Bhagyashri Borse: విజయ్ దేవరకొండతో భాగ్యశ్రీ బోర్సే! ఎవరీ అందాల భామ-bhagyashri borse to romance vijay deverakonda in gowtham tinnanuri movie vd12 who is she ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bhagyashri Borse: విజయ్ దేవరకొండతో భాగ్యశ్రీ బోర్సే! ఎవరీ అందాల భామ

Bhagyashri Borse: విజయ్ దేవరకొండతో భాగ్యశ్రీ బోర్సే! ఎవరీ అందాల భామ

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 09, 2024 02:32 PM IST

Bhagyashri Borse - Vijay Deverakonda: విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్‍గా భాగ్యశ్రీ బోర్సే అవకాశం దక్కించుకున్నారని తెలుస్తోంది. గౌతమి తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకుడిగా ఉన్నారు.

Bhagyashri Borse: విజయ్ దేవరకొండతో భాగ్యశ్రీ భోర్సే! ఎవరీ అందాల భామ
Bhagyashri Borse: విజయ్ దేవరకొండతో భాగ్యశ్రీ భోర్సే! ఎవరీ అందాల భామ

Bhagyashri Borse: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా రీసెంట్‍గా థియేటర్లలోకి వచ్చింది. ఏప్రిల్ 5వ తేదీన రిలీజైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. పరశురామ్ పేట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనుకున్న స్థాయిలో వసూళ్లు రావడం లేదు. అయితే, విజయ్ ఈ మూవీ కంటే ముందే జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓ చిత్రం (V12) మొదలుపెట్టారు. అది ఆలస్యమవుతుంటడంతో.. ఫ్యామిలీ స్టార్ పూర్తిచేశారు. ఇక తదుపరి గౌతమ్ మూవీని చేయనున్నారు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ మార్పు జరిగినట్టు సమాచారం బయటికి వచ్చింది.

శ్రీలీల ఔట్!

విజయ్ - గౌతమ్ తిన్ననూరి సినిమాలో హీరోయిన్‍గా ముందుగా శ్రీలీలను ఎంపిక చేశారు. ఈ మూవీ పూజా కార్యక్రమానికి కూడా ఆమె హాజరయ్యారు. అయితే, డేట్స్ సర్దుబాటు కాకపోవడం, మెడిసెన్ కంప్లీట్ చేయాలని నిర్ణయించుకోవడంతో ఈ మూవీ నుంచి శ్రీలీల తప్పుకున్నారని తెలుస్తోంది. దీంతో ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సేను మూవీ టీమ్ హీరోయిన్‍గా తీసుకున్నట్టు తాజాగా సమాచారం బయటికి వచ్చింది.

ఎవరు ఈ భాగ్యశ్రీ బోర్సే

విజయ్ - గౌతమ్ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍గా నటించడం దాదాపు ఖరారైంది. పుణెకు చెందిన భాగ్యశ్రీ బోర్సే మోడల్‍గా బాగా పాపులర్ అయ్యారు. క్యాట్బరీ సిల్క్ సహా కొన్ని యాడ్స్ చేశారు. యారియాన్ 2 అనే బాలీవుడ్ చిత్రంతో భాగ్యశ్రీ తెరంగేట్రం చేశారు. సోషల్ మీడియాలోనూ ఈమెకు ఫాలోయింగ్ బాగానే ఉంది. ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ పక్కన నటించే ఛాన్స్ దక్కించుకున్నారు.

మమితాను కూడా అనుకున్నారట..

విజయ్ - గౌతమ్ తిన్ననూరి సినిమా కోసం ప్రేమలు హీరోయిన్‍ మమితా బైజూ పేరును కూడా మూవీ టీమ్ ఆలోచించిందని తెలుస్తోంది. తెలుగులోనూ పాపులర్ అవటంతో ఆమెను తీసుకోవాలని కూడా ఓ దశలో భావించారని టాక్. అయితే, చివరికి భాగ్యశ్రీ బోర్సేను ఫైనల్ చేసినట్టు సమాచారం బయటికి వచ్చింది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి మూవీ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండనుంది. భారీ బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.

విజయ్ - గౌతమ్ మూవీ ఆగిపోవటంతో ఈ సినిమా క్యాన్సిల్ అయిందని కూడా రూమర్లు వచ్చాయి. అయితే, ఈ చిత్రం కచ్చితంగా వస్తుందని మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ మరో నెలలో మళ్లీ ప్రారంభమవుతుందనే అంచనాలు ఉన్నాయి.

వరుస పరాజయాలతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండకు ఫ్యామిలీ స్టార్ కూడా పెద్దగా ఊరటనివ్వలేకపోతోంది. ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టు కలెక్షన్లను రాబట్టడం కష్టంగానే కనిపిస్తోంది. దీంతో గౌతమ్ తిన్ననూరితో చేసే ఈ యాక్షన్ మూవీ విజయ్‍కు అత్యంత ముఖ్యంగా మారింది.