Mr Bachchan Teaser: యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది: రొమాన్స్, ఐటీ రైడ్, యాక్షన్‍తో ఇంట్రెస్టింగ్‍గా మిస్టర్ బచ్చన్ టీజర్-mr bachchan teaser ravi teja shine energetic action and romance with bhagyashri borse and it raid ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mr Bachchan Teaser: యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది: రొమాన్స్, ఐటీ రైడ్, యాక్షన్‍తో ఇంట్రెస్టింగ్‍గా మిస్టర్ బచ్చన్ టీజర్

Mr Bachchan Teaser: యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది: రొమాన్స్, ఐటీ రైడ్, యాక్షన్‍తో ఇంట్రెస్టింగ్‍గా మిస్టర్ బచ్చన్ టీజర్

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 28, 2024 07:50 PM IST

Mr Bachchan Teaser: మిస్టర్ బచ్చన్ సినిమా టీజర్ వచ్చేసింది. రొమాన్స్, యాక్షన్‍తో ఇంట్రెస్టింగ్‍గా ఉంది. డైలాగ్స్ హైలైట్‍గా ఉన్నాయి.

Mr Bachchan Teaser: యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది: రొమాన్స్, ఐటీ రైడ్, యాక్షన్‍తో ఇంట్రెస్టింగ్‍గా మిస్టర్ బచ్చన్ టీజర్
Mr Bachchan Teaser: యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది: రొమాన్స్, ఐటీ రైడ్, యాక్షన్‍తో ఇంట్రెస్టింగ్‍గా మిస్టర్ బచ్చన్ టీజర్

హరీశ్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాపై ఫుల్ హైప్ ఉంది. 1980ల బ్యాక్‍డ్రాప్‍లో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ మళ్లీ హిట్ ట్రాక్‍లోకి వస్తారనే ఆశలు ఉన్నాయి. ఆగస్టు 15వ తేదీన మిస్టర్ బచ్చన్ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో నేడు (జూలై 28) ఈ చిత్రం నుంచి టీజర్ రిలీజ్ అయింది.

yearly horoscope entry point

పారిశ్రామికవేత్త సర్దార్ ఇందర్ సింగ్ ఇంటిపై జరిగిన ఇన్‍కమ్ ట్యాక్స్ (ఐటీ) దాడి ఆధారంగా మిస్టర్ బచ్చన్ చిత్రం తెరకెక్కింది. హీరోయిన్ బాగ్యశ్రీ బోర్సేతో రవితేజ లవ్, ఐటీ రైడ్, అడ్డొచ్చిన వాళ్లను చితక్కొట్టే యాక్షన్‍తో ఈ టీజర్ ఉంది.

టీజర్ ఇలా..

1980ల కాలాన్ని గుర్తు చేసేలా క్యాసెట్ సెంటర్ షాట్‍తో మిస్టర్ బచ్చన్ టీజర్ షురూ అయింది. ఆ తర్వాత భాగ్యశ్రీ బోర్సేతో రవితేజ లవ్ ట్రాక్ ఉంది. బ్యాక్‍డ్రాప్‍లో ప్రేమాలయం (హమ్ ఆప్కే హై కోన్ తెలుగు డబ్బింగ్) సినిమాలోని ‘అక్కా నీ మరిదెంతో పిచ్చోడే’ పాట ప్లే అవుతుంది. రవితేజ, భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.

ఆ తర్వాత జగపతి బాబు ఎంట్రీ ఉంది. ఆ తర్వాత ఆయన ఇంటిపై ఐటీ రైడ్ జరుగుతుంది. సక్సెస్‍ఫుల్ ఐటీ ఆఫీసర్‌గా రవితేజ ఉంటారు. యాక్షన్‍లోనూ తన స్టైల్‍తో మాస్ మహారాజ అదరగొట్టారు. వింటేజ్ లుక్‍తో కనిపించారు. “సక్సెస్.. ఫెయిల్యూర్స్ ఇంటికి వచ్చే చుట్టాల్లాంటివి.. వస్తుంటాయి.. పోతుంటాయి. యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది.. అది పోయే దాకా మనతోనే ఉంటుంది” అని రవితేజ పవర్‌ఫుల్ డైలాగ్ ఉంది.

మిస్టర్ బచ్చన్ టీజర్‌లో డైరెక్టర్ హరీశ్ శంకర్ మార్క్ కనిపించింది. యాక్షన్ స్టైలిష్‍గా ఉంది. రవితేజ యాక్షన్, ఈజ్, వింటేజ్ లుక్ అదిరిపోయాయి. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. టీజర్లో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ మెప్పించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన రెండు పాటలు పాపులర్ అయ్యాయి.

మిస్టర్ బచ్చన్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. అయనంక బోస్ సినిమాటోగ్రఫీ చేయగా.. ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ చేశారు.

మిస్టర్ బచ్చన్ ఓటీటీ హక్కులు

మిస్టర్ బచ్చన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. మంచి ధరకే ఈ రైట్స్ సొంతం చేసుకుందని సమాచారం. స్ట్రీమింగ్ పార్ట్‌నర్ నెట్‍ఫ్లిక్స్ అని ఇప్పటికే బయటి రాగా.. నేడు టీజర్‌తో అధికారికంగా కన్ఫర్మ్ అయింది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్‍కు వస్తుంది.

మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. అదే రోజున రామ్‍ పోతినేని - డైరెక్టర్ పూరి జగన్నాథ్ మూవీ డబుల్ ఇస్మార్ట్ కూడా విడుదలవుతుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ క్లాష్ ఇంట్రెస్టింగ్‍గా మారింది. రెండు చిత్రాలకు హైప్ ఉండటంతో ఓపెనింగ్ ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరంగా మారింది.

Whats_app_banner