Mr Bachchan Showreel: ఫుల్ యాక్షన్‍తో రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ షోరీల్ గ్లింప్స్.. నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారంటే..-mr bachchan showreel twitter review netizens saying ravi teja mass comeback loading bhagyashri borse pics viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mr Bachchan Showreel: ఫుల్ యాక్షన్‍తో రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ షోరీల్ గ్లింప్స్.. నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారంటే..

Mr Bachchan Showreel: ఫుల్ యాక్షన్‍తో రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ షోరీల్ గ్లింప్స్.. నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 17, 2024 05:39 PM IST

Mr Bachchan Showreel: మిస్టర్ బచ్చన్ షోరీల్ వచ్చేసింది. యాక్షన్‍తో హీరో రవితేజ కుమ్మేశారు. ఈ యాక్షన్ గ్లింప్స్‌పై నెటిజన్లు ఎలా రియాక్ట్ అవుతున్నారంటే..

Mr Bachchan Showreel: ఫుల్ యాక్షన్‍తో రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ షోరీల్ గ్లింప్స్.. నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారంటే..
Mr Bachchan Showreel: ఫుల్ యాక్షన్‍తో రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ షోరీల్ గ్లింప్స్.. నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారంటే..

Mr Bachchan Showreel: మాస్ మహారాజ రవితేజకు ధమాకా (2022) తర్వాత ఆ రేంజ్ హిట్ దక్కలేదు. గతేడాది రావణాసుర, భారీ అంచనాలతో వచ్చిన టైగర్ నాగేశ్వరరావు నిరాశపరిచాయి. ఈ ఏడాది ఈగల్ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నారు రవితేజ. ఒకప్పుడు మిరపకాయ్ (2011) చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన ఈ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఈ మూవీపై చాలా క్రేజ్ ఉంది. ఈ మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి నేడు (జూన్ 17) షోరీల్ అంటూ ఓ గ్లింప్స్ వచ్చింది.

యాక్షన్‍తో కుమ్మేసిన రవితేజ

మిస్టర్ బచ్చన్ షో రీల్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్‌గా ఉంది. రవితేజ ఎంట్రీ పవర్‌ఫుల్‍గా స్టైలిష్‍గా ఉంది. మొదటి నుంచే మాస్ యాక్షన్‍తో కుమ్ముశారు రవితేజ. ఈ మూవీలో పవర్ ప్యాక్డ్ క్యారెక్టర్ అని అర్థమవుతోంది. జగపతి బాబు ఈ చిత్రంలో విలన్‍గా నటిస్తున్నారు. రవితేజ, జగపతి బాబు క్యారెక్టర్లే ఈ చిత్రంలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య ఇంటెన్స్ సీన్లు ఉన్నట్టు అర్థమవుతోంది. రవితేజ స్వాగ్, స్టైల్ అదిరిపోయాయి. ఈ షోరీల్‍లో హీరోయిన్ భాగ్యశ్రీ బోస్లే కూడా కనిపించారు. అయితే, ఈ షోరీల్‍లో ఒక్క డైలాగ్ కూడా లేదు.

మిస్టర్ బచ్చన్ సినిమా పీరియాడిక్ బ్యాక్‍డ్రాప్‍లో తెరకెక్కినట్టు ఈ షోరీల్‍తో అర్థమవుతోంది. ఈ షోరీల్‍లో లొకేషన్లు, గెటప్‍లు 1980ల్లోలా ఉన్నాయి. వెనుక బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ పోస్టర్ ముందు స్టైలిష్‍గా రవితేజ సిగరెట్ తాగుతున్న సూపర్ షాట్‍తో ఈ షోరీల్ ఎండ్ అయింది. తనకు ఎంతో ఇష్టమైన అమితాబ్ బచ్చన్ పేరుతో రవితేజ ఈ మూవీ చేస్తున్నారు. 59 సెకన్లు ఉన్న ఈ గ్లింప్స్ పవర్ ఫుల్ యాక్షన్‍తో నిండిపోయింది. డైరెక్టర్ హరీశ్ శంకర్ మార్క్ స్పష్టంగా కనిపించింది. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

నెటిజన్ల రియాక్షన్ ఇదే

మిస్టర్ బచ్చన్ షోరీల్‍కు సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. రవితేజ మాస్ క్యామ్‍బాక్ ఈ మూవీతో పక్కా అని చాలా మంది నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా స్టైలిష్ యాక్షన్‍కు సలామ్ అంటున్నారు. రవితేజ స్టైల్, స్వాగ్ వేరే లెవెల్‍లో ఉందని, బ్లాక్‍బస్టర్ సిగ్నల్స్ వచ్చేస్తున్నాయని కామెంట్లు చేస్తున్నారు.

రవితేజ అభిమానులకు డైరెక్టర్ హరీశ్ శంకర్ పూనకాలు తెప్పించడం ఖాయం అంటూ మరికొందరు అంటున్నారు. ఆంధ్రా అమితాబ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా అమితాబ్ పోస్టర్ ముందు రవితేజ ఉన్న లాస్ట్ షాట్‍తో అదిరిపోయే ఎండింగ్ ఉందని అంటున్నారు. హీరోయిన్ భాగ్యశ్రీ బోస్లే కాసేపే కనించినా ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍పై కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు.

మిస్టర్ బచ్చన్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీవీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే, ఈ షోరీల్‍లో రిలీజ్ గురించి మేకర్స్ ప్రస్తావించలేదు. ఆగస్టులో విడుదల చేసేలా ప్లానింగ్ ఉందని తెలుస్తోంది. పుష్ప 2 వాయిదా కన్ఫర్మ్ అయితే ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు మిస్టర్ బచ్చన్ టీమ్ ఆలోచిస్తోందని సినీ సర్కిల్‍లో టాక్ ఉంది.

WhatsApp channel