Ravi Teja Sreeleela: ధమాకా కాంబినేషన్ రిపీట్.. రవితేజ, శ్రీలీల మూవీ ప్రారంభం.. క్యూట్‌ లుక్‌లో కనిపిస్తున్న జోడీ-ravi teja sreeleela movie launched with a pooja ceremony dhamaka combination repeating ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ravi Teja Sreeleela: ధమాకా కాంబినేషన్ రిపీట్.. రవితేజ, శ్రీలీల మూవీ ప్రారంభం.. క్యూట్‌ లుక్‌లో కనిపిస్తున్న జోడీ

Ravi Teja Sreeleela: ధమాకా కాంబినేషన్ రిపీట్.. రవితేజ, శ్రీలీల మూవీ ప్రారంభం.. క్యూట్‌ లుక్‌లో కనిపిస్తున్న జోడీ

Hari Prasad S HT Telugu
Jun 11, 2024 10:19 AM IST

Ravi Teja Sreeleela: ధమాకా కాంబినేషన్ రిపీట్ అవుతోంది. రవితేజ, శ్రీలీల కలిసి నటిస్తున్న మరో మూవీ పూజా కార్యక్రమాలతో మంగళవారం (జూన్ 11) ప్రారంభం కావడం విశేషం.

ధమాకా కాంబినేషన్ రిపీట్.. రవితేజ, శ్రీలీల మూవీ ప్రారంభం.. క్యూట్‌ లుక్‌లో కనిపిస్తున్న జోడీ
ధమాకా కాంబినేషన్ రిపీట్.. రవితేజ, శ్రీలీల మూవీ ప్రారంభం.. క్యూట్‌ లుక్‌లో కనిపిస్తున్న జోడీ

Ravi Teja Sreeleela: మాస్ మహారాజా రవితేజ, క్యూట్ బేబీ శ్రీలీల కలిసి నటించిన ధమాకా మూవీ ఎంత పెద్ద హిట్టో మనకు తెలిసిందే. ఒకరకంగా రవితేజకు ఇండస్ట్రీలో మరో బ్రేక్ ఇచ్చిన మూవీ ఇది. ఇప్పుడీ మూవీ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. వీళ్లు కలిసి నటించబోతున్న సినిమా మంగళవారం (జూన్ 11) హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

రవితేజ, శ్రీలీల మూవీ

ఈగల్ డిజాస్టర్ తర్వాత రవితేజ డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మూవీ షూటింగ్ లో బిజీగా ఉంటూనే ఇప్పుడు శ్రీలీలతో మరో సినిమా ప్రారంభించాడు. కొత్త డైరెక్టర్ భాను భోగవరపు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ధమాకా మూవీతో హిట్ కొట్టిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మరో మ్యాజిక్ చేయనుంది.

పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను సితార ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో శ్రీలీల చాలా క్యూట్ గా కనిపిస్తోంది. రవితేజ కెరీర్లో 75వ సినిమా కావడంతో ప్రస్తుతానికి ఈ సినిమాను ఆర్టీ75గా పిలుస్తున్నారు. ధమాకాలో రవితేజ, శ్రీలీల రొమాన్స్, ఇద్దరూ కలిసి చేసిన మాస్ డ్యాన్స్‌లు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

దీంతో ఈ కొత్త సినిమా ప్రారంభంతోనే భారీ అంచనాలు ఉన్నాయి. నాగ వంశీకి చెందిన సితార ఎంటర్టైన్మెంట్స్, సాయి సౌజన్య ఫార్చూన్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ధమాకాకు మ్యూజిక్ అందించిన భీమ్ సీసిరోలియోనే ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. దీంతో మరోసారి ఈ జంట మాస్ స్టెప్పులతో అదరగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

శ్రీలీల చాలా రోజుల తర్వాత..

శ్రీలీలకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. అయితే వాటిలో చాలా వరకు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడటంతో ఐరన్ లెగ్ గా పేరు సంపాదించింది. దీంతో కొన్నాళ్లుగా ఆమె ఎలాంటి సినిమాలకు ఓకే చెప్పలేదు. అయితే తాజాగా బాలీవుడ్ లో ఆమెకు ఛాన్స్ వచ్చిందని, ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ డెబ్యూ మూవీలో ఆమె నటించబోతోందని వార్తలు వస్తున్నాయి.

ఈలోపే రవితేజతో ఈ సినిమా ప్రారంభమైంది. శ్రీలీల హీరోయిన్‍గా నటించిన స్కంద, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీమ్యాన్ సినిమాలు గతేడాది బాక్సాఫీస్ వద్ద భారీగా నిరాశపరిచాయి. భగవంత్ కేసరి విజయం సాధించినా.. ఈ మూవీలో ఆమెది హీరోయిన్ పాత్ర కాదు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో శ్రీలీల హీరోయిన్‍గా నటించిన గుంటూరు కారం కూడా హిట్ కాలేకపోయింది. దీంతో శ్రీలీలకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. అయితే, ఈ భామ జోరు మళ్లీ ఇప్పుడు పెరుగుతోంది.

నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్‍హుడ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్‍గా నటిస్తున్నారు. వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కల్యాణ్ హీరోగా ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలోనూ శ్రీలీల హీరోయిన్‍గా ఉన్నారు. అయితే, హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం నిలిచిపోయింది.