OTT Trending Movies: ఇవాళ టాప్ 10 ఓటీటీ ట్రెండింగ్ సినిమాలు ఇవే! ఒక్కటి కూడా మిస్ కావొద్దు! ఎందుకంటే?
OTT Trending Movies This Week In Netflix: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోని టాప్ 10 ట్రెండింగ్ సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. వాటిలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నుంచి బోల్డ్ రొమాంటిక్ మూవీ, బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
Today OTT Trending Movies: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఎంతో పాపులర్ అయింది నెట్‌ఫ్లిక్స్. డిజిటల్ స్ట్రీమింగ్ మాధ్యమంలో దిగ్గజంగా నెట్‌ఫ్లిక్స్ ఎదిగింది. ఇక ప్రతివారం సరికొత్త సినిమాలు, వెబ్ సిరీసులను డిఫరెంట్ కంటెంట్‌తో అందిస్తుంటుంది నెట్‌ఫ్లిక్స్. అలాంటి ఈ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
సవి ఓటీటీ
సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన హిందీ సినిమా సవి టాప్ 1 స్థానంతో మొదటి ప్లేసులో ట్రెండింగ్ అవుతోంది. సీనియర్ హీరో అనిల్ కపూర్, హర్షవర్దన్ రాణే, దివ్య ఖోస్లా కుమార్, రాఘేశ్వరి వంటి నటీనటులు నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అందుకే ఐమ్‌డీబీ నుంచి 6.8 రేటింగ్ అందుకుంది.
మహారాజ ఓటీటీ
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా మహారాజ. నితిలన్ స్వామినాథన్ తెరకెక్కించిన ఈ సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 2 స్థానంతో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ. 107 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి 8.7 ఐఎమ్‌డీబీ రేటింగ్ ఉంది.
మిస్టర్ అండ్ మిసెస్ మహి ఓటీటీ
దేవర బ్యూటి జాన్వీ కపూర్ నటించిన స్పోర్ట్స్ డ్రామా సినిమా మిస్టర్ అండ్ మిసెస్ మహి. జాన్వీతో రాజ్ కుమార్ రావు జోడీ కట్టిన ఈ హిందీ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో టాప్ 3 ట్రెండింగ్ జాబితాలో చోటు సంపాదించుకుంది. శరన్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఐమ్‌డీబీ రేటింగ్ 6.1గా ఉంది. అలాగే ఈ చిత్రం 40 కోట్లతో తెరకెక్కితే బాక్సాఫీస్ వద్ద రూ. 52 కోట్లు రాబట్టింది.
టారోట్ ఓటీటీ
హాలీవుడ్ నుంచి వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీ టారోట్. టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ అవంతిక వందనపు నటించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవలే రిలీజై టాప్ 4 స్థానం సంపాదించుకుంది. టారోట్ అనే గేమ్ ద్వారా ప్రేతాత్మలను పిలిచిన ఓ స్కూల్ విద్యార్థుల గ్యాంగ్ ఎలా చనిపోయారనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది.
మోడ్రన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి ఓటీటీ
నెట్‌ఫ్లికిస్ అందిచిన ఒరిజినల్ డాక్యుమెంటరీ సిరీస్ మోడ్రన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి. తెలుగు దర్శక దిగ్గజం రాజమౌళి జీవితానికి సంబంధించిన అంశాలతో రూపొందిన ఈ సిరీస్ టాప్ 5లో ట్రెండింగ్ అవుతోంది.
మహారాజ్ ఓటీటీ
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్, అర్జున్ రెడ్డి బ్యూటి షాలినీ పాండే నటించిన డ్రామా మూవీ మహారాజ్. చాలా రోజుల కిందటే ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 6 ప్లేస్ సంపాదించుకుంది.
శ్రీకాంత్ ఓటీటీ
ఏపీ పారిశ్రామిక వేత్త శ్రీకాంత్ బొల్ల బయోగ్రఫీగా వచ్చి హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా శ్రీకాంత్. రాజ్ కుమార్ రావు, అలయా ఎఫ్, జ్యోతిక, షరద్ ఖేల్‌కర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 7 ప్లేసులో ట్రెండింగ్‌లో ఉంది.
హసీనా దిల్‌రుబా ఓటీటీ
తాప్సీ 2021లో నటించిన బోల్డ్ అండ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ హసీనా దిల్‌రుబా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ అవుతోంది. టాప్ 8 ప్లేసులో ట్రెండ్ అవుతోన్న ఈ మూవీకి సీక్వెల్‌గా ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా మూవీ రానుంది. ఈ క్రమంలోనే మొదటి సినిమాకు ఆదరణ పెరిగినట్లు తెలుస్తోంది.
ఆడు జీవితం-ఘోస్ట్ బస్టర్స్
వీటితోపాటు మలయాళ బ్లాక్ బస్టర్ సర్వైవల్ థ్రిల్లర్ ఆడు జీవితం 9వ స్థానంలో హాలీవుడ్ హారర్ అండ్ కామెడీ ఫాంటసీ సినిమా ఘోస్ట్ బస్టర్స్ ఫ్రొజెన్ ఎంపైర్ 10వ ప్లేసులో నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ అవుతున్నాయి. అయితే, ఈ సినిమాలన్ని కచ్చితంగా చూసేవే అని చెప్పుకొవచ్చు. ఎందుకంటే వీటిలో మహరాజ్, టారోట్ తప్పా మిగతావన్నీ బ్లాక్ బస్టర్ సినిమాలే. ఇక డిఫరెంట్ సినిమా ఎక్స్‌పీరియన్స్ కోసం మహరాజ్, టారోట్ సినిమాలు చూడాల్సిందే.