Ram Pothineni Next Movie: రామ్ పోతినేని-బోయపాటి సినిమా షూటింగ్ ప్రారంభం.. హీరోయిన్ ఎవరో తెలుసా?-ram pothineni and boyapati sreenu movie will start from 2022 october 6 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ram Pothineni And Boyapati Sreenu Movie Will Start From 2022 October 6

Ram Pothineni Next Movie: రామ్ పోతినేని-బోయపాటి సినిమా షూటింగ్ ప్రారంభం.. హీరోయిన్ ఎవరో తెలుసా?

Maragani Govardhan HT Telugu
Oct 05, 2022 07:03 PM IST

Boyapati Sreenu and Ram Movie: రామ్ పోతినేని హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రానున్న సినిమా రెగ్యూలర్ షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో శ్రీలీలను హీరోయిన్‌గా తీసుకుంది.

రామ్ పోతినేని మూవీ ప్రారంభం
రామ్ పోతినేని మూవీ ప్రారంభం

BoyapatiRAPO: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని ఈ ఏడాది వారియర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ద్విభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టాడు రామ్. ఇప్పటికే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాకు పచ్చ జెండా ఊపాడు. తాజాగా ఈ క్రేజీ కాంబోకు సంబంధించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. దసరా కానుకగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్స్ వచ్చింది చిత్రబృందం.

బోయపాటి శ్రీను- రామ్ కాంబోలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ గురవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించింది చిత్రబృందం. అంతేకాకుండా ఈ చిత్రంలో హీరోయిన్ గురించి అప్డేట్ ఇచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్టులో పెళ్లి సందడితో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీలను ఎంపిక చేసినట్లు వెల్లడించింది.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఈ చిత్రం గురించి ఇవ్వని టీమ్.. ఏకంగా సినిమా షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన ఇదొక పొలిటికల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా రామ్ మాస్ యాక్షన్‌కు సరిపోయే స్టోరీతో బోయపాటి ఈ చిత్ర కథను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్