Ram Pothineni: నాగ‌చైత‌న్య డైరెక్ట‌ర్‌తో రామ్ పోతినేని సినిమా-ram pothineni to team up with director gautham menon for his next film ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ram Pothineni To Team Up With Director Gautham Menon For His Next Film

Ram Pothineni: నాగ‌చైత‌న్య డైరెక్ట‌ర్‌తో రామ్ పోతినేని సినిమా

HT Telugu Desk HT Telugu
Sep 15, 2022 07:02 AM IST

Ram Pothineni: ది వారియ‌ర్ త‌ర్వాత దర్శకుడు బోయ‌పాటి శ్రీనుతో ఓ పాన్ ఇండియ‌న్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రామ్ పోతినేని. తాజాగా అత‌డు సీనియ‌ర్ డైరెక్ట‌ర్‌తో సినిమా చేయ‌బోతున్నాడు. ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే...

రామ్ పోతినేని
రామ్ పోతినేని (twitter)

Ram Pothineni: ది వారియ‌ర్(The Warrior) సినిమాతో జూలై నెలలో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు హీరో రామ్. లింగుస్వామి(Lingusamy) ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా ఫెయిల్యూర్ నిలిచి రామ్ కు నిరాశను మిగిల్చింది. ద‌ర్శ‌కుడు ఎంచుకున్న క‌థాంశంలో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం, ట్రీట్‌మెంట్ కూడా ఓల్డ్ స్టైల్‌లో ఉండ‌టంతో వారియన్ సినిమాను ప్రేక్ష‌కులు తిర‌స్క‌రించారు. ది వారియ‌ర్ త‌ర్వాత బోయ‌పాటి శ్రీనుతో (Boyapati srinu) ఓ సినిమా చేయ‌బోతున్నాడు రామ్‌.

పాన్ ఇండియ‌న్ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ నెలాఖ‌రున మొద‌లుకానుంది. కాగా రామ్ మ‌రో సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. సీనియ‌ర్ డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్‌తో(Gautham menon) ఓ సినిమా చేయ‌బోతున్నాడు. గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో శింబు హీరోగా న‌టించిన లైఫ్ ఆఫ్ ముత్తు సినిమా తెలుగు వెర్ష‌న్ ఈ నెల 17న రిలీజ్ కానుంది.

ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా రామ్‌తో సినిమా చేయ‌బోతున్న విష‌యాన్ని గౌత‌మ్ మీన‌న్ వెల్ల‌డించాడు. రామ్‌తో ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ డిస్కషన్స్ జరుగుతున్నాయని అన్నాడు. వ‌చ్చే ఏడాది వేస‌వి త‌ర్వాత ఈ సినిమా మొద‌ల‌వుతుంద‌ని గౌత‌మ్‌మీన‌న్ తెలిపాడు.

ఈ సినిమాను స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. గ‌తంలోరామ్‌తో త‌న కాంబినేష‌న్‌లో ఓ సినిమా షూటింగ్ మొద‌లైన త‌ర్వాత ఆగిపోయింద‌ని గౌతమ్ మీనన్ అన్నాడు. రామ్ సినిమాతో పాటుగా నాగ‌చైత‌న్య‌తో ఏ మాయ చేశావే 2 ( Naga Chaitanya) కూడా చేయాల‌ని ఉంద‌ని అన్నాడు.

నాగ‌చైత‌న్య ఒకే అంటే త‌ప్ప‌కుండా సీక్వెల్ చేస్తానని గౌతమ్ మీనన్ చెప్పాడు. కాగా శింబు హీరోగా న‌టించి లైఫ్ ఆఫ్ ముత్తు సినిమా త‌మిళ వెర్ష‌న్ సెప్టెంబ‌ర్ 15న రిలీజ్ కానుండ‌గా తెలుగు వెర్ష‌న్ మాత్రం సెప్టెంబ‌ర్ 17న ప్రేక్ష‌కుల ముందుకురానుంది. గ్యాంగ్‌స్ట‌ర్ క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

IPL_Entry_Point