Bhagyashri Borse: ఫస్ట్ తెలుగు మూవీకే డబ్బింగ్ చెప్పిన బోల్డ్ బ్యూటి.. కుర్రాళ్ల క్రష్‌గా భాగ్యశ్రీ బోర్సే-bhagyashri borse completes her dubbing for ravi teja mister bachchan movie tollywood new crush bhagyashri borse wiki ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bhagyashri Borse: ఫస్ట్ తెలుగు మూవీకే డబ్బింగ్ చెప్పిన బోల్డ్ బ్యూటి.. కుర్రాళ్ల క్రష్‌గా భాగ్యశ్రీ బోర్సే

Bhagyashri Borse: ఫస్ట్ తెలుగు మూవీకే డబ్బింగ్ చెప్పిన బోల్డ్ బ్యూటి.. కుర్రాళ్ల క్రష్‌గా భాగ్యశ్రీ బోర్సే

Sanjiv Kumar HT Telugu
Jul 31, 2024 10:30 AM IST

Bhagyashri Borse Completes Dubbing For Mister Bachchan: తొలి తెలుగు సినిమాకే సొంతగా డబ్బింగ్ చెప్పి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది బోల్డ్ బ్యూటి బాగ్యశ్రీ బోర్సే. మాస్ మహారాజా రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాకు డబ్బింగ్ పూర్తి చేసిన భాగ్యశ్రీ బోర్సే కుర్రాళ్ల క్రష్‌గా మారుతోంది.

ఫస్ట్ తెలుగు మూవీకే డబ్బింగ్ చెప్పిన బోల్డ్ బ్యూటి.. కుర్రాళ్ల క్రష్‌గా భాగ్యశ్రీ బోర్సే
ఫస్ట్ తెలుగు మూవీకే డబ్బింగ్ చెప్పిన బోల్డ్ బ్యూటి.. కుర్రాళ్ల క్రష్‌గా భాగ్యశ్రీ బోర్సే

Bhagyashri Borse Dubbing: టాలీవుడ్‌లో ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నారు. కానీ, వారిలో చాలా మంది తమ పాత్రలకు సొంతగా డబ్బింగ్ చెప్పుకోలేరు. ఎంతో కాలంగా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ సైతం తెలుగు భాషలో డబ్బింగ్ చెప్పలేకపోతున్నారు. అలాంటిది మొదటి సినిమాకే తెలుగులో డబ్బింగ్ చెప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది గ్లామర్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే.

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ చిత్రంగా వస్తోంది 'మిస్టర్ బచ్చన్'. తెలుగు ప్రేక్షకులకు అల్టిమేట్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించడానికి రెడీగా ఉంది ఈ సినిమా. ఈ చిత్రంలో పూణెకు చెందిన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన మిస్టర్ బచ్చన్ సినిమాలోని పాటలు, షో రీల్, టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్‌ వచ్చింది.

ఇవన్ని మిస్టర్ బచ్చన్ సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే, తాజాగా సినిమాలోని హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తన డబ్బింగ్ పార్ట్ కంప్లీట్ చేశారు. తన క్యారెక్టర్‌కు సొంతంగా డబ్బింగ్ చెప్పారు. మహారాష్ట్రలోని పూణె నగరానికి చెందిన భాగ్యశ్రీ బోర్సే తెలుగు తన మాతృభాష కాకపోయినప్పటికీ కష్టపడి నేర్చుకొని తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పింది.

ఇప్పుడు ఈ విషయం అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. సినిమా పట్ల ఆమెకున్న డెడికేషన్, ప్రొఫెషనలిజంను చూసి అందరూ ప్రశంసిస్తున్నారు. ఎంతోకాలంగా ఉన్న హీరోయిన్స్‌తో పోలిస్తే.. తొలి సినిమాకే సొంతగా డబ్బింగ్ చెప్పడం మెచ్చుకోదగ్గ విషయం అని అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే, అయితే, ఇదివరకే విడుదలైన సితార్, రెప్పల్ డప్పుల్ సాంగ్స్, టీజర్‌లో తన బ్యూటీఫుల్ అండ్ బోల్డ్ స్క్రీన్ ప్రజెన్స్‌తో ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసింది భాగ్యశ్రీ. ఇప్పుడు ఎక్కడ చూసిన భాగ్యశ్రీ ఫోటోలే వైరల్ అవుతున్నాయని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ అప్ కమింగ్ క్రేజీ హీరోయిన్ భాగ్యశ్రీ అని అంటున్నారు.

అంతేకాకుండా భాగ్యశ్రీ పెర్ఫార్మెన్స్‌ని బిగ్ స్క్రీన్‌పై చూడటానికి ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక భాగ్యశ్రీ బోర్సే మొదట్లో మోడల్‌గా రాణించింది. తర్వాత 2023లో వచ్చిన హిందీ మూవీ యారియన్ 2తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మిస్టర్ బచ్చన్‌తో టాలీవుడ్‌లోకి డెబ్యూ ఇస్తోంది. ఇదే కాకుండా విజయ్ దేవరకొండ వీడీ12 చిత్రంలో కూడా హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే చేస్తోంది.

కాగా మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి అయాంక బోస్ సినిమాటోగ్రాఫర్ కాగా.. ప్రొడక్షన్ డిజైన్ బ్రహ్మ కడలి. అలాగే ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.

ఇక స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ, భాగ్యశ్రీ భోర్సేతోపాటు సీనియర్ హీరో జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Whats_app_banner