Harish Shankar: హిందూ మతంపై హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్.. పవన్ కల్యాణ్ డైరెక్టర్ ఏమన్నాడంటే?-harish shankar about hindu dharmam in sarvam shakthi mayam ott series press meet ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Harish Shankar: హిందూ మతంపై హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్.. పవన్ కల్యాణ్ డైరెక్టర్ ఏమన్నాడంటే?

Harish Shankar: హిందూ మతంపై హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్.. పవన్ కల్యాణ్ డైరెక్టర్ ఏమన్నాడంటే?

Sanjiv Kumar HT Telugu
Oct 21, 2023 11:44 AM IST

Harish Shankar About Hindu Dharmam: హిందూ ధర్మం, హిందూ మతంపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సర్వం శక్తిమయం వెబ్ సిరీస్ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న హరీష్ ఏం మాట్లాడారంటే..

హిందూ మతంపై హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్
హిందూ మతంపై హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్

Harish Shankar At Sarvam Shakthi Mayam: అక్టోబర్ 20న ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ఆద్యాత్మిక సిరీస్ సర్వం శక్తిమయం విడుదలైంది. దీనికి పాజిటివ్ టాక్ రాగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు అతిథిగా హాజరైన ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ హిందూ మతం, ధర్మంపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

నన్ను భరించలేరు

"దేవుడు ఉన్నా లేడా, నాస్తికత్వం లాంటి డిబెట్లకు నేను ఎప్పుడూ వెళ్లను. భయపడి కాదు. నన్ను భరించలేరని. ఒక మూడో తరగతి, లేదా ఐదేళ్ల పిల్లాడికి పైథాగరస్, ఆర్కిమెడిస్, న్యూటన్ సిద్ధాంతాలు చెబితే అర్థం కావు. అంతమాత్రానా ఆ సిద్ధాంతాలు లేవని కాదు కదా. భగవంతుడి కాన్సెప్ట్ కూడా అంతే. నీకు అర్థం కానంత మాత్రాన అది అర్థం లేనిదని, లేదని కాదు" అని హరీష్ శంకర్ అన్నారు.

వాళ్లంత హిపోక్రసీలు

"దాదాపు సగం మంది హిపోక్రసీతో బతుకుతుంటారు. నేను దేవున్ని నమ్మను. కానీ, ఏదో ఒక ఎనర్జీ (శక్తి) ఉందండి అంటారు. నువ్ ఏ ఎనర్జీ తీసుకున్నా అది దేవుడితో మిళితం అయి ఉంటుంది. శక్తిని మనం చూడలేం. ఆస్వాదిస్తామంతే. భగవంతుడిని అంతే మనం చూడలేం. శక్తిని సృష్టించలేం. నాశనం చేయలేం. దేవుడు కూడా అంతే.. ఆది లేదు, అంతం లేదు. ఒక రూపం లేనిది శక్తి. రూపం లేనివాడు దేవుడు" అని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు.

పక్కోడికి అన్నం పెట్టమని

"హిందూ ధర్మం గురించి నేను ఒక మాట చదువుకున్నాను. అదే మాటను సర్వం శక్తి మయం సిరీసులో చెప్పారు. హిందూ మతం వేరు, హిందూ ధర్మం వేరు. భారతదేశం హిందూ మతంలో ఉన్నప్పటికీ హిందూ ధర్మం మీద నిలబడిన దేశం. తేడా ఏంటంటే.. హిందూ మతం బొట్టు పెట్టండని చెబుతుంది. హిందూ ధర్మం పక్కోడికి అన్నం పెట్టండి అని చెబుతుంది. అన్నం తినే ఆ పక్కోడికి బొట్టు ఉందా లేదా అని కూడా చూడదు" అని డైరెక్టర్ హరీష్ పేర్కొన్నారు.

డెస్టినీ మాత్రం అదే

"కొన్ని వందల సంవత్సరాలుగా ఇస్లాం కానీ, క్రైస్తవం గానీ, జైనిజం మతం గానీ, బుద్ధిజం కానీ ఇంత స్వేచ్ఛగా భారతదేశంలో వ్యాపించాయి అంటే దానికి కారణం హిందూ ధర్మం. పరమత సహనం అనేది హిందూ ధర్మంలోనే ఉంది. నువ్వు ఏ దారిలో వెళ్లినా చివరికీ డెస్టినీ అనేది సనాతనంగా వస్తున్న మన హిందూ ధర్మం" అని హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం హరీష్ వ్యాఖ్యలు, వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Whats_app_banner