Family Star: విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్‍పై క్లారిటీ ఇచ్చిన దిల్‍రాజు.. యానిమల్ తెలుగు కలెక్షన్లపై కూడా..
Family Star Release: ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ గురించి నిర్మాత దిల్‍రాజు క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ ఎప్పుడు విడుదల కానుందో తెలిపారు. ఆ వివరాలివే..
Family Star Release: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠూకూర్ హీరోహీరోయిన్లుగా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో పక్కా ఫ్యామిలీ మ్యాన్‍గా విజయ్ కనిపించనున్నారు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్‌తో ఈ మూవీపై ఆసక్తి విపరీతంగా పెరిగింది. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు . గీతగోవిందం మూవీ తర్వాత విజయ్ - పరశురామ్ కాంబో మరోసారి రిపీట్ అవుతోంది. అయితే, ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ గురించి ఇటీవల రూమర్స్ వస్తున్నాయి.

ఫ్యామిలీ స్టార్ సినిమాను వచ్చే ఏడాది (2024) సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే, ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతుందని కొంతకాలంగా సమాచారం బయటికి వస్తోంది. ఈ విషయంపై ఈ సినిమా నిర్మాత దిల్‍రాజు తాజాగా స్పందించారు. ఫ్యామిలీ స్టార్ మూవీ జనవరిలో రావడం లేదని స్పష్టం చేశారు. ఆ చిత్రం వాయిదా పడనుందని, మార్చిలో తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. యానిమల్ మూవీ కోసం నేడు జరిగిన మీడియా సమావేశంలో దిల్‍రాజు ఈ విషయాలను వెల్లడించారు.
సంక్రాంతి బరి నుంచి ఫ్యామిలీ స్టార్ వైదొలిగిందని దిల్‍రాజు తెలిపారు. “సంక్రాంతి రేసు నుంచి ఫ్యామిలీ స్టార్ ఔట్ అయింది. 2024 మార్చిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం” అని దిల్‍రాజు చెప్పారు.
రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా తెలుగు హక్కులను దిల్‍రాజు సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆ మూవీని రిలీజ్ చేశారు. యానిమల్ మూవీ నిన్న (డిసెంబర్ 1) రిలీజ్ కాగా.. తొలి రోజున తెలుగులో ఆ సినిమా రూ.14కోట్లను రాబట్టిందని దిల్‍రాజు తెలిపారు. ఈ తొలి వీకెండ్‍లోనే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.35కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఫ్యామిలీ స్టార్ మూవీని దిల్‍రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో రష్మిక మందన్న కూడా ఓ పాటలో సమాచారం. ఈ మూవీ షూటింగ్‍లోనూ ఆమె పాల్గొన్నారని టాక్.