Boyapati RAPO: బోయపాటి-రామ్ పోతినేని మూవీ ఆసక్తికర అప్డేట్.. టీజర్ వచ్చేది అప్పుడే..!-boyapati sreenu and ram pothineni movie teaser will release on may 15 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Boyapati Rapo: బోయపాటి-రామ్ పోతినేని మూవీ ఆసక్తికర అప్డేట్.. టీజర్ వచ్చేది అప్పుడే..!

Boyapati RAPO: బోయపాటి-రామ్ పోతినేని మూవీ ఆసక్తికర అప్డేట్.. టీజర్ వచ్చేది అప్పుడే..!

Maragani Govardhan HT Telugu
Jan 08, 2024 06:49 PM IST

Boyapati RAPO: బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తున్న సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ మూవీ టీజర్‌ను ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు సమాచారం.

బోయపాటి సినిమాలో రామ్ పోతినేని
బోయపాటి సినిమాలో రామ్ పోతినేని

Boyapati RAPO: టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి ఇప్పటికే ప్రారంభమై శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అంతేకాకుండా ఈ ఏడాది అక్టోబరు 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. బోయపాటి-రామ్ పోతినేని మూవీ టీజర్‌ను ఈ నెలలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం.

బోయపాటి-రామ్ కాంబోలో రానున్న మూవీ టీజర్‌ను ఈ నెల 15న రిలీజ్ చేయనున్నారు. ఆ రోజు రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది.

అయితే వీరి కాంబోలో రానున్న మూవీకి సంబంధించిన టైటిల్‌ను మాత్రం ఇంతవరకు ప్రకటించలేదు చిత్రబృందం. మరి రామ్ పుట్టినరోజున ప్రకటిస్తారా లేకా.. కేవలం టీజర్‌‍ను మాత్రమే విడుదల చేస్తారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ ఆ రేంజ్‌లో ఊర మాస్‌గా కనిపించింది ఈ పోస్టర్‌లోనే.

మరోపక్క అఖండ లాంటి సూపర్ హిట్ తర్వాత బోయపాటి తెరెకెక్కిస్తున్న సినిమా కావడంతో మాస్ ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. గతేడాది రామ్ నటించిన వారియర్ సినిమా డిజాస్టర్ కావడంతో.. అతడి అభిమానులు కూడా బోయపాటి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీ లీల హీరోయిన్‌గా చేస్తోంది. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సంతోష్ ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. అక్టోబరు 20న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.