Sanjay Dutt Remuneration: డబుల్ ఇస్మార్ట్ మూవీ కోసం సంజయ్ దత్‍కు భారీ రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లు తీసుకుంటున్నారంటే!-sanjay dutt taking huge remuneration for double ismart movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sanjay Dutt Remuneration: డబుల్ ఇస్మార్ట్ మూవీ కోసం సంజయ్ దత్‍కు భారీ రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లు తీసుకుంటున్నారంటే!

Sanjay Dutt Remuneration: డబుల్ ఇస్మార్ట్ మూవీ కోసం సంజయ్ దత్‍కు భారీ రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లు తీసుకుంటున్నారంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 05, 2023 05:13 PM IST

Sanjay Dutt Remuneration: డబుల్ ఇస్మార్ట్ సినిమా కోసం సంజయ్ దత్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ వివరాలు బయటికి వచ్చాయి. ఈ మూవీ కోసం ఆయన భారీ మొత్తాన్ని అందుకుంటున్నారు.

Sanjay Dutt Remuneration: డబుల్ ఇస్మార్ట్ మూవీ కోసం సంజయ్ దత్‍కు భారీ రెమ్యూనరేషన్
Sanjay Dutt Remuneration: డబుల్ ఇస్మార్ట్ మూవీ కోసం సంజయ్ దత్‍కు భారీ రెమ్యూనరేషన్

Sanjay Dutt Remuneration: బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ వరుసగా దక్షిణాది సినిమాల్లో నటిస్తున్నారు. కేజీఎఫ్ 2 తర్వాత సంజయ్‍కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఆ సినిమా బంపర్ హిట్ కావటంతో ఆయనకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఇటీవల లియో మూవీలోనూ కీలక పాత్రలో సంజయ్ నటించారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలో విలన్‍గా నటిస్తున్నారు సంజయ్ దత్. ఈ సినిమా కోసం ఆయన భారీ మొత్తం అందుకుంటున్నారని సమాచారం బయటికి వచ్చింది.

రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో బిగ్‍బుల్ అనే మెయిన్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు సంజయ్ దత్. ఇప్పటికే వచ్చిన లుక్ ఆకట్టుకుంది. కాగా, డబుల్ ఇస్మార్ట్ చిత్రం కోసం సంజయ్ దత్ భారీ మొత్తాన్ని అందుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో నటించేందుకు సంజయ్ రూ.6కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే సమాచారం వెల్లడైంది.

కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలో విలన్ అధీర పాత్రలో సంజయ్ దత్ మెప్పించారు. ఆ చిత్రం భారీ హిట్ అయింది. ఇటీవల దళపతి విజయ్ హీరోగా నటించిన లియో చిత్రంలో ఆంటోనీ దాస్ క్యారెక్టర్ చేశారు సంజయ్.

రామ్ పోతినేని - పూరి జగన్నాథ్ కాంబినేషన్‍లో 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్‍గా ప్రస్తుతం ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను పూరి జగన్నాథ్ రూపొందిస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 8వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం రానుంది.

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించి నిర్మాతగా వ్యవహరించిన లైగర్ సినిమా గతేడాది డిజాస్టర్ అయింది. పూరికి నష్టాలను మిగిల్చింది. దీంతో డబుల్ ఇస్మార్ట్ మూవీ అతడికి చాలా కీలకంగా మారింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్‍కు కూడా సరైన హిట్ లేదు.