VD 12 Shooting Update: విజయ్ దేవరకొండ, శ్రీలీల సినిమా మళ్లీ పట్టాలు ఎక్కేది అప్పుడే!-vd12 shooting update vijay deverakonda and sreeleela movie shoot may restart in march ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vd 12 Shooting Update: విజయ్ దేవరకొండ, శ్రీలీల సినిమా మళ్లీ పట్టాలు ఎక్కేది అప్పుడే!

VD 12 Shooting Update: విజయ్ దేవరకొండ, శ్రీలీల సినిమా మళ్లీ పట్టాలు ఎక్కేది అప్పుడే!

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 02, 2024 07:15 PM IST

VD 12 Shooting Update: విజయ్ దేవరకొండ నయా మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలుకానుందో సమాచారం బయటికి వచ్చింది. గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

VD 12 Shooting Update: విజయ్ దేవరకొండ, శ్రీలీల సినిమా మళ్లీ పట్టాలు ఎక్కేది అప్పుడే!
VD 12 Shooting Update: విజయ్ దేవరకొండ, శ్రీలీల సినిమా మళ్లీ పట్టాలు ఎక్కేది అప్పుడే!

VD 12 Shooting Update: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మార్చిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మరో సినిమా(VD12)కు కూడా ఓకే చెప్పారు. ఫ్యామిలీ స్టార్ కంటే ముందే ఈ మూవీ షూటింగ్ కాస్త జరిగింది కూడా. విజయ్‍కు 12వ మూవీ కావటంతో ఈ ప్రాజెక్టను VD12గా పిలుస్తున్నారు. అయితే, సడన్‍గా వీ12 షూటింగ్ నిలిచిపోగా.. తదుపరి ఫ్యామిలీ స్టార్ (VD13)ను ఫినిష్ చేసే పనిలో విజయ్ ఉన్నారు. కాగా, ఈ వీడీ12 సినిమా షూటింగ్ మళ్లీ ఎప్పుడు షురూ కానుందో సమాచారం బయటికి వచ్చింది.

గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‍లో యాక్షన్ థ్రిల్లర్‌గా వీడీ12 రూపొందనుంది. కాగా, ఈ మూవీ షూటింగ్ మళ్లీ ఈ ఏడాది మార్చిలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ, హీరోయిన్ శ్రీలీల మార్చిలో డేట్లు కేటాయించేశారట. ఫ్యామిలీ స్టార్ షూటింగ్ కూడా అప్పటికల్లా పూర్తి కానుండటంతో మార్చిలో వీడీ12 షూటింగ్ రీస్టార్ట్‌కు విజయ్ ఓకే చెప్పాడట. దీంతో ఈ మూవీ చిత్రీకరణ మళ్లీ పట్టాలెక్కనుంది.

వీడీ12 షూటింగ్ అర్ధాంతరంగా నిలిచిపోయి.. ఫ్యామిలీ స్టార్ మూవీలో విజయ్ దేవరకొండ బీజీ అయ్యాడు. దీంతో వీడీ12 ఉంటుందా.. లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఈ మూవీ ఉంటుందని కూడా టీమ్ క్లారిటీ ఇచ్చింది.

వీడీ12 చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. సుమారు రూ.100కోట్ల భారీ బడ్జెట్‍తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు ఆయన ఇటీవల తెలిపారు. ఈ మూవీకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ఉండనుంది.

కాగా, పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని సంక్రాంతికే రిలీజ్ చేస్తామని గతంలో మూవీ యూనిట్ ప్రకటించింది. అయితే, వాయిదా వేసింది. ఈ ఏడాది మార్చిలో ఈ చిత్రాన్ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాత దిల్‍రాజు చెప్పారు.

సంబంధిత కథనం