నా గుడ్డులో కాల్తది అని రామ్ చెప్పే డైలాగ్స్ ఆకట్టున్నాయి. మరోసారి తెలంగాణ స్లాంగ్‌లో రామ్ పోతినేని అలరించాడు.

ఇస్మార్ట్ శంకర్ తరహాలోనే డబుల్ ఇస్మార్ట్ క్లైమాక్స్‌ను శివుడి నేపథ్యంలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ మూవీలో హీరోకు బ్రెయిన్‌లో చిప్ పెట్టిన విషయం తెలిసిందే. దాన్ని తీసుకునేందుకు సంజయ్ దత్ గ్యాంగ్ ట్రై చేస్తున్నట్లు టీజర్ ద్వారా అర్థం అవుతోంది. ఇందులో సంజయ్ దత్ స్టైలిష్‌గా కనిపించాడు. ఆయనకు యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా ఇప్పటివరకు ఈ సినిమాలో రామ్, సంజయ్ దత్ మాత్రమే నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ, టీజర్ ద్వారా మరికొంత మంది నటీనటుల గురించి తెలిసింది. ఇందులో హీరోయిన్‌గా కావ్య థాపర్ (Kavya Thapar) చేస్తోంది. అలాగే అలీ, గెటప్ శ్రీను, మకరంద్ దేశ్ పాండే, షయాజీ షీండే, టెంపర్ శ్రీను, బాలీవుడ్ ఫిట్‌నెస్ బ్యూటి వీజే బని నటిస్తోంది.

వీజే బని ఇంతకుముందు సాయి ధరమ్ తేజ్ తిక్క సినిమాలో నటించింది. అలాగే హిందీ పాపులర్ వెబ్ సిరీస్ ఫోర్ మోర్ షాట్స్‌లో బోల్డ్ క్యారెక్టర్ చేసి ఆకట్టుకుంది. వీరితోపాటు అలీ తన మార్క్ కామెడీతో ఆకట్టుకునేలా కనిపించాడు. ఇంతకుముందు పూరి సినిమాల్లో అలీకి కీలక రోల్, సన్నివేశాలు ఉండేవి. అలాంటివి డబుల్ ఇస్మార్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.