Ravi Teja: అమితాబ్ బచ్చన్‌కు లాగే రవితేజకు జరగడం కో ఇన్సిడెంట్.. డైరెక్టర్ హరీష్ శంకర్ కామెంట్స్-director harish shankar about ravi teja mr bachchan release date in trailer launch event amitabh bachchan sholay release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ravi Teja: అమితాబ్ బచ్చన్‌కు లాగే రవితేజకు జరగడం కో ఇన్సిడెంట్.. డైరెక్టర్ హరీష్ శంకర్ కామెంట్స్

Ravi Teja: అమితాబ్ బచ్చన్‌కు లాగే రవితేజకు జరగడం కో ఇన్సిడెంట్.. డైరెక్టర్ హరీష్ శంకర్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Aug 08, 2024 06:26 AM IST

Director Harish Shankar About Mr Bachchan Release Date: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సినిమాకు రిలీజ్ డేట్‌ నాడే రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా విడుదల కావడం కేవలం కో ఇన్సిడెంట్ అని డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పారు. మిస్టర్ బచ్చన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఇలా కామెంట్స్ చేశారు.

అమితాబ్ బచ్చన్‌కు లాగే రవితేజకు జరగడం కో ఇన్సిడెంట్.. డైరెక్టర్ హరీష్ శంకర్ కామెంట్స్
అమితాబ్ బచ్చన్‌కు లాగే రవితేజకు జరగడం కో ఇన్సిడెంట్.. డైరెక్టర్ హరీష్ శంకర్ కామెంట్స్

Harish Shankar In Mr Bachchan Trailer Launch: మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మూడో సినిమా 'మిస్టర్ బచ్చన్‌'. ఈ మూవీతో మరో మాస్ సునామీని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కానుంది. ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

ఇటీవల మిస్టర్ బచ్చన్ టీజర్‌తో పాటు పాటలు హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా బుధవారం (ఆగస్ట్ 7) నాడు మిస్టర్ బచ్చన్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా మిస్టర్ బచ్చన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. "రవితేజ గారు నా ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు. ఏం చేంజ్ అవ్వలేదు. 'మిరపకాయ్' సక్సెస్ మా కాంబినేషన్‌పై అంచనాలు పెంచింది. ఆ అంచనాలు దాటే సినిమా మిస్టర్ బచ్చన్ అవుతుందనే నమ్మకం ఉంది. మిరపకాయ్ అని ఆ సినిమాకు రవితేజ గారే టైటిల్ పెట్టారు. ఈ సినిమాకి కూడా ఆయనే టైటిల్ పెట్టారు" అని తెలిపారు.

"భాగ్యశ్రీ బోర్సే తెలుగు నేర్చుకొని మరీ డబ్బింగ్ చెప్పింది. తను చాలా హార్డ్ వర్క్ చేసింది. తన క్యారెక్టర్‌ని మ్యాచ్ చేసింది. ఆగస్ట్ 15న అమితాబ్ బచ్చన్ గారి షోలే సినిమా రిలీజైయింది. రవితేజ గారి బచ్చన్ అదే డేట్‌కి రావడం ప్యూర్ కో-ఇన్సిడెంట్. ఇది అనుకోకుండా వచ్చింది కాబట్టి ట్రైలర్‌లో యాడ్ చేశాం. ఆగస్ట్ 15న మా సినిమాతో పాటు డబుల్ ఇస్మార్ట్ వస్తోంది. రెండు సినిమాలని బ్లాక్ బస్టర్ చేయాలి" అని డైరెక్టర్ హరీష్ శంకర్ కోరారు.

ఇలా అమితాబ్ బచ్చన్‌ సినిమాకు జరిగినట్లే రవితేజ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కావడంపై అలా కామెంట్స్ చేశారు డైరెక్టర్ హరీష్ శంకర్. 

ఇక ఇదే ఈవెంట్‌లో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. "రవితేజ గారితో కలసి నటించడం, డ్యాన్స్ చేయడం మెమరబుల్. రవితేజ గారితో చేసిన సీన్స్ అన్నీ నా ఫేవరట్. రవితేజ గారు అందరి కో యాక్టర్స్‌తో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. రవితేజ గారితో వర్క్ చేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి, నిర్మాత విశ్వప్రసాద్ గారికి థాంక్ యూ. ఆగస్ట్ 15న అందరూ తప్పకుండా మిస్టర్ బచ్చన్ చూడండి" అని అన్నారు.

"ఈ సినిమా షూటింగ్ చాలా ఫన్‌తో చేశాం. ఆడియన్స్ చూసినప్పుడు కూడా చాలా ఫన్ ఉంటుంది. డైరెక్టర్ హరీష్ విజన్ చాలా క్లియర్‌గా ఉంటుంది. ఆయనతో వర్క్ చేయుడం ఒక పిక్నిక్‌లా ఉంది" అని డీవోపీ అయనంక బోస్ చెప్పారు. "హరీష్ శంకర్ గారు, రవితేజ గారిని ఎలా చూపించాలో అలా చూపించారు. చాలా మంచి సినిమా. సినిమా కోసం మీలానే ఎదురుచూస్తున్నాను" అని ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి తెలిపారు.